రమణాశ్రమ లేఖలు 156 " తాను - తురీయం 30.10.47
రమణాశ్రమ లేఖలు 156 " తాను - తురీయం 30.10.47
https://bhagavanraman.blogspot.com/2019/03/156-301047.html
ఈ ఉదయం తమిళ భక్తులొకరు భగవాన్నుద్దేశించి “ స్వామీ! జీవేశ్వరులు వినా జగత్తు లేదంటారే , దాని భావమేమిటి? ” అని అడిగారు. అవును, జగజీవేశ్వరులు త్రిగుణాత్మకములు కదా! ” అన్నారు భగవాన్. “ ఈశ్వరుడూ త్రిగుణముల సమష్టిలో చేర్చవలసిన వాడేనా? ” అన్నారా భక్తులు. “ ఆహా ! సమిష్టియైన సత్యమే ఈశ్వరుడనీ, ( సమిష్టియైన ) రజస్సు జీవుడనీ, (సమిష్టియైన ) తమస్సు జగత్తనీ అంటారు. శుద్ద సత్త్వమే తాను ” అని సెలవిచ్చారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/409655856517068/?app=fbl
అక్కడే ఒక బెంగాలీ యువకుడుండి “ స్వామీ ! సమాధి కేవల నిర్వికల్పమనీ, సహజ నిర్వికల్పమనీ రెండు విధాలుగా చెప్పారే! వీటి లక్షణం ఏమిటి"? అన్నాడు. భగవాన్ అనుగ్రహంతో చూచి “ సహజంగానే ధ్యానం అలవరచుకొని, సమాధి సుఖం అనుభవించేవాడు, తాను ఏ పనులు చేసినా ఆ సమాధి నుండి జారడు. ఏ సంకల్పం రానీ ఏది పోనీ, తాను తానుగానే ఉంటాడు. దానినే సహజ నిర్వకల్ప మంటారు. కేవల నిర్వికల్పమంటే వాసనావశమై విజృంభించే మనస్సును బలాత్కారంగా అణచి సమాధినిష్టుడు కావటం. ఆ విధంగా చేసేవారు కొంత సేపుండి, కదలక మెదలక కొంతసేపుండి, యథాప్రకారం బాహ్యస్పురణకు వస్తారు. వీటినే నాశము, లయము అంటారు. నాశమునకు సహజనిర్వికల్పమని లయమునకు కేవల నిర్వికల్పమనీ పేర్లు. లయ సమాధి స్థితియందున్న వారికి మనస్సు బహిర్గతమైనప్పుడు తిరిగి తిరిగి లాగి పెట్టుకోవలసి ఉంటుంది మనస్సు నాశమైతే, వేచిన విత్తనంవలె మొలకెత్తదు. అటువంటివారు ఏది చేసినా నిమిత్తమాత్రమే. తమ స్థితినుండి జారరు. జారటం పట్టుకోవడం ఉన్నంతవరకూ సాధకులేగాని సిద్ధులు కారు. సహజ నిర్వికల్ప నిష్టులు నివాతదీపంవలె, నిస్తరంగ జలధివలె, చలన రహితులై వుంటారు. తాము వినా వేరొకటి వారి దృష్టికి గోచరించదు. అజ్ఞులకా, తాము వినా తదితరమే గోచరిస్తుంది. ఇదే భేదం” అని సెలవిచ్చారు.
రెండు రోజుల క్రిందట రామకృష్ణ మఠం నుండి వచ్చిన కాషాయాంబరదారి ఒకరు " స్వామీ! తురీయావస్థ అంటే ఏమి? ” అన్నారు. “ తురీయావస్ద అంటూ. వేరే లేదు స్వరూపమే తురీయం ” అన్నారు భగవాన్. తురీయమనీ , తురీయాతీత మనీ అంటారే మరి? ” అన్నారా పృచ్ఛకులు. “ ఉన్నది ఒకటే అవస్థ. దాన్నీ తురీయం అనండి, తురీయాతీతం అనండి. ఏమన్నా సరే. జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడూ ఒకటి తరువాత ఒకటిగ సినిమా సీనులు మారినట్లు మారుతూ ఉంటవి. మూడూ తోపకాలే. ఈ మూడింటికీ విలక్షణమై సాక్షిగా ఉన్నదేదో అదే తాను. మూడవస్థలనూ తోసివేస్తే ఉండేది తానేకదా. అదే తురీయావస్థ. పరిభాషలో తురీయమనీ , తురీయాతీతమనీ ఏదో చెప్తారే కాని వాస్తవానికి ఒకే అవస్థ ” అని సెలవిచ్చారు భగవాన్ .
Teleram
T.me/hagavanRaman
Comments
Post a Comment