రమణాశ్రమ లేఖలు 131 విచారమణిమాల 10.7.47
రమణాశ్రమ లేఖలు 131 విచారమణిమాల 10.7.47
https://bhagavanraman.blogspot.com/2019/04/131-10747.html
ముప్పదేండ్లకు పూర్వం భగవాన్ అరవంలో వ్రాసిన "విచార సాగర సార సంగ్రహ" మనే చిన్న పుస్తకం అరుణాచల మొదలియార్ ముద్రింపచేసారట. కాని, శ్రీవారి పేరందులో ప్రచురించనందున ఆ గ్రంథము అజ్ఞాతమై ఉన్నది. ఈ మధ్య, మలయాళభాషల్లో ఉన్న, విచారసాగరం ఒకరు తీసుకొని, తిరిగి ఇవ్వటంతో శ్రీవారి చేతికి వచ్చింది . అప్పుడీ విచారసాగర సారసంగ్రహం తాము వ్రాసినట్లు జ్ఞప్తికి వచ్చి "అచ్చు ప్రతి ఎక్కకోఉండా" లన్నారు భగవాన్ . వెదికితే శిథిలావస్థలో ఉన్న ఆ చిన్ని పుస్తకం దొరికింది. పునర్ముద్రణకు భక్తులు కాపీ చేస్తుంటే, "వైరాగ్యాన్ని గురించి జండా ఉపమానం చేర్చ" మన్నారు భగవాన్. "ఈ ఉపమానం యొక్క తాత్పర్యం ఏమి?" అని భక్తులడిగితే, భగవాన్ చిరునవ్వుతో "జ్ఞానికి విరాగమనే జండా, అజ్ఞానికి రాగమనే జండా, ఎదుట కట్టబడినట్లుఉండ వన్నమాట . అదిచూచే వీడు జ్ఞాని,వాడు అజ్ఞాని అని గుర్తింపవచ్చు. అజ్ఞానికి, ఒకవేళ ఆధి వ్యాధుల వల్ల విరాగం కలిగినా క్షణికమే. రాగామనే పతాకమే ముందుకు వచ్చి నిలుస్తుంది. విరాగమనే జెండా ఉందే , ఎప్పుడూ చలించదు. జ్ఞాని కంతకన్నా గొప్ప చిహ్నం ఏమున్నది?' అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/424483078367679/?app=fbl
"భగవాన్ ఈ పుస్తకం వ్రాసిన కారణమేమి?" అన్నారింకొకరు. "విచారసాగరం హిందీలో సాధు నిశ్చలదాసు, అనేక తర్కవాదాలతో నింపి వ్రాశారు. అది అనువదించి ముద్రించిన తమిళగ్రంధం అరుణాచల మొదలియార్ తెచ్చి, 'ఇది చాలా విస్తారంగా ఉన్నది . దీనిలో ముఖ్యాంశములు సంగ్రహించి భగవాన్ చిన్ని పుస్తకంగా వ్రాయా' లని పట్టుబట్టారు. పోనీ జ్ఞిజ్ఞాసువుల కనుకూలంగా ఉంటుందని వ్రాశాను. వారు వెంటనే ప్రకటించారు. ముప్పదేండ్లనాటి ముచ్చట " అన్నారు భగవాన్. "భగవాన్ పేరెందుకు ప్రకటించలేదో?" అన్నారా భక్తులు.
"ప్రకటిస్తే, అంతా ఒక్కొక్క గ్రంధం తెచ్చి, సంగ్రహంగా వ్రాయమంటారేమోనని నేనే వారించా" నన్నారు భగవాన్. "ఇంకా అజ్ఞాతమై, ఎన్ని రచనలున్నవో, దయచేసి సెలవిస్తే బాగుండునే" అన్నా నేను. 'సరిపోయింది. నీకేం పనిలేదు' అంటూ మౌనం వహించారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
ఈ పుస్తకానికి లోగడ ఉన్న పేరు సరికాదని "విచార మణిమాల"అని మార్చారు భగవాన్. ఈసారి భగవాన్ పేరు చేర్చి ప్రెస్సుకు పంపాలనుకుంటూ ఉంటే తెలుగులో కూడా శ్రీవారే వ్రాస్తే బాగుండునని మనస్సులో ఉన్నా, భగవాన్ ఒప్పుకోరని ఊరుకున్నాను. మౌనిగారు (శ్రీనివాసరావు) "తెలుగులో కూడా భగవాన్ వ్రాస్తే బాగుంటుంది . రెండూ ఒకేసారి ప్రచురించవచ్చు" నని రాజగోపాలయ్యరు చేత అడిగించి, "నాగమ్మ, నీవున్నూ ప్రార్ధించరాదా" అని నన్ను ప్రోత్సహించటం వల్ల శ్రీవారిని వేడుకున్నాను. "నేనేం తెలుగు పండితుడినా యేమి. మీరు వ్రాయరాదూ? నేనెందుకు వ్రాయటం" అంటూ కొంచెంసేపు వాదించినా, కరుణామయులు గనుక, కడకెట్లాగో మా ప్రార్థనానుసారం తామే తెలుగున అనువదించారు. *అది రెండు భాషలలోనూ త్వరగా ముద్రణ కాగలదు.* అది వచన కావ్యం. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సూత్రం వలె ఉన్నది.
T.Me/BhagavanRaman
*ఆ విచారమణిమాల రెండు భాషలలోనూ అప్పుడే ముద్రితమైనది.*
Comments
Post a Comment