రమణాశ్రమ లేఖలు 169 నాస్తికులూ - అద్వైతులు 8-2-48

రమణాశ్రమ లేఖలు 169  నాస్తికులూ - అద్వైతులు  8-2-48
https://bhagavanraman.blogspot.com/2019/03/169.html
      ఈ ఉదయం నేను వెళ్ళేసరికి హాలంతా నిశ్శబ్దంగా ఉంది. అగరువత్తుల ధూపం హాలుచుట్టూ ఆవరించి సువాసనలు వెదజల్లుతోంది.. భగవాన్ పేపర్లు చదివి ముగించి, ప్రశాంతంగా కూర్చున్నారు . కృష్ణస్వామి గడియారానికి కీ ఇస్తున్నాడు. ఉన్నట్లుండి ఒకరు “ స్వామీ ! నాస్తికులూ - అద్వైతులూ వాద ప్రతివాదాలు చేసుకుంటారే , వారి అభిప్రాయ భేదాలేమిటి ? ” అని ప్రశ్నించారు.
https://www.facebook.com/359807631501891/posts/403037963845524/?app=fbl
   గడియారం టంగుటంగున గంటలు కొట్టింది . భగవాన్ చిరునవ్వుతో అభిప్రాయ భేదాలేమటా ? ఇదుగో చూడండి , ఈ గడియారానికి ఇప్పుడు ' కీ ' తిప్పారు కనుక తిరుగుతూ గంటలు కొట్టింది . తిప్పేవాడు ఒకడుండాలి , లేకుంటే గడియారం తిరుగదు అంటారు అద్వైతులు . తిప్పేవాడు ఉన్నాడని ఒప్పుకుంటే వాడిని తిప్పేందుకు ఇంకొకడుండాలి . అలా లెక్కిస్తే మొదలూ చివరా ఉండదు కాబట్టి కర్త అనేవాడు లేనే లేడంటారు నాస్తికులు . ఇవే అభిప్రాయ భేదాలు . చూడండి . ఈ తుండుగడ్డ ఉన్నది . పత్తి కంటే భిన్నం కాదు కదా ! అయితేనేమి ? ఏకులుగా , నూలుగా మారి వస్త్రంగా తయారయింది . ఈ నిర్మాణానికి కారణకర్త ఒకడుండాలి కదా ! సాలెవాడు అందుకు కర్త అని చెప్పినా , నానా రంగుల చిత్రవస్త్రాలూ నామమాత్రాలే కాని పత్తికన్నా వేరు కావనీ భావించినట్లే , నానావిధ లోక నిర్మాణానికి ఒక కర్త ఉన్నాడని ఒప్పుకున్నా  ఈ సమస్తం సత్తుకన్న భిన్నం కాదని అద్వైతులు   అవగాహన చేసుకుంటారు. చిన్నవీ పెద్దవిగా నానారకాల కుండలూ ఉంటవి . అంతా మన్నే కదా ! అందులో ఏదైనా ఒకటి పగిలితే ' అయ్యో ! కుండ పోయింది?' అంటాము . ఏం పోయింది , నామరూపాలే పోయినవి . అవి పోతే మన్ను మన్నుగానే ఉంటుంది . అయితే కుమ్మరివాడుంటే కదా కుండలు చేయడం . అందువల్ల నిమిత్తమాత్రంగా కర ఉన్నాడంటారు అద్వైతులు . లేడంటారు నాస్తికులు . వాదన పెరగడమేకాని ఫలితం సున్న , ఈ వాదించే వాడెవడో తెలుసుకుంటే ఏ చిక్కులూ ఉండవు " అని సెలవిచ్చారు .
  
   " ఎందుకో ఈ వాదనలన్నీ ? ” అన్నారా వృచ్ఛకులు . “ ఎందుకా ? ఏవేవో తలపులు లోపల ఉంటవి . ఉన్నవన్నీ బయటికి రావద్ధూ ? ” అన్నారు భగవాన్ , హాస్యంగా మాట్లాడే భక్తులొకరది విని , “ ఏమి భగవాన్ , లోపల ఉన్నదంతా బయటికి వస్తుందని తామెప్పుడూ సెలవిస్తారే , ఎలా వస్తుంది భగవాన్ . లోపల ఏమున్నది భగవాన్ ? ” అంటూ గుండెలు తడుముకున్నాడు . భగవాన్ నవ్వుతూ , “ అవునండి . లోపల లేందే బయటికి వస్తుందా ఏం ? ముందు లోపల సంకల్పం కలగందే బయట ఏమీ తోచదు . సంకల్పం లోపలే కదా పుట్టేది . అదే విజృంభించి పైకి వస్తుంది . ఎప్పుడు కానీ , ఏది కానీ లోపల ఉన్నదేనండి బైటకి వచ్చేది ” అని సెలవిచ్చారు .
Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ