రమణాశ్రమ లేఖలు 157 సర్వ బంధువు19.11.47

సర్వబంధువు 157 | 19-11 - 47

      కొంతకాలంనుండి సాయంత్రం వేదపారాయణ వేళకు హాలు లోపల కొందరిని. వెలుపల కొందరినీ కూర్చోమని అనవలసి వస్తూంది, జూబ్లీ హాలు తయారయిన తరువాత సాయంత్రం వేద పారాయణం పూర్తిగా అక్కడికే మారింది. ఈ మార్పు  జరిగిన తరువాతే బరోడా రాణి పంపిన తెల్లనెమలి వచ్చింది. వచ్చిన కొత్తల్లో పసిది కావడం వల్ల దుష్టజంతువులు ఏం చేస్తాయో అని భగవాన్ దానిని ఒళ్ళంతా కళ్ళుగా కనిపెడుతూ వుండేవారు. రాత్రిళ్లు భగవాన్ హాల్లోనే దానికి నివాసం . అది వచ్చినప్పుడు వేసవి కనుక భగవాన్ జూబ్లీహాల్లోనే పడుకొనేవారు. అందువల్ల ఉషఃకాలంలో జరిగే ఉపనిషత్ పారాయణ అక్కడే జరిగేది. చలికాలం రాగానే రాత్రి భోజనానంతరం భగవాన్ పడక హాల్లోకి మార్చారు సేవకులు. ఈ నెమలి హాలుకు మధ్యనున్న పైదూలం మీద నివసించి ఉండడం వల్ల దాని మలమూత్ర విసర్జనతో దూలం క్రిందనున్న స్థలం భీభత్సమై ఉషాఃకాలంలో జరిగే ఉపనిషత్ పారాయణకు స్థలం చాలక ఇబ్బంది ఏర్పడింది. సేవకులు కొంచెం విసుగుదల చూపగానే “ఎందుకయ్యా విసుగు. దానికొక గూడు చేయించి జూబ్లీ హాలులో పెడితే సరిపోదా” అన్నారు భగవాన్. వెంటనే ఒక భక్తుడందుకు ఆమోదించి ఇనప గూడొకటి మందిరంలాగా తయారు చేయించాడు.

ఆ గూడు జూబ్లీహాలులో భగవాన్ కూర్చుండే రాతి సోఫాకు ప్రక్కనే పెట్టి నెమలి పడక అక్కడికే మార్చారు సేవకులు. తదాది రాత్రి భోజనానంతరం హాల్లో పడుకుంటున్న భగవాన్ జూబ్లీ హాలులోనే పడుకుంటానని పట్టుబట్టారు. ఈ నవంబరులో చలి విపరీతం కదా, బయట పడుకుంటే భగవాన్ శరీరానికి పడదని భక్తులకు భీతి కలిగి శ్రీవారితో మనవి చేసారు. భగవాన్ నవ్వుతూ "ఉండండయ్యా. వారెవరో ఎక్కడినుండో మనవద్దకు వచ్చారు. వచ్చినవారిని బయట పడుకోబెట్టి మనం లోపల పడుకోవడం ఏం మర్యాద? ఇంటికి బంధువు  వస్తే తగినట్లు పరామర్శ చేయక  చేయక వసారాలోనే ఉంచి మనం లోపల ధురితే బాగుంటుందా? వీలుంటే వారినీ లోనికి తీసుకొనిపోవాలి. లేకుంటే మనమూ వసారాలోనే పడుకోవాలి, అంతే. అంత చలిగా  ఉంటే మీరు లోపల పడుకోండి " అని సెలవిచ్చారు. “ భగవాన్ శరీరానికి జబ్బు చేస్తుంది దానికి తోడుగా మే మెవరమన్నా పడుకుంటాం ” అన్నారు సేవకులు మీకు మాత్రం జబ్బు చేయదా ఏమి? చాలు చాలును. కావాలంటే మీ లోపల చేరండి ' అని ఆ రాత్రి వారెంత చెప్పినా అంగీకరించక జుబ్లీ హాల్లోనే పడుకున్నారట భగవాన్.

  మరుదినం సాయంత్రం నాలుగు ముప్పావుకు భగవాన్ బయటికి వెళ్ళగానే జూబ్లీ హాలులోనున్న భగవాన్ పడక హాల్లోకి మార్చి వేదపారాయణం అక్కడ జరిగే ఏర్పాటు చేసాడు కృష్ణస్వామి. భగవాన్ తిరిగివస్తూ ఆ ఏర్పాటు చూచి " ఇదుగో ఇవే చేష్టలు. వారిని ఖైదీ చేసినట్లు అక్కడ పడవేసి, మనమంతా ఇక్కడ ఉండడమా. పైగా వేదపారాయణకు ఈ హాలు చాలకనే కదా అక్కడికి మార్చుకున్నాం. ఇంతట్లో ఈ హాలు పెరిగిందా ఏమి? మళ్ళీ కొందరిని లోపల ఉండనీయడం, కొందరిని బయటికి తరమటం మొదలా! ఎందుకిది. అక్కడే అన్నీ జరిపితే వారికి ( నెమలికి ) సందడీ ఉంటుంది, మనకు విశాలంగానూ వుంటుంది. రేపటి నుండి అక్కడే ఉండేట్లు ఏర్పాట్లు చేయాలి. పడక ఇక్కడకు మార్చారంటే నేను కూర్చోను సుమా! ” అని చాలా దూరం చెప్పి రాత్రి భోజనం తరువాత జూబ్లీ హాలులోకే పడక మార్చుకొని దానికి తోడుగా ఉండిపోయారు.

     ఆ మర్నాడు సాయంత్రం కూడా బయటికి వెడుతూ నెమలి గూడువైపు చూపి,“నేను తిరిగి వచ్చేసరికి వేదపారాయణాదులకు ఇక్కడ ఏర్పాటు చేస్తే సరే, లేకుంటే ఈ తుండుగుడ్డ పరచుకొని కూర్చుంటాను. ఆసనం అక్కడికి ఇక్కడికీ మార్చేందుకు శ్రమగా ఉంటే, పూర్తిగా రోజంతా ఇక్కడే ఉండిపోతాను. మీ యిష్టం . నాకేం కావాలి. ఈ తుండు చాలును ” అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ తిరిగి వచ్చేలోపల ఆసనం పాకలోకి వచ్చింది. ఆ వెంటనే ఆపాకంత పెంచడం, భగవాన్ పూర్తిగా అక్కడే ఉండిపోవడం జరిగింది. సన్నిధికి వచ్చిన 
Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ