రమణాశ్రమ లేఖలు 158 ఎఱుక-మఱపు 21-11-47

రమణాశ్రమ లేఖలు 158  ఎఱుక-మఱపు 21-11-47
https://bhagavanraman.blogspot.com/2019/03/158-21-11-47.html
  ఈ మధ్యాహ్నం మూడు గంటలకు తెల్ల నెమలి భగవాన్ సన్నిధికి వచ్చి  అందరి మధ్యన సంచారిస్తూ ఉంది. ఒక భక్తుడు దాని సాధు జీవనం గమనించి "దీనికి జన్మాంతర వాసన ఉన్నట్లుందే,కాకుంటే, ఇందరి మధ్య ఇంత చొరవగా తిరుగుతుందా?" అన్నాడు " అందుకే ఇక్కడి వారంతా మాధవుడే ఇలా వచ్చాడని అంటారు" అన్నారు భగవాన్. "అయితే, గత జన్మలో నేను ఫలానా అని దానికి తెలుస్తుందా?" అన్నాడా భక్తుడు.
https://www.facebook.com/359807631501891/posts/408595329956454/?app=fbl
"అదెలా తెలుస్తుంది.  వాసనావశంవల్ల సంచరిస్తారేగాని గత జన్మలో పలానా జీవినని ఏ జీవికి తెలియదు. అదే  మఱపు. ఆ మఱపు ఉండడమే మేలయ్యింది. ఈ ఒక్క జీవితంలోని తలపులతోనే వేగలేకుండా ఉన్నమే. అవన్నీ తెలిస్తే భరించగలమా? గత జన్మల వృత్తాంతం తెలుసుకోవడం అంటే తన్ను తాను తెలుసుకోవడమే. ఆ ఎఱుక కలిగితే, ఈ జన్మ, ఆ జన్మ తోపకాలేనని తెలుస్తుంది.
అంతా సంకల్ప సృష్టేనాయే. యోగ వాసిష్ఠంలో ఈ సృష్టిని గుఱించి ఎన్ని రకాలుగా చెప్పారో చూడండి. గాధి విష్ణువునీ " నీ మాయా స్వరూపం చూడాలి" అంటే ఎన్ని విధాలుగానో చూపించాడు. లవణ మహారాజుకధా అంతే శుక్రుడి చరిత్ర ఇంకా వింత. సమాధిలో ఉన్నవాడు ఉన్నట్లే ఉండి శరీరం శిథిలమైనదీ తెలియకుండా ఎన్నో జన్మలెత్తి, కడకోక బ్రాహ్ముణుడై పుట్టి, మేరుగిరిపై తపస్సు చేస్తుంటే తండ్రియైన భృగువూ, కాలుడూ స్థూలశరీరంతోనే నడిచి వెళ్ళి ప్రభోదిస్తే, ఆ శుక్రుడు వారిద్దరితో కలిసి ఆ శరీరంలో ఈ శరీరం చూసినట్లు, యముని ఆజ్ఞవల్ల తిరిగి మొదటి శరీరంలోనే ప్రవేశించిట్లూ చెప్పారు. ఇంకా కొన్ని కథలలో ఒకరికి స్వప్నంగా తోచింది వేరొకరికి జాగ్రత్తగా తోచినట్లు చెప్పారు. ఇందులో ఏదీ యదార్థమైనది అన్నారు భగవాన్.

   "ఒకరికి స్వప్నంగా తోచిందే వేరొకరికి జాగ్రత్తలో యదార్థంగా ఎలా కనిపిస్తుంది? అన్నాడా భక్తుడు. "దానికేమి? అదీ స్వప్నమే కదా తెరమీద బొమ్మలవలె అన్నీ తోపాకాలే. వాస్తవానికి తాను ఏదీ కాదు. ఈ కానీ పోనీ బొమ్మలాటలో అప్పుడా బొమ్మ నేను, ఇప్పుడీ బొమ్మ నాది అన్న ఎఱుక కంటే మఱపే మేలు" అన్నారు భగవాన్ "లౌకిక మర్యాద ననుసరించి 'ఇది నాది' అనవలసివస్తుంది కదా?" అన్నాడా భక్తుడు " ఔనండి. అనవలసివస్తుంది అన్నంత మాత్రాన అన్నీ నేననుకొని ఖేదమోదాలు చెందవలసిన పనిలేదే. బండిలో పోతూ బండి నేనని అనుకుంటామా? సూర్యుడున్నాడు నీళ్ళతోనిండిన చిన్న కుండాలలోను, పెద్దనదులలోను, అద్దంలోనూ అన్నిటిలోను ప్రతిబింబిస్తాడు అంతమాత్రాన అవన్నీ తాననుకుంటాడా. అవి భిన్నమైనప్పుడు చింతిస్తాడా? మనకూ అంతే.
నేను శరీరం అనుకుంటేనే అన్నిభాదలూను. శరీరం నేను కాదాని తోసివేస్తే సూర్యునివలె తనంతట తాను ప్రకాశిస్తూ సర్వత్రా నిండివుంటాడు" అని సెలవిచ్చారు భగవాన్ అందుకు "నేనెవడను?"అనే విచార మార్గమే ముఖ్య సాధనమని కదా భగవాన్ సెలవిస్తారు? అన్నాడా భక్తుడు.

"ఔను, అయితే అనధికారికి ఈ విచార మార్గం చెప్పారాదని వాసిష్ఠంలో రామునికి వశిష్ట విశ్వామిత్రులు బోధించారు. మరికొన్ని గ్రంథాలలో చాలా జన్మలలో సాధన చేయాలని, పన్నెండేండ్లు గురుసేవచేసి ఉపదేశం పొందాలనీ ఏదో చెప్పారు.
ఎన్నో జన్మలంటే భీతి కలుగుతుందని మోక్షం పొందే ఉన్నవోయ్, పైన వచ్చే విషయాలే తోసివేయాలి, దానికే సాధన అని నేనంటాను అయితే పై మాటలన్నీ పెద్దలు వృథాగా చెప్పలేదు. 'నీవే బ్రహ్మము, మోక్షం పొందే ఉన్నావు' అని అంటే బ్రహ్మము కదా మోక్షం పొందే ఉన్నాను కదా అని సాధన చేయక విచ్చలవిడిగా సంచరిస్తారని అధికారి కానివానికి అది చెప్పారాదన్నారు. అంతే కానీ మరేమీ లేదు" అని చిరునవ్వుతో చెప్పారు భగవాన్.

   నూతనాగత భక్తులొకరు  అందుకొని "విశ్వo దర్పణదృశ్యామాన నగరితుల్యం నిజాంతర్గతం" అన్న శ్లోకంలో శంకరులు సెలవిచ్చినది కూడా జగత్తు మిధ్య, మాయ అనే దృష్టి సాదారణ జనులకే కానీ జ్ఞానులకు కాదనే కదా?" అన్నాడు.
"అవును జ్ఞాని దృష్టికి  అంతా బ్రహ్మమయంగానే తోస్తుంది అజ్ఞానికా ఏం చెప్పిన తెలియదు అందువల్ల శాస్త్రములు అన్నియు మధ్యములకేనండి"అని సెలవిచ్చారు భగవాన్
Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ