రమణాశ్రమ లేఖలు 155 వివిధ భాషా పరిచయం 29.10.47
రమణాశ్రమ లేఖలు 155 వివిధ భాషా పరిచయం 29.10.47
https://bhagavanraman.blogspot.com/2019/03/155-291047.html
ఈ మధ్యాహ్నం రెండున్నర గంటలకు భగవాన్ మళయాళపు పుస్తకమేదో చరుపుకుంటూ సమీపంలో కూర్చున్న ఒక భక్తునితో మాట్లాడుతున్నారు .
https://www.facebook.com/359807631501891/posts/410204669795520/?app=fbl
"భగవాన్ మళయాళం చదవటం చిన్నతనంలోనే నేర్చుకున్నారా ? ” అన్నాడా భక్తుడు . “ ఊహూ , గురుమూర్తంలో వుండగా పలనిస్వామి కూడా ఉండేవాడు కదా. అతను అధ్యాత్మ రామాయణం దగ్గరుంచుకొని తరుచు చదువుతూ ఉండేవాడు , చదవ నేర్చిన ప్రతి మళయాళీ తప్పక ఆ గ్రంథం చదువుతాడు . అందువల్ల అతనికి సరిగా చదివేందుకు రాకున్నా అలాగే తప్పులు తప్పులుగా చదివేవాడు. మౌనస్వామిని కదా . విని పలక్కుండా ఉండేవాణ్ణి . తాటి తోపులో ప్రవేశించిన తరువాత ఒకనాడు ఈ పుస్తకం తీసి చూస్తే అంతా గ్రందాక్షరంవలె ఉంది . నాకు అదివరకే గ్రంథాక్షరం తెలిసి ఉండడం వల్ల సులభంగా రాయటం చదవటం నేరుకున్నాను . ఆ తరువాత వారికే నేను పాఠం చెపేవాణ్ణి. అని చెప్పారు భగవాన్.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
"తెలుగు ఎప్పుడు అబ్యాసమయ్యిందీ?" అన్నారొకరు. "ఎప్పుడవిరుపాక్ష గుహలో ఉండగా గంభీరం శేషయ్యరూ వాళ్ళు శ్లోకాలేమైనా తెలుగులో రాసి ఇవ్వమంటే పుస్తకంలో అక్షరానికి అక్షరం చూచి చూచి రాసేవాణ్ణి. అలాగే క్రమంగా అలవాటాయింది 1900 సంవత్సరంలోనే" అన్నారుభగవాన్ "నాగర లిపి నేర్చుకున్నదెప్పుడు" అన్నాను. "అదీ ఆ ప్రాంతంలోనే", అంటూ సమీపస్దులగు పాతభక్తులొకరిని చూచి "ముత్తూ, యజ్ఞరామ దీక్షితులూ మొదలైన వారంతా వస్తూ పోతూ ఉండేవాళ్ళా. వాళ్ళవద్ద నాగరాక్షరం పుస్తకాలు ఉంటే చూచి చూచి రాసేవాణ్ణి. అదే అలవాటయింది" అని సెలవిచ్చారు భగవాన్.
"నాయన వచ్చినతరువాత నేర్చుకున్నారని విన్నామే" అన్నారొకరు. "ఊహు. లేదు. వారు వచ్చినతరువాతతెలుగుధారాళంగా మాట్లాడటం అలవాటయింది. అంతే" అని చెప్పారు భగవాన్.
"తెలుగు చిన్నప్పుడే నేర్చుకున్నారని విన్నామే" అన్నారు మరొకరు "అప్పుడు రాయడం చదవడం రాదు. మా చిన్నతాతకు తెలుగు తెలుసు. వారు నన్ను పక్కలో పడుకోబెట్టుకొని 'కకు దీర్ఘమిస్తే కా' అని చెప్పేవారు. అంతే. వాళ్లకు శ్లోకాలు రాసి యిస్తూనే నేర్చుకున్నాను. తరువాత ఉపదేశసారం రాసినప్పుడు రామయోగి ఉండి, తెలుగులో కావాలంటే తమిళ ఛందస్సు ననుసరించి కొన్ని ద్విపదలు రాసి నాయనకు చూపితే, 'అయ్యో, ఇది తెలుగు ద్విపద కాదు. తమిళ సాంప్రదాయమే'నని, తెలుగు ద్విపదకు గణాలు చెప్పారు ఈ గణాలు ననుసరించి ఆరవంలో ఒక చిన్నసూత్రం రాసి పెట్టుకున్నాను. దాని ననుసరించి కొంచెం మారిస్తే ఈ ద్విపదకు సరిపోయింది. నాయనకు చూపితే 'ఆ,యిప్పుడు సరిపోయిందని చేయిపెట్టి దిద్దక, 'అలాగే అచ్చువేయవచ్చునని అన్నారు ఆ తరువాత బలరామరెడ్డి సులక్షణసారం తెస్తే, అది చూచి మిగతా వృత్తాల గణాలన్నీ సంగ్రహించి, రెండు పేజీలలో కాపీ చేసి, పెద్ద బాలశిక్షలో అంటించి పెట్టుకున్నాను. మనకు అదే సరిపోయింది. ఇప్పుడెవరైనా పద్యం చదివితే ,ఏ పద్యమయిందీ , ఎక్కడ తప్పువచ్చిందీ చులకనగా పట్టుకోవచ్చు . ఒక్కొక్క భాషా అలాగే అలవాటయింది . కావాలని ఒక్కటీ నేర్చుకోలేదు " అని సెలవిచ్చారు భగవాన్
T.Me/BhagavanRaman
Comments
Post a Comment