రమణాశ్రమ లేఖలు 166. వృత్తిజన్య జ్ఞానం 13-1-48.

రమణాశ్రమ లేఖలు 166. వృత్తిజన్య జ్ఞానం  13-1-48
https://bhagavanraman.blogspot.com/2019/03/166-13-1-48.html
   ఈ ఉదయం అంతేవాసులలో ఒకరైన సుందరేశ అయ్యరు ఏదో పుస్తకాలు పుచ్చుకుని, శ్రీవారి సోఫా పక్కనే కూర్చుని, భగవాన్ ముఖ  ప్రసన్నతను  అవలోకించి  “ ఈ పుస్తకం మనోవృత్తి జ్ఞానమని' ఒక చోట రాసి ఉన్నది. మనోవృత్తి జ్ఞానమంటే అర్ధం ఏమిటి"? అని చల్లగా అడిగారు.
  https://www.facebook.com/359807631501891/posts/404192227063431/?app=fbl
    “ అదా , మనోవృతి లేనిది ఆత్మను తెలుసుకోవమనేది ఉండదు. ఆత్మను తెలుసుకోవాలి . తెలుసుకుందాము.తెలుసుకున్నారు. --అని అంటారు కదా. ఏవిధంగా తెలుసుకుంటారు?  తెలుసుకోవడానికి తానొకడు ఉండాలి. తాను, ఉన్నవాడే ననుకో.ఉన్నానని తెలుసుకోవడానికి ఒక వృత్తి కావద్ధా మరి?  అందువల్ల , అంతర్ముఖమైన మనోవృత్తిని   విజ్ఞానమనీ , ఆ వృత్తినే బహిర్ముఖం అయినప్పుడు అజ్ఞానమనీ అంటారు . ఆ అజ్ఞానానికే మనస్సు అనీ , చిత్తమనీ పేర్లు.ఆ వృత్తినే అంతర్ముఖమైనప్పుడు బుద్ధి అనీ , అహమనీ చెప్పవలసి ఉంటుంది. అన్నిటి కూడికయే అంతఃకరణము . అహము అచలం కదా ! ఈ అంతఃకరణ  అనే ఉపాధివల్ల బహిఃకరణాలైన పంచభూత సృష్టి కలిగింది .ఆ భూతాలు వ్యష్టి , సమష్టిగా పంచీకృతాలై , నానావిధ అంగాలతో కూడిన భూత శరీరం ఉత్పన్నమైంది . అంతఃకరణ అనే ఉపాధివల్ల కలిగిన ఈ భూత సృష్టినంతా తోసివేసి , మనస్సు అంతర్ముఖమైనప్పుడు వృత్తిజన్య జ్ఞానం కలుగుతుంది . అంటే వృత్తికి మూలం తెలుస్తుందన్న మాట . ఆ మూలానికే , అహం స్పురణ అనీ , ఆత్మ అనీ రకరకాల పేర్లు . మనస్సు వల్లనే కదా దాన్ని తెలుసుకోవడం , అందువల్ల దానినే మనోవృత్తి జ్ఞానమని అంటారు . అంటే శుద్ధసత్వమయమైన మనస్సని అర్ధం . నానా విధాలుగ విజృంభించేదీ అదే . తానుతానుగా ఉన్నట్లు ఉండేదీ అదే . దాన్ని ఏమైనా అనుకో . ఏదో ఒకటి , ” అని బోధించారు భగవాన్.
   
    ఈ ప్రసంగమంతా వింటూ కూర్చున్న నూతనులొకరు కొంచెం నిదానించి "స్వామీ ! జ్ఞానికి పరేచ్ఛా ప్రారబ్ధం తప్ప మరేవీ ఉండవంటారు నిజమేనా" అని ప్రశ్నించారు. “ఆ, అదేనండి. జ్ఞానికి, అజ్ఞానికీ ఇచ్చా, అనిచ్చా, పరేఛ్ఛా ప్రారబ్దాలు మూడూ సమంగానే ఉంటవి. అనుభవమూ అంతే . అయితే, జ్ఞానికి  నేను చేస్తున్నాననే తలపు ఉండదు. కాబట్టి, బంధం ఉండదు. అజ్ఞానికి నేను చేస్తున్నాననే తలపు ఉండడంవల్ల బంధం ఏర్పడుతుంది. ఇదే వ్యత్యాసం ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః 'అన్న ఉపనిషద్  వాక్యానుసారం అన్నిటికీ మనస్సే కారణం. ఆ మనస్సుకు తలపులే రూపం ఆ తలపులకు మూలం తెలుసుకుంటే బంధం ఉండదు. ఈ మూలమే తాను. తన్ను తా నరసి ఉన్నట్లు ఉంటే ఎన్ని తలపులు రానీ, పోనీ తన్నేమీ బాధించవు" అన్నారు భగవాన్ .
Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ