రమణాశ్రమ లేఖలు 165. అంతర్విచారణ తప్పదు 7-12-47

రమణాశ్రమ లేఖలు 165.  అంతర్విచారణ తప్పదు   7-12-47  
https://bhagavanraman.blogspot.com/2019/03/165-7-12-47.html
   ఈ మధ్య పట్నంలో ఉద్యోగస్తులుగా ఉన్న భక్తులు కొందరు ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళున్నారు. వారంతా ఒకనాడు భగవాన్ నివసించిన గురుమూర్తం, ప్రవాళగిరి చూచి సాయంత్రం వేదపారాయణ వేళకు తిరిగివచ్చారు . వేదపారాయణ అనంతరం భగవాన్ ఆ ప్రవాళగిరి మీద తాము నివసించినప్పటి సమాచారాలన్నీ వారికి వినోదంగా చెపుతూ “ అది చూచారా ? ఇది చూచారా ? ” అని అడుగుతూ ఉంటే ఆ భక్తులలో ఒకరు భగవాన్ని ఉద్దేశించి " ఆ కథలన్నీ భగవాన్ వినోదంగా సెలవిస్తారేకాని , ఇంతకు ముందే మేము అక్కడికి వెళ్ళి వచ్చాము . ఆ ప్రవాళగిరి మీద ఉన్న గుహలోకీ , చీకటి గదిలోకీ ఒక్కసారి వెళ్ళి వచ్చేసరికి మా ప్రాణం త్రాహిత్రాహి అయింది . భగవాన్ అక్కడ నివాసం చేసారంటే శరీరం నాది కాదనే భావం ఎంత దృఢపడాలో తెలుస్తూ ఉన్నది . మావంటి వారంతా ' ఎలా తరించాలి స్వామీ ! ' అంటే , ' నే నెవడనని విచారించు కుంటే చాలును ' అని సెలవిస్తారేకాని , పట్నవాసంలో ఉండి , ఉద్యోగాలు చేసే సంసారులకు అదెలా సాగుతుంది ? మనస్సు సదా వ్యవహారం మీదకే పోతుంటే శాంతి లభించేదెలా ? ” అన్నారు . భగవాన్ చిరునవ్వుతో వింటూ ఊరుకున్నారు .
https://www.facebook.com/359807631501891/posts/404979493651371/?app=fbl
  ఈ దినం ఉదయాన నేను వెళ్ళేసరికి ఇక్కడ  నివాసంగా ఉన్న ఒక భక్తుడు శ్రీవారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ"నిన్న సాయంత్రం పట్నంనుంచి వచ్చినవారు అడిగిన దానికి భగవాన్ సమాధానం చెప్పనే లేదు . ఎందువల్లనో? పూర్వం శివ ప్రకాశం పిళ్ళై 'అడవినివెరుత్తుం' అన్న పద్యం రాసినప్పుడూ భగవాన్ ఇలాగే నవ్వుతూ ఊరుకున్నారట. అదేమిటి భగవాన్!  అలా విజన స్థలంలో ఉంటేనే కానీ జ్ఞానులు కాలేరని అర్థమా ఏమి?"అన్నాడు.
 
     " కాలేరని ఎవరన్నారండీ ! వారి వారి సంస్కారాల ననుసరించి  చిత్తవృత్తి ఏర్పడుతుంది. కొందఱు అందరిలోనూ ఉండి అన్ని పనులూ చేస్తూనే ఆత్మ  ఆత్మవిచారణ చేసి జ్ఞానులౌతారు. జనక, వసిష్ఠ , రామ, కృష్ణాదులంతా అందుకు దృషాంతమే. కొందరికి అదంతా ఉపద్రవంగా తోచి , విజన ప్రదేశానికి (నిర్మానుష్య ప్రదేశానికి) వెళ్ళి ఆత్మవిచారణవల్లనే జ్ఞానం పొందుతారు . అందుకు సనక సనందనాదుల శుక వామదేవాదులూ ప్రమాణభూతులు  (సాక్షులు). ఎవరికైనా అంతర్విచారణ తప్పదు. అదే పురుషకారం. శరీరయాత్ర ప్రారబ్దానుసారం నడుస్తుంది . అందుకు మనమేం చెప్తాం ” అని సెలవిచ్చారు భగవాన్ .

   శివ ప్రకాశం పిళ్ళై రాసిన తమిళ పద్యానికి తాత్పర్యము ఈ దిగువన రాస్తున్నాను , చూడు :
 
      “ ఓ రమణ సద్గురూ ! శరీర పోషణాదులను వదలి యమనియమాదులతో కూడిన ఉత్తమ తపస్సును చేయకుంటే , విశుద్దమైన జ్ఞానము కలుగదు అని శ్రేష్ఠమైన నీ చరిత్ర వల్ల విశదీకరించి , నీ అడుగుల ననుసరించి నడిచే భక్తులకు సర్వం విడువనక్కరలేదు , విచారణయే చాలును అని చెప్పుటకు అర్థమేమి ?".
Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ