రమణాశ్రమ లేఖలు 154. వైరాగ్య బోధోపరతులు 18.10.47
రమణాశ్రమ లేఖలు 154. వైరాగ్య బోధోపరతులు 18.10.47
https://bhagavanraman.blogspot.com/2019/03/154-181047.html
ఈ మధ్య వాసుదేవ మననం చదువుతున్నాను. నిన్న వైరాగ్య బోధోపరతి వర్ణకంలో ' జ్ఞానం పూర్ణమైయుండి వైరాగ్యోపరతులు లేకున్నా, మోక్షం సిధ్ధంపగలద"న్న వాక్యంచదివి “ జ్ఞానికి విరాగమే చిహ్నమని కదా పెద్దల వాక్యం ఇది ఎలా పొసగుతుంది? " అని ఇవాళ భగవానుని అడిగాను.
https://www.facebook.com/359807631501891/posts/410677486414905/?app=fbl
" జ్ఞానికి విరాగమే చిహ్నమన్న మాట నిజమే. ప్రారబ్దవశాత్తు వారికొక వేళ రాగం కలిగినా, ఆది శరీరానికే కాని తనకు కాదని తెలుసుకొని ఉంటాడని కూడా దానిలోనే చెప్పారే, ఆ రాగంవల్ల జీవన్ముక్తి సుఖానికి భంగమే. కాని విదేహముక్తికి జ్ఞానమే ప్రధానం. జ్ఞానం లభిస్తే వైరగ్యోపరతులు లేకున్నా, మోక్షం లభిస్తుందంటే, మరణసమయంలో మోక్షం కలుగుతుందని తాత్పర్యం. వైరాగ్యోపరతులు ఉన్నా, జ్ఞానం లేకుంటే మోక్షం కలగదనీ, అయితే,ఈ వైరగ్యోపరతులు వృథా అవునా ఆంటే కావు, పుణ్యలోక ప్రాప్తికి కారణాలౌతాయని వాసుదేవ మననంలో చెప్పి ఉన్నారే ! ” అన్నారు భగవాన్ "
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
"అసలు వైరాగ్యోపరతులు లేకుండా జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది?" అన్నాను. భగవాన్ ఆదరంగా చూస్తూ, “ అవును . వైరాగ్యబోధోపరతులు మూడూ ఒకటిని విడిచి ఒకటి ఉండవు. జ్ఞానం కలిగిన తరువాత రాగయుక్తుడై వర్తించినా, విరాగం ఆంతర్యంలో ఉండే ఉంటుంది. జీవన్ముక్తి సుఖానుభూతికి మాత్రం అంతరాయమంటారు. ప్రారబ్ధం బలీయమై ఉండటంవల్ల వాసనల వివశతతో సంచరిస్తారే కానీ, వాస్తవానికి రాగం వారికంటదు. దానినే ప్రారబ్ధమంటారు? అని సెలవిచ్చారు భగవాన్
" అంటే స్వరూప జ్ఞానం కలిగినా, ప్రారబ్దం బలీయంగా ఉంటే వాసనలు తోసివేయ జాలరన్నమాట, ఆ వాసనాక్షయం అయ్యేంతవరకూ నిలకడగా శాంతి కుదరదు. అంతేనా? " అన్నాను. " అవును. వైరాగ్య బోధోపరతులు మూడూ స్థిరంగా కలవారు బహు ఉన్నతస్థితిలో ఉన్న వారే.వారే జీవన్ముక్తులన్నమాట. అలా కాకుండా జ్ఞాన ప్రధానులు ప్రారబ్దవశాత్తు రాగయుక్తులై సంచరించినా, అవేవీ తమవి కావని తెలుసుకొనే ఉంటారు. వాస్తవానికి రాగం వారికంటదు. ఇందుకే వాసిష్టంలో మూడవ భూమికలోనే వాసనక్షయమయి మనస్సు నశిస్తుందన్నారు. నాల్గవదయిన జ్ఞానభూమిక నాక్రమించిన తరువాత అయిదు, ఆఱు భూమికలతో పనిఏమి? అంటే వాసనాక్షయనికేనని ఏమేమో సమాధానాలు చెప్పారు. శంక ఉన్నంతవరకూ సమాధానం ఉంది. శంకారహితమే జ్ఞానం' అని చెప్పారు భగవాన్.
"జ్ఞానికి వైరాగ్యం ఎంతెంతగా అంటుకొని ఉంటుందో అంతంతగా శాంతి సుఖం లభిస్తాయి. అది సడలి ఎంతెంత దూరమౌతుందో అంతగా శాంతి దూరమౌతుందనా తాత్పర్యం ! ” అన్నాను. “ అవునవును. అదే తాత్పర్యం " అంటూ అచలత్వం వహించారు భగవాన్.
Comments
Post a Comment