రమణాశ్రమ లేఖలు 151 స్వామిత్వం 22.10.47

రమణాశ్రమ లేఖలు 151 స్వామిత్వం 22.10.47 
https://bhagavanraman.blogspot.com/2019/03/151-221047.html
        భగవాన్ శరీరం ఈ మధ్య కొంచెం చిక్కి ఉన్నదికదా, ఆహారం తగినంత తీసుకోకుండా ఉండడమే అందుకు కారణం అని భక్తులలో కొందరి అభిప్రాయం. ఈ వదంతి విని ఒక బెంగాలీ యువతి నిన్న మధ్యాహ్నం బెంగుళూరు జామపండ్లు ముక్కలుగా కోసి ఉప్పూకారమూ కలిపి తెచ్చి ' భగవాన్ చాలా చిక్కిపోతున్నారే, ఇటువంటి పళ్ళూ మొదలైనవి ఏమైనా తీసుకోవడం మంచిది. గ్రహించండివి ' అని ప్రార్థించింది. భగవాన్ నవ్వుతూ “ఎవరు చిక్కింది? మీరా? నేనా?" అన్నారు. 'భగవానే' అన్నదామె. “సరిపోయింది. ఎవరు చిక్కిందీ తూకం వేస్తే తెలుస్తుంది. కావాలంటే అవన్నీ రోజూ మీరు తినండి. ఆ అలవాటంతా నాకెందుకు. ఇవాళ తెస్తే తెచ్చారు. ఇక తేకండి” అని చెప్పి కొన్ని ముక్కలు అనుచరులతో “ ఇదుగో ఆమె సన్నగా ఎట్లాగున్నదో చూడండి. ముందు ఆమెకు చాలా పెట్టి, తరువాత అందరికీ పంచండివి ” అని సెలవిచ్చారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/412322576250396/?app=fbl
     స్వతంత్రంగా మాట్లాడేవారొకరు "భగవాన్ ఈ మధ్య బొత్తిగా ఆహారం తగ్గించారే ఇలాగైతే ఎలా ” అన్నారు.“ ఓహో ! మీకెవరు చెప్పారు ? నాకు ఎంత కావాలో అంత తింటున్నాను. ఎక్కువ తిని ఒళ్లు పెంచి ఏంచేయాలి.  అదేకాక శరీరంలో ఎన్నో వ్యాధులు ఉంటవి. ఆహారం ఎక్కువైనకొద్దీ వాటికి బలం ఎక్కువౌతుంది. తగుమాత్రం తింటే బలం తగ్గిపోతుంది " అన్నారు భగవాన్. "చారు తాగటం , మజ్జిగ తాగటం కూడా మానారెందువల్ల ? ” అన్నారింకోకరు ఎందువల్లనా ? వడ్డన సమయంలో జరిగే లక్షణం చూస్తే మీకే తెలుస్తుంది బకెట్లల్లో పెద్ద పెద్ద గరిటెలు వేసుకొని మజ్జిగ తెస్తారు. మన వద్దకు వస్తే గరిటి నిండుగా ముణుగుతుంది. పక్క విస్తరివద్ద చూస్తే, సగానికి తీసి సగం పోసి సగం మిగులుస్తారు. అది చూచేసరికి మనకు కడుపునిండి చాలురా బాబూ అనిపిస్తుంది. అందువల్ల మనకూ సగమే చాలనుకున్నాను అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
     “ పోనీ పళ్ళరసమైనా తీసుకోరాదా ? ” అన్నారా భక్తులు. “ అదుగో మొదలు. ఒకొక్కరూ ఇదే మాట . మనకవన్నీ ఎలా వీలుపడతాయి ? ” అన్నారు భగవాన్. "అదేమి భగవాన్ . ఇక్కడికి ఎన్నో పళ్లు వస్తవికదా. వీలుపడకేమి? అయాచితంగా లభించినదాన్ని గ్రహించవచ్చునని తామే సెలవిచ్చి ఉన్నారే ? ” అన్నారా భక్తులు "ఓహో ! గ్రహించవచ్చును అంటే ప్రక్కవారిని వదిలిపెట్టి గ్రహించమనా అర్థం, అన్నారు భగవాన్. “పోనీ , ఎన్నో వస్తవాయె. అందరికీ ఇచ్చే గ్రహించేది. దాని కేమి ? " అన్నారా భక్తులు “ సరిపోయింది. అందరికీ ఇచ్చేందుకు మనకేమున్న దిక్కడ. స్వామికి నైవేద్య మన్నట్లు చూపి తీసుకొని పోతారు. ఉగ్రాణంలో పెట్టి తాళాలు వేస్తారు. వారిస్తే సరి లేకుంటే లేదు. తాళపు చెవులు ఉగ్రాణాధికారి స్వాధీనం. వారినెవరు పోయి అడుగుతారు. ఇలాగే ఒక్కొక్క దానికీ ఒక్కొక్క అధికారి ఉన్నారు. మనకు పనీ లేదు. స్వతంత్రమూ లేదు. అయితే ఒకటిలెండి. గుళ్ళో దేమునికన్న మనకు కొంచెం మేలే, ఎటుపోయేవి అటు పోగా మిగిలినవి పదిమందికీ వడ్డించే సమయంలోనైనా మనకొక బద్దవస్తుంది. స్వామిత్వ మంటే ఇదే ” అని నవ్వుతూ చెప్పారు భగవాన్.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
        ఇంతలో శివానందం వచ్చాడు. 15 రోజుల క్రిందట ఎవరో వచ్చి మిరియాలు తెస్తే అందులో కరక్కాయ, నిమ్మఉప్పు మొదలైన దినుసులన్ని వేసి నూరించి మాత్రలు కట్టించి ఆరబెట్టించారట భగవాన్. ఆ ఆరబెట్టిన మాత్రలు  ఈరోజున సీసాలో పోసాననీ, తెచ్చిస్తునా అనీ శివానందం  భగవాన్నడిగాడు. అవి కఫానికి మంచిదని భగవాన్ ఈ శీతకాలంలో అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. 15 రోజులుగ ప్రస్తావించక ఇప్పుడు అడిగేసరికి భగవాన్ నవ్వుతూ "ఓహో! ఇప్పుడు జ్ఞప్తికి వచ్చిందా ? సరి సరి , స్వామి అడుగునా లేదా ? అని నన్ను పరీక్షిస్తారు. ఒకవేళ అడిగితే ' ఇదేమిరా ! ఈ స్వామి అనీ అడగటం ఆరంభించాడు ' అంటారు. స్వామికి మనమీద ప్రియం ఉన్నాదా ? లేదా ? మనల్ని పలుకరిస్తారా ? లేదా ? ఏం చేస్తారో చూద్దాం అనీ కొందనుకుంటారు. ఏం చేసేది వీరందరి సర్టిఫికెట్ కావాలి. నాకు ఒక్క నమస్కారం చేసారంటే చాలు. వారు చెప్పినట్లు వినవలసిందే. స్వామిత్వమంటే ఏదో సుఖం అనుకుంటారు. ఇదిగో ఇదే స్వామిత్వం. స్వామిత్వమనే గ్రంథం ఒకటి రాస్తే బాగుండును". అన్నారు భగవాన్.
 https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
       "భగవాన్ బలే వింతగా సెలవిస్తారే ” అన్నాడా భక్తుడు. భగవాన్ చిరునవ్వుతో "వింత ఏముందండీ. అదంతా యథార్థమే . స్వామి పరుపులు పరచిన సోఫా  మీద హాయిగా కూర్చున్నాడు ఆయన కేమని అనుకునే వారెందరో ఉన్నారు. మన పాట్లు వారికేం తెలుస్తవి. అందుకే స్వామిత్వమనే గ్రంథం ఒకటి రాస్తే బాగుండునని అంటున్నాను. ఇక్కడికి వచ్చిన ఈ ఏబదేండ్ల జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాస్తే భారతమంత అవుతుంది. రాసేవారెవరైనా ఉంటే రాయవచ్చును " అన్నారు. “అదెవరు రాస్తారు భగవాన్ ” అన్నారా భక్తులు. 'దానికేమండీ.“అవునవును, సరిసరి ” అంటేనే స్వామిత్వమని అందరికీ  తెలుస్తుంది . రాస్తే ఏమి ? ” అని చెప్పి, నా వైపు చూచి “ ఏం ? రాయవచ్చును ” అని నవ్వారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ