రమణాశ్రమ లేఖలు 177 మొదటి స్నానం_మొదటి క్షౌరం 12-4-48

రమణాశ్రమ లేఖలు 177 మొదటి స్నానం_మొదటి క్షౌరం 12-4-48
https://bhagavanraman.blogspot.com/2019/03/177-12-4-48.html
   నిన్న ఉదయాన చూచిన ప్రకృతి దృశ్యాన్ని గురించి మధ్యాహ్నమే నీకు లేఖ రాసి రవంత ఆలస్యంగా వెళ్ళాను. భగవాన్ నన్ను చూడగానే" రామచంద్ర అయ్యరూ, అనంత నారాయణ రావూ కలిసి ఇప్పుడే ఫోటో తీసారు." అని చెప్పారు.
అలాగా అన్నాను . ఎండవేళ కదా . సోఫాకు వెనుక పక్కన కట్టిన వటివేళ్ళ తడికలమీద నీళ్ళు చల్లి , ఆ తడికలకూ , సోఫాకూ మధ్య వున్న క్రోటన్ల మీద చిమ్మరిగొట్టంతో నీళ్ళు కొట్టి , ఆ తుప్పరలే భగవాన్ మీద కూడా పడేట్లు చేసాడు కృష్ణస్వామి . భగవాన్ ఒళ్ళంతా రుద్దుకుంటూ “ ఇదుగో ! అభిషేకం చేస్తున్నారు ” అని ముసిముసి నవ్వులు నవ్వి , ఏదో గత సమాచారం స్ఫురణకు వచ్చింది కాబోలు , అప్పుడు జరిగినట్లే అభినయిస్తూ ఇలా సెలవిచ్చారు :
https://www.facebook.com/359807631501891/posts/399019200914067/?app=fbl
     నేను ఈ వూరు వచ్చిన తరువాత నాలుగు నెలలవరకు స్నానం లేదు . ఏమీ లేదు. అరుణాచలేశ్వర ఆలయ ప్రాకారంలో ఉండగానే ఒక దినం పొన్ను స్వామి అనే ఒక భక్తుని భార్య వచ్చి , అమాంతం నన్ను లాగి కూర్చోబెట్టి సీకారతో తలంతా రుద్ది స్నానం చేయించింది . ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేదే . అప్పుడూ అలాగే వచ్చిందనుకున్నాను . వచ్చేటప్పుడే అన్నీ సిద్ధం చేసి తెచ్చుకున్నది . అదే మనకు మొదటి స్నానం . ” “ తరువాత రోజూ పొన్నం చేసేవారేనా ? ” అన్నాను . “ ఊహు స్నానం ఎక్కడిది ? చేయించే దేవరు ? ఆ తరువాత దాదాపు ఒక సంవత్సరానికి పైగా అలాగే పోయింది. గురుమూర్తంలో కొన్నాళ్ళున్నానా , అక్కడికి అట్టే జనులు వచ్చేవారు కారు. అందువల్ల తొందర లేకపోయింది . అయితే , మీనాక్షి అనే ఒకామె ఎప్పుడైనా ఆహారం తెచ్చి యిస్తూ ఉండేది . ఒకనాడు ఒక బాన తెచ్చి నీళ్లు కాస్తున్నది. ఎందుకో అనుకున్నాను . ఒక బుట్టలోంచి నూనె , సీకాయి మొదలైనవి తీసి స్వామీ ! రండని పించింది . ఆమె ఊరుకుంటుందా రెక్కపట్టి లాగి కూర్చోబెట్టి నూనె అంటి , స్నానం చేయించేసరికి జడలు గట్టిన జుట్టువిచ్ఛి సింగపు జూలల్లే వేలాడసాగింది . అది రెండో స్నానం . ఆ తరువాత పలనిస్వామి వచ్చాడు. ఏదో సరిపోయింది . ” అన్నారు భగవాన్ ,

      “ ఈ విషయం చరిత్రలో లేదే ? ” అన్నాను . " అవునవును . ఏమో , అపుడు రాయలేదు. క్షౌరం కూడా అంతే . ఇక్కడకు వచ్చినరోజే జరిగిన మొదటి క్షౌరం సంగతి చరిత్రలో ఉన్నది కదా , రెండవది ఒకటిన్నర సంవత్సరానికి జరిగింది . జుట్టంతా బుట్టవలె అల్లుకొనిపోతే , చిన్ని చిన్ని రాళూ దుమ్మూ దానిలో ఉండి , తలంతా బరువుగా ఉండేది . ఇంతంత గోళ్ళూ మొదలైన వాటితో భీభత్సంగా ఉండేవాణ్ణి . తరువాత అంతా బ్రతిమాలి క్షౌరం చేయించారు . తలంతా గుండు ! చేసిన తరువాత తల ఉన్నదా లేదా అని అనిపించింది . ఇలా ఇలా అడించి , చూచి ఆ - సరే . ఉన్నది ' అని అనుకున్నాను . అంత భారం తగ్గిందన్నమాట . అన్నారు భగవాన్ . " ఈ ఒకటిన్నర సంవత్సరం ఎవరూ ప్రయత్నించనే లేదా ? " అన్నారొక భక్తులు . " ఆ " యత్నించారు . సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ఉండగా ఇప్పుడు వకీలుగా ఉన్న నీలకంఠం తాతగారు నా వద్దకు వస్తూ ఉండేవారు .
వారి పేరూ నీలకంచెయ్యరే . చాల భక్తి కలవారు. ఒకనాడు ఈ ప్రయత్నంలో వచ్చారు. వచ్చిన వారు నాతో ఏమీ చెప్పకుండా కొంచెం దూరంలో ఎదురుగా నిలిచారు. మామూలుగానే వచ్చారని నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను. వెనుక వైపు టప్పు టప్పుమని శబ్ధమయింది.కన్నెత్తి చూస్తే మంగలి కత్తి నూరుతున్నాడు. పలక్కుండా లేచి పోయాను. పాపం వారు స్వామికి ఇష్టం లేదు కాబోలని చక్కా పోయినారు. పొన్ను స్వామి మీనాక్షి మాత్రం స్నానం చేసేదాకా విడువలేదు. రెక్కబట్టి లాగితే ఏం చేసేది? అన్నారు భగవాన్.

     " భగవాన్ వారికొక బిడ్డ వలే తోచారు కాబోలును" అన్నాను నేను." అదే_ అదే. ఇప్పచెట్టు కింద ఉండగా ఇంకొకటి కూడా జరిగింది. ఏమంటే: ఇరువదేండ్ల వయస్సు గల రత్తమ్మ అనే దేవ దాసి కోవెలలో నాట్యమాడేందుకు వస్తూ పోతూ ఒకనాడు నన్ను చూసింది. అంతటితో నామీద భక్తి,, తన వృత్తి మీద విరక్తీ కలిగి ,  ఇంటికి వెళ్ళి ఆ బ్రాహ్మణస్వామికి అన్నం పెట్టందీ తానూ తిననని తల్లితో పట్టుపట్టింది. సరేనని ఇద్దరూ కలిసి అన్నం తెచ్చారు . నేనేం కళ్ళు తెరుస్తానా . పిలిస్తే పలుకుతానా ? ఒకే నిష్ఠలో ఉన్నాను . ఎలాగో త్రోవన పోయేవారి చేత చెయ్యి లాగించి , లేపి , ఆనాటికి పెట్టి వెళ్ళారు . స్వామికి పెట్టందీ తిననని రోజూ పట్టుపడితే , తల్లి “ నీవు చిన్నదానవే , ఆ స్వామి వయస్సు వచ్చినవాడే ! తాకితేగాని లేవడే , ఎలాగు ? ” అన్నది . ఆ రత్తమ్మ తన మేనమామ కొడుకు ఒకడుంటే వాణ్ణి సహాయం తెచ్చుకొని రోజూ వాడి చేత పెట్టించేది . కొన్నాళ్ళకు - ఆ పిల్లవాని బంధువులకది అవమానంగా ఉండి , వాణ్ణి పంపలేదు . ఇదా పట్టు విడువదు . కడకా ముసలిదే తెచ్చి , పెద్దది కనుక తాకితే తప్పులేదని , నన్ను కదిపి చెయ్యిలాగి పెట్టిపోయేది. ఆ ముసలిది త్వరలోనే పోయింది. నేనూ అక్కడుండ లేదు. ఆ రత్తమ్మ దూరం రాలేకపోయింది . వృత్తి లేకుంటే భుక్తి లేక ఒక్కనితోనే ఉండేది . జాతి ఏదైతేనేమి . పరిశుద్ధంగా ఉండేది . మహావైరాగ్యం , మంచి భక్తీను .
     పాపం ఒక్క కూతురుంటే , ఆ వృత్తే వద్దని పెళ్ళి చేసింది " అని సెలవిచ్చి , గద్గద కంఠులైనారు భగవాన్ .
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ