రమణాశ్రమ లేఖలు 174. గురుపాద మహిమ 8-4-48

రమణాశ్రమ లేఖలు 174. గురుపాద మహిమ 8-4-48
https://bhagavanraman.blogspot.com/2019/03/174-8-4-48.html
ఈ మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి భగవాన్ సన్నిధిలో ఒకరు " గురుపాద మహిమ ” అనే పాటలు పాడుతూ ఉన్నారు . పాట ముగియగానే భగవాన్ నన్నుద్దేశించి " ఇదుగో ! ఈ పాటలు తత్త్వరాయర్ స్వామి రాసినవి. గురుపాద మహిమ . విన్నారు కదూ ? ” అన్నారు . " పాటలు విన్నాను. అర్ధం మహత్తరంగా ఉండడం గమనించి ఎవరో పెద్దలు రాసి ఉంటారనే అనుకున్నాను "అన్నాను“ అవును . ఇందుకొక కథ ఉన్నది ” అన్నారు భగవాన్ . “ ఏమది ? ” అన్నాను .
https://www.facebook.com/359807631501891/posts/400495760766411/?app=fbl
    భగవాన్ సావధానులై “ అదా . ఈ తత్తరాయరూ , స్వరూపానందరూ కలిసి సద్గురుని అన్వేషించే నిమిత్తం బయలుదేరి ఇద్దరూ చెరి ఒక దిక్కకూ వెడుతూ ఒక ప్రమాణం చేసుకున్నారు . ' సద్గురువు నాకు ముందు లభిస్తే వారిని నీకు చూపుతాను . నీకు ముందు దొరికితే నాకు చూపాలి ' అని . తత్వరాయరుకు ఎంత వెదకినా గురువు దొరకనే లేదు . తత్వరాయరు మామ స్వరూపానంద వృద్ధులు కదా . ఆయన కొంతదూరం తిరిగి , అలసిపోయి , ఒకచోట చతికిల బడ్డాడు. ఇక తిరగలేనని అనిపించి ' ఓ ఈశ్వరా ! నేనిక కదలలేను . నీవే సద్గురువును నా వద్దకు పంపాలి ' అని ప్రార్థిస్తూ భారం భగవంతుని మీద వేసి మౌనంగా కూర్చున్నాడు . భగవదనుగ్రహం వల్ల సద్గురువు వారి వద్దకే తానుగా వచ్చి తత్త్వోపదేశం చేసాడు . ఆ ఉపదేశ వాక్యాలనే స్వరూపానంద తత్త్వసారమనే పేరుతో నూరు పద్యాలుగా రాసారు . వ్యాఖ్యాన సహితంగా ఆ గ్రంథం ప్రఖ్యాతి వహించి ఉన్నది . మామా , అల్లుడూ చేసుకొన్న ప్రమాణాన్ని అనుసరించి ప్రవర్తించడానికి మామకు దొరకిన గురువు త్వరలో గతించడం వల్ల వారిని, తత్వరాయరుకు చూపలేక , తామే మేనల్లునికి తత్వోపదేశం చేసారు. స్వరూపానంద తత్వసారం మాత్రమే రాసారు కాని , తత్త్వరాయరు లెక్కలేనన్ని పాటలు పాడారు . పోగా మిగిలినవి ఎన్నో ఉన్నవి . అందులో ఈ గురుపాద మహిమ ఒకటి .” అని సెలవిచ్చారు.
Telegram
T.me/bhagavanraman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ