రమణాశ్రమ లేఖలు 172 చదివినవారు 4 - 4 - 48
రమణాశ్రమ లేఖలు 172 చదివినవారు 4 - 4 - 48
https://bhagavanraman.blogspot.com/2019/03/173-6-4-48_9.html
నిన్న ఉదయం సర్వేపల్లి రాధాకృష్ణయ్యగారు కుటుంబంతో వచ్చారిక్కడికి . వారంతా భగవాన్ దర్శనం చేసుకొని అరుణాచలేశ్వరాలయానికి వెళ్ళివచ్చి భోజనానంతరం కొంచెం విశ్రమించి , సాయంత్రం మూడింటికే ఊరికి వెడతామని బయలుదేరి భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి సెలవడిగారు . భగవాన్ ప్రసన్నతతో సెలవు చిహ్నంగా తలఊపారు . ఆడవారితో కలిగిన పరిచితివల్ల కారువరకూ సాగనంపి వచ్చాను . నేను కూర్చోగానే “ ఏం ? వెళ్ళారా వారంతాను ? ” అన్నారు భగవాన్ . “ వెళ్ళారు ” అన్నాను . “ వీరు పదేళ్ళ క్రిందట ఒకసారి వచ్చి వెళ్ళారు . ప్రణవానందస్వామికి వేలువిడిచిన అన్న కొమారుడే , ” అన్నారు భగవాన్ . “ అలాగా ! ” అన్నాను .
https://www.facebook.com/359807631501891/posts/401578243991496/?app=fbl
ఇంతలో నా పక్కన కూర్చున్న ఐరోపియన్ స్త్రీలూ , గుజరాతీ స్త్రీలూ రాధాకృష్ణన్ భగవాన్ని ఏమైనా ప్రశ్నించారా ? భగవాన్ ఏం సెలవిచ్చారు ? అని మెల్లగా హిందీలో నన్నడగటం భగవాన్ గమనించి “ ఏమది ? ” అన్నారు . " రాధాకృష్ణన్ భగవాన్నేమైనా ప్రశ్నించారా ? ” అని అడుగుతున్నారు అన్నాను . “ అదా . వారంతా బాగా చదివినవారు . విషయమంతా తెలుసుకొనే ఉన్నారు . ఏమడుగుతారూ ? ” అన్నారు భగవాన్ . “ లోగడ వచ్చినప్పుడు ఏమైనా ప్రశ్నించారా ? ” అన్నారొక ఆంధ్రులు . “ ఊహూ . అప్పుడూఇంతే . ప్రణవానందుల ద్వారా మన విషయమంతా విని , వారితోనే వచ్చారు . వచ్చి కూర్చున్నారంతే . పెదవి కదపలేదు " అన్నారు భగవాన్ . “ బయట అంతంత ఉపన్యాసాలిస్తారు కదా , ఇక్కడ ఏమీ చర్చించక పలక్కుండా కూర్చున్నా రెందువల్లనో ? ” అన్నారా భక్తులు . భగవాన్ నవ్వుతూ “ 1938లో రాజేంద్రప్రసాదు ఇక్కడికి వచ్చారు . వారూ అంతే . నాల్గయిదు రోజులున్నా ఒక్కనాడైనా ప్రశ్నించలేదు . పలక్కుండా పిల్లిలాగా కూర్చునేవారు . వెళ్ళేటప్పుడు మాత్రం ' మహాత్మాకు , ఏం సందేశం ఇస్తారని అడిగారంతే . అదీ ప్రక్కనున్న వారెవరిచేతనో అడిగించారు ' అన్నారు భగవాన్ . “ మహాత్మా ఎప్పుడూ అంతరాత్మ ఈ విధంగా చెపుతున్నది ' అని కదా అంటారు . ఆ అంతరాత్మ అక్కడా ఉన్నది , ఇక్కడా ఉన్నది , ఎక్కడా వున్నదే . ఆ చెప్పేందు కేముంది ? అని భగవాన్ సెలవిచ్చారట కదా ” అన్నారా భక్తులు “ అవునవును . అప్పుడే జమ్నాలాల్ బజాజ్ కూడా వచ్చారు . వారూ అంతే వారున్నట్లు తెలియకుండా ప్రశాంతంగా కూర్చునేవారు . వేకువజామున మేమంతా కూరగాయలు తరుగుతుంటే , మాతోపాటుగా తామూ తరుగుతూ కూర్చునేవారు . కడపట మాత్రం కొన్ని ప్రశ్నలడిగి తెలుసుకొన్నారు అంతే అన్నారు భగవాన్ .
" 1944లో , మను సుబేదారు ( జ్ఞానేశ్వర భగవద్గీతకు అనువాదకర్త) వచ్చినప్పుడూ ఏమీ ప్రశ్నించినట్లు లేదే ? ” అన్నారా భక్తులు . “ అవును . అప్పుడిక్కడ ఎవరో ఋభుగీత చదువుతుంటే విని 'అన్ని గ్రంథాలలోనూ సిద్దస్థితిని గురించే ఎక్కువగా చెప్తారు కాని , సాధక స్థితిని గుఱించి చెప్పరేమి ? " అని ఎవరిచేతనో అడిగించారు . అప్పుడే భక్త విజయంలో వున్న విఠోబా జ్ఞానేశ్వర సంవాదం చూపించాము . అంతే వేరుగా ఏమీ ప్రశ్నించలేదు . వారంతా చదివినవారు . ప్రశ్నించేందు కేమున్నది ? శాంతి నిమిత్తం వస్తారిక్కడికి ” అన్నారు భగవాన్ సత్యమూర్తి , తిరు వి . కల్యాణసుందరం మొదలియారు , జ్ఞానియారు , బులుసు సాంబమూర్తి , టంగుటూరు ప్రకాశం , కరపాత్రస్వామి ఇత్యాదులంతా ఇక్కడకు వచ్చినప్పుడు మాట్లాడనే లేదు . వారంతా బయటికి వెడితే సింహాలల్లే గర్జిస్తూ బల్లగుద్ది ఉపన్యాసాలిస్తూ ఉంటారు భగవాన్ . ” అన్నారా భక్తులు. “అవునండీ . వారంతా బాగా చదివినవారు ! కొందరు రాస్తారు . కొందరు ఉపన్యాలిస్తారు . నాయనా అంతే ! ” అన్నారు భగవాన్.
అయితే , బాగా చదివిన వారంతా భగవాన్నేమీ ప్రశ్నించరన్న మాట . మా వంటి మధ్యరకమేనా వేధించేది ? అడక్కపోతే మాకే విధంగా తెలుస్తుంది భగవాన్ " అన్నారా భక్తులు . “ అది సరి . దానికేమి ? ” అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్ .
Telegram
T.me/BhagavaRaman
Comments
Post a Comment