రమణాశ్రమం లేఖలు 152 లక్ష్య దృష్టి 24.10.47

రమణాశ్రమం లేఖలు 152 లక్ష్య దృష్టి 24.10.47
https://bhagavanraman.blogspot.com/2019/03/152-241047.html
నిన్ననొక ఆడకోతి పసిపాప నెత్తుకొని భగవాన్ సోపా ప్రక్కన ఉన్న కిటికీలో నిలుచుంది. భగవాన్ ఏదో చదువుకుంటూ దాన్ని గమనించలేదు. కొంచెమాగి కిచ కిచ శబ్దం చేసింది. సేవకులొకరు "పోపో"మ్మని అదలించారు. పోలేదు భగవాన్ తిరిగి చూచి "ఉండండయ్యా, తన బిడ్డను భాగవానుకు చూపాలని తెచ్చింది. వీరంతా తెచ్చి చూపటం లేదూ. దాని బిడ్డ దానికెక్కువ. చూడండి ఎంత చిన్న బిడ్డో" అని దానివైపు తిరిగి "ఏమమ్మ, ఏం! బిడ్డను తెచ్చావా? మంచిది అని లాలనగా చెప్పి అరటి పళ్లు ఇప్పించి పంపారు. ఈ ఆగష్టు 15వ తేదీన స్వతంత్రదినం కనుక పతాకోత్సవం జరిపారిక్కడ అంతకుముందు పదకొండు పన్నెండు తేదీలలో సాయంత్రం అయిదింటికి భగవాన్ స్వర్ణోత్సవ పర్ణశాలలో కుర్చున్నప్పుడు వానరసైన్యం వచ్చి పళ్ళ నిమిత్తం తొందర కలిగిస్తే కృష్టస్వామి అదలిస్తూ వచ్చాడు. భగవాన్ చూసి ఏమోయ్ 15వ తేదీ వాటికీ స్వతంత్రదినమే. తరుమకుండా దర్బారు విందు చేయాలి. తెలుసునా? అని అంటూ ఉండేవారు.
14వ తేదీన ఆశ్రమవాసులలో కొందరు జెండా కట్టేందుకు సన్నాహం చేస్తూ హడావుడిగా తిరుగుతున్నారు. యధాప్రకారం వానరసైన్యం వస్తే తరుముతున్నారోక  సేవకులు. భగవాన్ అది చూచి "తోలకండయ్యా తోలకండి. వాటికీమాత్రం స్వరాజ్యం రాలేదా ఏం? శనగపప్పు, మరమరాలూ తెచ్చి విందు చెయ్యాలి కానీ, తరుముతరటయ్యా అన్నారు నవ్వుతూ "రేపుగదా స్వతంత్రదినం,నేడేమీ?" అన్నాడాతడు "ఓహో మీరంతా ఉత్సవానికి సన్నాహం చేసుకుంటూ ఉంటే అవి మాత్రం చేసుకోవద్దూ  వాటి సన్నాహంలో అవి ఉన్నవి దానికేమి" అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/411791009636886/?app=fbl
   ఇంకా కొన్నిసార్లు ఏం జరుగుతుందనుకున్నావ్. భగవాన్ హల్లో కూర్చుంటే కాళ్ళవైపున్న బీరువా దగ్గరో, పక్కలో కూర్చుంటే తల దగ్గరో, భక్తులర్పించే పళ్ళు పెట్టేటందుకు ఒకబుట్ట పెట్టుకొని సేవకులలో ఎవరో ఒకరు కూర్చుంటరు వారు అప్పుడప్పుడు కళ్ళు మూసుకోనో, రేడియో పాట వింటూ పరాకుగానో ఉంటారు. సమయం చూచి వానరవీరులు బుట్టలో పళ్ళు కాజేస్తుంటే సభ్యులెవరైనా అదలిస్తారు. భగవాన్ నవ్వుతూ "వీరు ఒకే నిష్ఠతో ధ్యాన సమాధి మగ్నులై ఊగుతుంటే వారువచ్చి పని చూచుకుంటున్నారు.  ఎవరో ఒకరు చూడాలి కదా. వీరు బుట్టలో పెడితే, వారు పొట్టలో పెడుతున్నారు. అంతే అని, "వీరు గానామృతపానం వల్ల మైమరచి ఉంటే, వారు ఫలరసాస్వాదనo చేస్తున్నారు మంచిదే కదా అని సేవకులెవ్వరు అక్కడ లేనప్పుడిది జరిగితే వారు రాగానే "ఏమయ్యా! మీరు ఎవరూ లేరు. అందువల్ల మీపని వారు చూచుకుంటున్నారు. మీకు సహాయం చేస్తున్నారయ్య. మీరిక కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు. కొండమీద ఉండగా వారే ఎక్కువగా నా దగ్గర ఉండేవారు. మీరిప్పుడు తరుముతారు కానీ అప్పుడు వారిదే రాజ్యం" అనీ చెపుతూ ఉంటారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
   క్రొత్తవారెవరైనా వస్తే ఒక్కొక్కసారి వారు తెచ్చే పళ్లల్లో కొన్ని దోవలోనే అటకాయించి కాజేయటం, మరికొన్నిసార్లు ప్రసాదంగా పుచ్చుకొన్నవి దగ్గర ఉంచుకొని కూర్చుంటే, తటాలున ఎగరదన్నుకొని పోవడము చేస్తుంటారా కపివీరులు. భగవాన్ నవ్వుతూ "వారి భాగం వారు తీసుకున్నారు. మీకెందుకయ్యా కోపం. వారిది లక్ష్య దృష్టి, ఎలాగో కనిపెడతారు. కనుగీటితే చాలు అందరూ వస్తారు. వచ్చి వారి భాగం వారు తీసుకుంటారు. మన దృష్టి ఎన్నిచోట్లకో పోతుంది. వారికి వీటిమీదనే దృష్టి. అందుకే వేదాంత భాషలో లక్ష్యదృష్టికి వానర దృష్టి ఉపమానంగా చెప్తారు, గురువు కన్ను గీటగానే శిష్యుడు విషయంగ్రహించాలని. అలా చేయకుంటే ఫలo దొరుకుతుందా?" అని సెలవిచ్చారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ