రమణాశ్రమ లేఖలు 126 తెలిసీ తెలియని ప్రశ్నలు 28.6.47

రమణాశ్రమ లేఖలు 126 తెలిసీ తెలియని ప్రశ్నలు 28.6.47
https://bhagavanraman.blogspot.com/2019/04/126-28647.html
        నాలుగైదు రోజుల క్రితం ఈ వూళ్ళో  వైశ్యసంఘ సమావేశం జరిగింది. ఆంధ్రదేశం నుంచి వైశ్యప్రముఖులు అనేకులు వచ్చారు. మొన్న ఉదయం వారంతా ఆశ్రమానికి వచ్చి,  అందులో ప్రముఖులైన వారొకరు భగవాన్నుద్దేశించి  "స్వామీ, దేవుడే జీవుడైనాడు గదా? జీవుడికి కలిగే దుఃఖం దేవుడికి అంటునా?  లేదా?" అని ప్రశ్నించారు.
       https://www.facebook.com/359807631501891/posts/427168804765773/?app=fbl

       భగవాన్ వెంటనే బదులీయక మౌనం వహించారు. వారు కొంచమాగి "జవాబు చెప్పే వరకూ  ఉండమంటారా స్వామీ?" అన్నారు.  "ఈ అడిగేదెవరు?"  అన్నారు భగవాన్. "జీవుడు" అన్నారు వారు.  "ఆ జీవుడెవరు?" ఎట్లా ఉంటాడు? ఎక్కడ పుట్టుతాడు?  ఎక్కడ లయిస్తాడు అని విచారించి తెలుసుకుంటే,   జీవుడని చెప్పబడేవాడే  దేవుడవుతాడు. అప్పుడా జీవునకు కలిగే దుఃఖం దేవునకు అంటునో లేదో తెలుస్తుంది. తెలిస్తే ఏది బాధించదు"  అన్నారు భగవాన్.
        "అదే తెలియటం లేదే?"  అన్నారు వారు. "తన్ను తెలుసుకోవటానికి ప్రయత్నం అనవసరం.  నిద్రలో నీవున్నావు కాని  ఈ దృశ్యమంతా అణిగి వుంది. లేస్తావు. అన్ని వస్తవి. నీవు మాత్రం అప్పుడూ ఉన్నావు. ఇప్పుడూ ఉన్నావు. ఈ పైన వచ్చిందే తోసి వేయాలి" అన్నారు భగవాన్. ఎట్లా తోసివేయటం?" అన్నారు వారు:  "తాను, ఉన్నట్లుంటే అదే పోతుంది" ఉండుటే  తన స్వభావం. ఉన్నది ఉన్నట్లు చూస్తే,  లేనిది లేనట్లు పోతుంది"  అన్నారు భగవాన్. "అట్లు చూచేందుకు మార్గమేది?" అన్నారు వారు."తానెవరో,  తన యథార్ధ స్థితి ఏదో విచారించుటే"  నన్నారు భగవాన్. "ఆ విచారణ ఎట్లా కలుగుతుంది?" అన్నారు వారు. భగవాన్ "ఊ.ఊ" అంటూ ఊరుకున్నారు.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp

 
    వారు, రవంత ఎదురు చూచి  "సరే, ఇదే మార్గం" అంటూ సమీపవర్తులెంత వారించినా ఆగక భగవాన్ పాదాలు తాకి, వైశ్యసంఘంతో సహా వెళ్లారు. వారిని పోనిచ్చి, సమీపవర్తులతో,  "వారికి తెలియకనా?  మనలను పరీక్షిద్దామని అడుగుతారు. పాదాలు తాకగానే పని  తీరిందని వెళ్లారు.ఇంకేం గావాలి?"               అన్నారు భగవాన్ .
     
     నెల్లూరు జిల్లా నుండి వచ్చిన ధనవంతుడగు రెడ్డి ఒక రక్కడుండి  "స్వామీ, ఆనందమే ఆత్మ అంటారే? ఆనందమంటే,  దుఃఖరహితమైనదే గదా?  అయితే, జీవుడా ఆనందాన్ని పొందినప్పుడు దుఃఖం తెలియకుండా ఉంటుందా?"  అన్నారు.
     "దుఃఖం ఉంటేనే ఆనందం ఉంటుంది. ఇది దుఃఖమని తెలిస్తే గదా, అది ఆనందమని తెలియటానికి. దుఃఖం తెలియనప్పుడు, ఆనందం మాత్రం ఎట్లు తెలుస్తుంది. తెలుసుకునే వాడున్నంతవరకూ రెండూ  ఉండేవే. వస్తువు సుఖ దుఃఖాతీతం. అయితే వస్తువుకు సుఖమనే పేరు.  ఏమంటే  సదాసత్తుల కతీతం సత్తు.  జ్ఞానజ్ఞానాతీతం జ్ఞానం. విద్యావిద్యాతీతం విద్య.
     ఇదే విధంగా ఎన్నో చెప్పుతారు. మరి చెప్పేందుకేమున్నది?"   అన్నారు భగవాన్ .
 
ఉన్నది నలుబదిలోని భగవద్వచనము చూడు: 

10. అజ్ఞానము లేక జ్ఞానము లేదు. జ్ఞానము లేక యజ్ఞానము  లేదు.  అజ్ఞా నాజ్ఞానము  లెవ్వరికని అమ్మోదలైన  తన్నదా దెలియు  జ్ఞానమ

T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ