రమణాశ్రమ లేఖలు 170  చిన్ననోటు   27-3-48

 రమణాశ్రమ లేఖలు 170  చిన్ననోటు   27-3-48
https://bhagavanraman.blogspot.com/2019/03/170-27-3-48.html
   అముద్రితంగా ఉన్న రెండవ భాగం లేఖలు సరిచూచి కాపీ చేయడంలో “ దృష్టిం జ్ఞానమయీం కృత్వా ” అన్న శ్లోకం ఏ గ్రంథంలో ఉందో తెలియక భగవానుని అడగాలని ఈ ఉదయం తొందరగా వెళ్ళాను . భగవాన్ సావధానులై కూర్చుని ఉన్నారు. దగ్గరగా వెళ్ళి “దృష్టిం జ్ఞాన మయీం కృత్వా' అన్న శ్లోకం దేల్లో ఉన్నది?" అన్నాను. భగవాన్ ప్రసన్నవదనులై " "తేజోబిందు ఉపనిషత్తులో ఉంది. దానినే శంకరులు అపరోక్షానుభూతిలో రాసారు . రెండు శ్లోకాలవి .
   https://www.facebook.com/359807631501891/posts/402564960559491/?app=fbl
  "దుష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ !
   సా దృష్టి పరమోదారా న నాసాగ్రావలోకినీ | |
  
"ద్రపదర్శన దృశ్యానాం విరామో యత్ర వా భవేత్|
దృష్టిస్తత్రైవ కర్తవ్యా న నాసాగ్రావలోకినీ | |

  అంటే దృష్టి నాసాగ్రమందుకానీ , భ్రూమధ్యమందుకానీ నిలుపుట కాదు . చూచేవాడూ , చూడబడేదీ , చూపూ , ఈ వృత్తులన్నీ ఎక్కడ లయిస్తవో అక్కడ నిలుపవలెనని అర్థం . అదే జ్ఞాన దృష్టి . ఎప్పుడు దృష్టిని జ్ఞానమయం చేస్తారో అప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా తోస్తుందని తాత్పర్యం ” అని సెలవిచ్చారు .
 
  “ అలాగా ! ఆ శ్లోకాలు అపరోక్షానుభూతిలో ఉన్నవా ? అని ఊరుకున్నాను . ఆ పుస్తకం లైబ్రరీలో ఉన్నది కాని , ఎవరినో అడగాలి ఎందుకులే అన్న సంకోచంతో కావాలని అనలేదే కాని , శ్లోకపాదాలన్నీ జ్ఞప్తి లేనందువల్ల సంకటంగానే ఉన్నది . భగవానది గ్రహించి సేవకులొకరితో , “ ఏమోయ్ * పళనిస్వామి చిన్ననోటు పుస్తకం తీసివ్వు . ఆ డ్రాయర్లో ఉండాలి ” అన్నారు . డ్రాయరు సొరుగులో దాచిన నోటుబుక్కు తీసి దులిపి ఇచ్చారా సేవకులు . బహు చిన్న పుస్తకం . సన్నని మలయాళపు లిపితో రాసి ఉంది . రాసేందుకు కాగితం కలం పుచ్చుకున్నారు భగవాన్ . “ లైబ్రరీలో అపరోక్షానుభూతి ఉందిగా ? ” అన్నాను చల్లగా . “ ఊ - ఎందుకు . రాసిస్తే పోతుంది ” అంటూ రాయడానికి ఆరంభించారు భగవాన్ . క్షణంలో ముత్యాలకోవవంటి అక్షరాలు కలిగిన కాగితం మీద , పేరుతో సహా వ్రాయబడిన శ్లోకాలు రెండూ నా చేతికి వచ్చాయి . అయాచితంగా లభించిన ఆ మహాభాగ్యానికి ఆనందిస్తూ, “శంకరులు ఉపనిషత్తుల్లో శ్లోకాలు అలాగే రాసుకున్నారా ? భావం తీసుకొని స్వయంగా రాసారా? అన్నాను.  “ అవే తీసి రాసారు . వారి చిన్ని చిన్ని పుస్తకాలన్నిటిలోనూ  ఉపనిషద్వాక్యాలే చాలా ఉన్నవి . పలనణి స్వామి 'శంకరుల శ్లోకాలేమైన రాసివ్వం'డని అడిగాడు . అప్పుడు మా దగ్గర పుస్తకమేది ? ఏవో చిత్తుకాగితాలు ఏరి కుట్టి ఈ పుస్తకం తయారుచేసి రాసి ఇచ్చాను . ఈ కాస్త పుస్తకంలో శంకరులవి పది గ్రంథాలు రాసి ఉన్నవి ” అని సెలవిచ్చారు భగవాన్ .

{(*పలనిస్వామి నోటిని భగవాన్ సెలవిచ్చిన ఆ చిన్న పుస్తకం ఇప్పటికీ ఆశ్రమంలో భద్రంగా ఉన్నది.)}
 
   "ఇదే మొదటి పుస్తకమన్న మాట !” అన్నాను . “అవునవును. అప్పుడు మనకు ఒక్క కుండ తప్ప వేరేమీ ఉండేవి కావు. ఈ పై తుండైనా లేదు .
  
   విరూపాక్ష గుహలో ఉండే మొదటి రోజుల్లో పలనిస్వామి ఒకే తుండు కట్టుకొని ఉండేవాడు. గుహకు అప్పుడు ఇనుప తలుపు లేదు. కర్ర తలుపూ, కఱ్ఱ గడియా ఉండేవి. ఒక పుడకతో బయటనుండే గడియవేసి కొండచుట్టి చుట్టి , ఎక్కడెక్కడికో పోయి, వారం పది రోజులకు వచ్చి పుడకతోనే తలుపు తెరిచేవాళ్ళం. అదే తాళపు చెవి. అది దాచవలసిన పనిలేదు. మాకిక ఈ పుస్తకం ఒక్కటే సామాను. అతడొక తుండు కట్టేవాడు. ఈ పుస్తకం ఒక్కటీ మొలలో మడిచి పెట్టుకునేవాడు . సరిపోయేది . ఇదే మాకు మొదటి సంసారం " అని నవ్వారు భగవాన్ .
  
   “సంస్కృత అక్షరం చూచేనా రాసింది ?” అన్నారొక భక్తులు . “అవును . అదీ అతడడిగితేనే. నాటికీ, నేటికీ నాకుగా ఒక్కటీ రాయలేదు ” అన్నారు భగవాన్. భగవాన్ కెందు కివన్నీను. అంతా పరేచ్చగానే చేస్తారు” అన్నారా భక్తులు “ఊ. ఇదే. అలా వచ్చిన సంసారంలో ఈ పుస్తకం మొదటి సంసారం" అని చెప్పి ఆ పుస్తకం అందరికీ చూపారు భగవాన్.
Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ