రమణాశ్రమ లేఖలు 173. సాష్టాంగ నమస్కారం 6-4-48

రమణాశ్రమ లేఖలు 173. సాష్టాంగ నమస్కారం  6-4-48 
https://bhagavanraman.blogspot.com/2019/03/173-6-4-48.html
     మధ్యాహ్నం మూడింటికి నాలుగయిదేళ్ళ పిల్లవాడొకడు తల్లితో వచ్చాడు . తల్లి భగనానుకు నమస్కరించి కూర్చుంది . ఆ పిల్లవాడు పదే పదే మొక్కుడం సాగించాడు. భగవాన్ నవ్వుతూ అనుచరులతో “ అదిగో చూడు . పదే పదే మొక్కడం  సాగించాడు . నమస్కారం చేస్తే మన ఇష్టం వచ్చినట్లు ఆడవచ్చునని అభిప్రాయం. ముందు మొక్కితే తరువాత చేష్టలు ఆరంభించవచ్చు . చిన్నవాడు వాడికేం తెలుసు . అంతా చేస్తుంటే తానూ ఆరంభించాడు . మొక్కినందుకు వెంటనే ఫలం దొరకాలోయ్ . వాడిక్కావలసింది అరటి పండు . ఇస్తే మానేస్తాడు . ఉంటే ఇవ్వు " అని ఇప్పిస్తే వెంటనే బిడ్డ కూర్చున్నాడు .
https://www.facebook.com/359807631501891/posts/400813854067935/?app=fbl
  కొంచెం ఆగిన తరువాత ఒకరు వచ్చి , భగవానుకు సాష్టాంగపడి ఏ వేళకూ లేవలేదు . సమీపస్తులు లేపి కూర్చోమన్నారు . అతడెలాగో లేచి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తూ , వారింపబడుతూ చివరకు కూర్చున్నాడు . భగవాన్ తమ పక్కనున్న వారితో “ నమస్కారమంటే పదే పదే మొక్కడమేనని వారి అభిప్రాయం . ఏం చేస్తాం . అసలు నమస్కారమంటే మనస్సణగటమే ” అన్నారు . ' సాష్టాంగ నమస్కారమంటే అర్థం ఏమిటి భగవాన్ ? " అన్నాడా భక్తుడు . " అదా , సా - అష్ట - అంగ - నమస్కారం . అంటే చేతులు రెండూ , కాళ్లు రెండూ , భుజాలు రెండూ , వక్షస్థలం , లలాటం ఈ ఎనిమిది అంగాలూ భూమి మీద ఆనించి నమస్కరించడం . ఆ సాష్టాంగ నమస్కృతి యొక్క భావం ఏమంటే ! ఈ మన్ను మన్నుతో చేరుతుంది నేను నేనుగా వుంటాను అని , ఆ తాత్పర్యం విచారించి తెలుసుకోవాలి . అది తెలుసుకోకుండా ఏం చేసినా లాభంలేదు .

   ఉట్టుట్టి నమస్కారంతోనే అంతా వశం కావాలంటారు . కోరిందల్లా స్వామి ఇచ్చివేయాలి . మూటా , ముల్లా కట్టి ఇచ్చేందుకు ? ఎవరైనా నమస్కారం చేసారంటేనే నాకు భయం . వాళ్ళకు మనం అణగి ఉండాలి . వాళ్లు చెప్పినట్లు మనం వినాలి . వారి కోర్కెలన్నీ తీర్చాలి . వారి మనస్సు తెలుసుకొని వర్తించాలి . ఒకటా నమస్కారం చేస్తే చాలు , మన మీద అధికారం వచ్చేస్తుంది.మనపాటే ఇలాగుంటే ఈశ్వరుని పాటో , పాపం వారు ఎందరికి అణగి ఉండాలో. ఎందరి మాట వినాలో , ఎందరికి వరమీయాలో చూడండి . స్వామిత్వానికే ఇంత ఉంటే వారిమాట చెప్పాలా , ఎవరైనా నమస్కారం చేయకుండా ఉంటే నాకు పరమ సంతోషం . ఎందుకంటే , మనం వాళ్ళకు కట్టుపడనక్కరలేదు కదాని. జ్ఞాని తానెప్పుడూ సమస్కారం , ఆశీర్వాదం చేయనక్కరలేదు . ఎందుకంటే వారి మనస్సెప్పుడూ అణగే ఉండడంవల్ల సదా అందరికీ నమస్కారం చేస్తూనే ఉన్నారన్నమాట . ' మనం నమస్కరిస్తే వారు ఎదురు నమస్కరించ లేదే . ఆశీర్వాదమైనా చేయలేదే . ఇదేమి స్వామిరా ? ' అని కొందరు అనుకుంటారేకానీ, ఎదుటివారు ఇంకా వంగక ముందే వీరు ( జ్ఞాని ) నమస్కరిస్తూ అణగిపోతారు. ఆశీర్వాదమన్నా అంతే . సదా మనస్సణగి ఉండడమే ఆశీర్వాదం . జ్ఞాని మనసు ఎప్పుడూ అణగే ఉంటుంది . ఇక చేసేదెవరు ? చేయబడేదేమి ? " అని సెలవిచ్చారు . భగవాన్ .
Telegram
T.me/BhagavaRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ