రమణాశ్రమ లేఖలు 150 వెలగల కూరలు 18.10.47
రమణాశ్రమ లేఖలు 150 వెలగల కూరలు 18.10.47
https://bhagavanraman.blogspot.com/2019/03/150-181047.html
ఈ మధ్య ఆహారంలో ఏవో హెచ్చు తగ్గులు రావడం వల్ల భగవాన్ శరీరం కొంచెం నలతగా ఉంటూ వచ్చింది. అది గమనించి, ధనసంపత్తిగల కమలారాణి అనే ఒక భక్తురాలు ఖరీదైన కూరలతో వచ్చి ద్రాక్షపళ్ళు కలిపి వండి, ద్రవరూపకంగా చేసి, భగవానుకు ఇవ్వవలసిందని ఒకరిద్వారా పగలు పదిన్నరకు సన్నిధికి పంపింది. భోజనవేళకు పంపిందికదా పోనిమ్మని స్వీకరించారు భగవాన్. మరుదినం మళ్ళీ అదే విధంగా చేసి , అదే వేళకు పంపిందామె. భగవాన్ చూచి పరిచారకులతో “ రోజూ ఎందుకిది. ఇక పంపవద్దని చెప్పండి ” అన్నారు. ఆ మర్నాడు అదే విధంగా పంపింది అమ్మ. “అదుగో! మళ్ళీ. తేవద్దంటే వింటేగా, ముందే వద్దని అనవలసింది. తీసుకోవడం మనదే తప్పు" అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/412808626201791/?app=fbl
" ప్రస్తుతం భగవాన్ శరీరం నలతగా ఉన్నదికదా . ద్రాక్షపళ్ళు , కలిసిన ద్రవ పదార్థమయితే మంచిదని పంపుతోంది కాబోలు. దానికేమి?"అన్నారొక భక్తులు. "ఓహో! అలాగా ఆమె తరపున వకాల్తానామా పుచ్చుకున్నారా మీరు? ' అన్నారు భగవాన్ " అది కాదు భగవాన్. అటువంటి పదార్ధాలైతే ఆరోగ్యకరంగా ఉంటుందని అంటున్నాను' అన్నారా భక్తులు. “కావచ్చును. అయితే, అదంతా ధనవంతులకుగాని మనకు కాదండి" అన్నారు భగవాన్. "తానే నిత్యం చేసి పంపుతానంటోంది భగవాన్ అన్నారా భక్తులు. "సరిపోయింది. అలాగైతే ఇక్కడ తినేవారందరికీ పంపగలదేమో కనుక్కోండి ” అన్నారు భగవాన్. అందరికి ఎందుకు భగవాన్ " అన్నారు వారు. " నాకు మాత్రం ఎందుకు? అన్నారు భగవాన్. "భగవాన్ మటుకైతే సరిగాని అంత ఖరీదుగలది అందరికి చేసేందుకవుతుందా" అన్నారా భక్తులు. ఆ - అదీ సమాచారం. ఒక్కొక్కరూ ఇదే మాట భగవానుకు మాత్రం చేస్తామంటారు. భగవానుకు మంచిదైతే అందరికీ మంచిది కాదు కాబోలు. దీనికయ్యే ఖర్చుతో నూకలు కొని గంజి కాస్తే. నూరుమంది తాగవచ్చునే. మనకుగా ఎందుకీ ఖర్చు " అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
"భగవాన్ శరీరం బాగుండవలెననే కదా మా అందరి అభీప్రాయమూ అన్నారా భక్తులు. “ అది సరేనండి, ద్రాక్షపళ్ళూ, వెలగల కూరలూ కలిపి వండిన ఈ ద్రవపదార్థంతోనే ఆరోగ్యం వచ్చేస్తుందంటారా. అలాగైతే ధనికులంతా అది వాడుతూనే ఉంటారు కదా, వారంతా ఆరోగ్యంగా ఉండవలసిందేనే వారికే ఎక్కువ అనారోగ్యం ఉంటుందెందుకో. అంతకంటే తరవాణి నీళ్ళు తాగే దరిద్రులే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ఆ పుల్లనీళ్లు తాగితే ఉండే సుఖం మరి దేనిలోనూ లేదు. పూర్వం మేం వండే రోజుల్లో వేసంగి వచ్చిందంటే ఒక పెద్ద కుండ తెచ్చి అంతా తినగా మిగిలిన అన్నం దాంట్లో వేసి, నిండా నీళ్ళు పోసి, కొంచెం గంజి, కొంచెం మజ్జిగ పోసి, సొంఠి, దబ్బాకు వేసి ఉంచితే అదంతా పులిసి, చల్లబడి తేరుకుని ఉండేది. ఆ నీళ్లు తలా ఒక లోటాతో తీసుకుని రవంత ఉప్పుచేర్చి త్రాగితే ఎంతో హాయిగా ఉండేది . ఒక్క వ్యాధీ లేదు. ఇప్పుడూ ఆ పుల్లనీళ్లు రెండు లోటాలిస్తే చాలు నాకు. అన్ని సుస్తీలూ పోతవి. కానీ, ఆ పని ఎవరూ చేయరు. 'అయ్యో స్వామికి పుల్లనీళ్ళేమిటీ ? అంటారు. ఏం చేసేదీ ? ఒక్కపూట ఈ పదార్థాలకు అయ్యే ఖర్చు రూపాయికి తక్కువ ఉండదు. ఆ డబ్బుతో తమిదలు కొని, పిండి విసిరి పెట్టుకుంటే ఒక్క నెల అంబలి కాచి త్రాగేందుకు సరిపోతుంది. అది ఎంతో ఆరోగ్యకరము, బలకరమూను, ఒక్క మనిషికి ఒక్క పూట దీనికయ్యే ఖర్చుతో ఒక నెల బ్రతకవచ్చును. కొండమీద ఉండగా నేను అవన్నీ తిన్నాను. ఎంతో సుఖంగా ఉండేది. ఇప్పుడుఅదంతా వినేదెవరు? ద్రాక్షపండ్ల పులుసూ, టమేటా చారు ఏమేమో ఇస్తామంటారు. అదంతా మన కెందుకు, రేపటినుండి తేవద్దని గట్టిగా చెప్పి పంపండి " అని సెలవిచ్చారు భగవాన్.
అంతటితో అది నిలిచిపోయింది. “కొండమీద ఉండగా బిల్వఫలంలో ఉండే గుజ్జు తిని కూడా కొన్నాళ్లున్నాను. ” అని భగవాన్ అనేకసార్లు చెప్పారు . ఏ ఆహారంగానీ ఒంటరిగా తినటం వారికి గిట్టదు.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment