రమణాశ్రమ లేఖలు 128 అభిషేకం 3.7.47
రమణాశ్రమ లేఖలు 128 అభిషేకం 3.7.47
https://bhagavanraman.blogspot.com/2019/04/128-3747.html
చాలాకాలం నుంచి వస్తూపోతూ ఉండే భక్తులొకరు, నిన్ననేదో గిరి నివాసమును గూర్చి ప్రసంగవశంగా భగవానునితో ఇట్లా అన్నారు. "కొండ మీద ఉండగా ఎవరో టెంకాయ నీళ్లతో భగవాననునకు అభిషేకం చేసారటగా?" భగవాన్ నవ్వుతూ "అవునవును విరూపాక్షగుహలో ఉండగా, ఉత్తరాది నుండి కొందరాడంగులు వచ్చారు. నేనక్కడి చింతచెట్టు క్రింద తిన్నె మీద చూచి చూడనట్లు కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కాసేపుండి వారేపోతారనుకున్నాను. ఉన్నట్లుండి టప్పున శబ్దమైంది. కళ్ళు తెరిచి చూతునుకదా నెత్తిన టెంకాయ నీళ్ళ అభిషేకం. అందులో, ఒక తల్లి చేసింది అభిషేకం. ఏం జేసేది? మౌనస్వామిని గదా? మాట్లాడనాయే. తుడుచుకునేందుకు ఈ తుండుగుడ్డయినా లేదప్పుడు. ఆ నీళ్లు అట్లాగే ఆరిపోయినవి. అదొక్కటేనా? కర్పూరం వెలిగించటాలు, కాళ్ళమీద నీళ్ళుపోసి, ఆ నీళ్లు తమ తలమీద ప్రోక్షించుకోటాలు తీర్ధాలు, ప్రసాదాలు ఎన్నో ఉపద్రవాలు. ఒక్కొక్కటీ వారించేే సరికి గగనమయ్యేది" అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/426105208205466/?app=fbl
దీనికి తార్కాణంగా నాలుగైదేండ్ల క్రితం కొన్ని సంభవాలు నేనే చూచాను. భగవాన్ స్నానం చేసే గదికి, ఆఫీసు వైపుగా ఒక తూమున్నది. దాని క్రింద కుండ గట్టి జాలుగా కాలువ కట్టారు. నిత్యం ఉదయాన స్నానం చేసే వేళకు కొందరు భక్తులు,ఆ తూము వద్దచేరి వారు స్నానం చేసిన నీళ్లు శిరస్సున చల్లుకొని, కళ్ళకద్దుకొని ఆచమించి వెళ్లేవారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగినంత కాలం ఏదో సరిపోయింది. రానురాను వంతులుపడి చెంబులు, బక్కెట్లు పట్టుకురావడం ఆరంభించారు. ఈ హడావిడిలో గడబిడ శబ్దం బయలుదేరి శ్రీవారి చెవిసోకింది. విషయం విచారించి తెలుసుకున్నారు. ఊరుకుంటారా? సేవకుల నుద్దేశించి "ఓహో? అదా సమాచారం. ఏదో సందడివిని, ఏమోననుకున్నాను. బాగున్నది. ఇది మానేట్టు చేస్తారా? లేకపోతే బయటనున్న కుళాయివద్ద స్నానం చేద్దునా? అట్లా చేస్తే, నా నిమిత్తము నీళ్లు కాచవలసిన పని మీకుండదు. ఆ తీర్ధనికై కాపలా కాయవలసిన కష్టం వారికీ ఉండదు. నాకేం కావాలి ఈ తుండుగుడ్డ,ఈ కౌపీనం రెండే గదా. ఆ కుళాయి వద్ద పిండుకొని స్నానం చేస్తే తీరిపోతుంది. కుళాయి కాకుంటే కొండకాలువలున్నవి, కోనేళ్ళన్నవి . ఎందుకీ ఉపద్రవం ఏమయ్యా? ఏమంటారు?" అని భగవాన్ గద్దించేసరికి వారు భయకంపితులై సర్వాధికారికి సర్వం నివేదిస్తే ఆ వేళకాగది ప్రక్కకు ఎవ్వరూ పోరాదని శాసించారు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
ఆ రోజుల్లోనే మరొకటి జరిగింది . పూర్వం మధ్యహ్న భోజనానంతరం కూడా ఎండలో కొండకు వెళ్లి వచ్చేవారు కదా భగవాన్ . తిరిగి వచ్చేటప్పుడు హాలు వద్ద గచ్చుమీదికి వచ్చి వెనుక వెంటనున్న వారు చెంబుతో నీళ్ళిస్తే కాళ్ళు కడుక్కొని లోపలికు వెళ్లేవారు. కొందరు చాటుగా కాచుకొని ఉండి వారటు హాల్లోకి వెళ్ళగానే , ఈ నీళ్ళు తల మీద ప్రోక్షించుకునేవారు . గాలించుట కారంభిస్తే నలుసులన్నీ బయట పడవలసిందే గదా? భగవాన్ ఇది గమనిస్తూనే ఉన్నారు కాబోలు . ఒక దినం మధ్యహ్నం బహుకాలంగా ఉంటూ భక్తులొకరీ జలం శిరస్సున చల్లుకోవటం కిటికీలోంచి చూచారు. సమయం చిక్కిందని పట్టుకొన్నారిక. "అదిగో,అవే చేష్టలు. ఎందుకెందుకని చూచి చూడనట్లూరుకుంటే మితిమీరుతున్నది. ఎన్నాళ్ళున్నా , ఎన్ని సార్లు విన్నా ఒక్కొక్కరికీ, ఈ చేష్టలు పోవే! ఏం పని ఇది? ఇక కాళ్లు కడుక్కోవటమే మానేస్తాను. తెలిసిందా?" అని గట్టిగా మందలించారుట. ఆ భక్తుడు నిర్విణ్ణుడై దుఃఖించి, లజ్జించి వెంటనే భగవానును సన్నిధికివెళ్లి క్షమాపణ చెప్పుకున్నాడు.
భగవాన్ వారినట్లు మందలించుటేగాక మర్నాటినుండీ కాళ్లు కడుక్కోననటం, సేవకులు బ్రతిమలాడటం జరిగిందట . నేనప్పుడు టౌవున్ లో ఉండటం వల్ల వెంటనే ఈ సంగతి తెలియలేదు. నాలుగురోజులు గడిచిన వెనకెవరో భిక్ష చేసి నన్ను భోజనానికి పిలిచారు. భోజనం చేసి అక్కడే ఉండిపోయినాను . భగవాన్ యథాప్రకారం కొండదిగి వస్తున్నారు. సాధనలో ఏదో సందేహం ఉండి, వచ్చి కూర్చున్న వెనుక సావకాశంగా ఉంటుంది కదా అడగవచ్చునని హాలుకు వెలుపల పడమర దిక్కున ఉన్న కిటికీవద్ద నిలుచున్నాను. ఎప్పుడైనా అట్లా అడగటం కద్దు. ఇప్పుడేమైంది అనుకున్నావ్. ఎప్పుడు తూర్పుగా మళ్ళేవారు. ఆనాడు నేనున్న వైపుకే తిరిగారు భగవాన్. జంకుతూనే ఒదిగి దోవ ఇచ్చాను. కొఱకొఱా నాకై చూచారు. గజగజా వణికాను. ఎందుకట్లా చూచారో తెలియలేదు. కిటికీ దాటి మలుపు తిరగబోతుంటే, కాళ్లకు నీళ్ళు ఈయబోయినారు సేవకులు. వద్దని గద్దించారు భగవాన్. "ఎండలో వచ్చారే స్వామి" అని వారంటే, "ఒస్తే ఏమయ్యా. మనం శుభ్రతకై చూస్తే, ఆ నీళ్ల నిమిత్తం ఎందరో కాచుకొని ఉంటారు. చాలు చాలును, కావాలంటే నీవు కడుక్కో" అంటూ హాల్లోకి ప్రవేశించారు భగవాన్.
మనవల్ల ఏమైనా అపచారం వచ్చిందా ఏమి అన్న భయంతో నా సందేహం నా వద్దనే ఉంచుకుని వెళ్ళానవతలకు. సాయంత్రం సమీపవర్తలను విచారించి సమాచారం తెలుసుకున్న వెనుక నా మనస్సుకు శాంతి కలిగింది.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment