రమణాశ్రమ లేఖలు 200 యుక్తియుక్త బోధ (29 - 7 - 48 )

రమణాశ్రమ లేఖలు 200 యుక్తియుక్త బోధ  (29 - 7 - 48 )
https://bhagavanraman.blogspot.com/2019/02/200-29-7-48.html

ఈ ఉదయం తొమ్మిదీ ముప్పావుకు భగవాన్ లేచి బయటికి వెడుతుంటే మార్గంలో , శ్రీవారి శరీరం కొంచెం తూలింది . భగవాన్ సమ్మతించరని సేవకులు పట్టుకునేందుకు జంకారు . చాలాకాలం నుంచీ వస్తూపోతూ ఉండే భక్తులలొకరు ప్రక్కనే నడుస్తూ భగవానుని పట్టుకోబోయారు . వద్దని వారిని వారించి “ మీరంతా పట్టుకోవాలని వచ్చి పడదోస్తారు . చాలు మీ పట్టుకోవడాలు . మీరు పడకుండా చూసుకోండి ” అని చల్లగా అదలించారు భగవాన్ . ఈ మాటలలో ఎంతో విశేషార్థం వున్నది . భగవాన్ సాధారణంగా మాట్లాడినట్లే ఉన్నా ఆ మాటలలో యథార్థం స్ఫురిస్తూ ఉండడంవల్ల , అప్పుడే నోటు " చేసుకున్నాను . 

   ఇంతలో బయటకు వెళ్ళి వచ్చి యధాస్థానంలో కూర్చున్నారు భగవాన్. అంతకుముందే  ఒక యువకుడు దడబిడలుగా వచ్చి కూర్చుని ప్రయత్నించి ప్రయత్నించి " స్వామీ !  నా మనసులో ఒక ప్రశ్న ఉంది" అన్నాడు. ఆ ప్రశ్నయేమో మీరు చెప్పగలరా? నిన్నే అడగమంటారా? అన్నాడు." ఓహో ! అదా సంగతి. అంతే సామర్థ్యం నాకు లేదు బాబూ! ! ! , వీరు తెలిసినవారు కనుక పరేంగితజ్ఞానం ఉన్నది. ఆ శక్తి నాకెలా కలుగుతుందండీ"  అన్నారు భగవాన్ , ఆ యువకుడు. " అంతమాత్రం తెలియకుంటే తమ గొప్పయేమి ? " అని ధిక్కరించి మాట్లాడబోతూ ఉంటే . ప్రక్కనున్న వారు వారిస్తున్నారు . ఆ సందడి విని ముందుకువచ్చి కూర్చున్నాను . భగవాన్ ఇటు చూచి ' ఇదుగో ! వీరు నా మనసులో ఉన్న ప్రశ్న మీరు చెప్పగలరా ? సన్నే ఆగమంటారా ? ' అని అంటున్నారు. ఇంతవరకూ ఇలా అడిగిన వారెవ్వరూ లేరు . పాపం, నన్ను పరీక్షిస్తున్నారన్నమాట . మనుష్యుల సంగతి వస్తూనే తెలుస్తుంది . ఎందుకు వచ్చిందీ ఆ కూర్చునే వాలకమే చెపుతుంది . నన్ను పరీక్షించే బదులు ' ఈ అడిగేవాడెవడని తమ్ము తాము పరీక్షించుకుంటే ఎంతో మేలు కదా " అని సెలవిచ్చారు . 

  ఆ యువకుని ప్రక్కనే కూర్చున్న మరొక రందుకొని ' స్వామీ ! ' తానెవరని విచారించి తెలుసుకోవడమే జీవిత పరమావధి ' అని కదా తాము సెలవిస్తారు , ఆ తన్ను తాను తెలుసుకునేందుకు నామజపం మంచిదేనా ? దానివల్ల ఆ పరమావధిని చేరగలమా ? ' అన్నారు . " ఆహా ! మంచిదే . అదే , క్రమంగా ఆ పరమావధిని చేరుస్తుంది . పైదంతా పోగోట్టేందుకే నామజపం . పైదంతా పోతే నామమే వుంటుంది . ఆ ఉండేదేదో , అదే ఆత్మ , అదే దైవం , అదే పరమావధి . నామజపమంటే ఆ దైవానికి ఒక పేరు పెట్టి పిలుస్తున్నా మన్నమాట . ఇష్టమైనది ఏదో ఒక పేరు " అని సెలవిచ్చారు భగవాన్ .

  “ ఆ విధంగా ఏదో ఒక పేరుపెట్టి పిలిస్తే(జపిస్తే ) ఈశ్వరుడు ఆ ఇష్టదేవతా రూపం ధరించి వస్తాడా ? " అన్నాడా భక్తుడు . “ ఓ , ఏవిధంగా తలిస్తే ఆ విధంగా వస్తాడు . రాగానే ఏవేవో కావాలని వీరడుగుతారు . అడిగినవిచ్చి ఇక్కడ ఉండు నాయనా ' అని వారు చక్కాపోతారు . వీరిపని ఇంతే . ఇక్కడే ఉండిపోతారు . అన్నారు భగవాన్ . “ మేము భగవాన్నీ ఐహికమైన ఫలములు ఏమైనా అడిగితే అంతే చేస్తారు కాబోలును" అన్నాను. భగవానది వినీ విననట్లుండి మాట తప్పిస్తూ
"అందుకే వారికి (భగవంతునికి) రావాలంటే  భయం . వచ్చారా ? రిటైరై నీకున్న శక్తులన్నీ  నాకు ఇచ్చివేయమని అంటారు . పైగా ' ఉన్నదంతా మరెవ్వరికీ ఇవ్వరాదని కూడా అంటారు . అదే వారికి భయం . అందుకే రావడం ఆలస్యం చేస్తారు ” అని సెలవిచ్చారు.

  కొంచెం చొరవగల భక్తులు “ మహాత్ముల విషయం కూడా అంతేనా ? ”  అన్నారు."సందేహమేమి . కొంచెం చొరవ యిచ్చామా మనపైన అధికారం చలాయించడం ఆరంభిస్తారు. తాము చెప్పినట్లే వినాలంటారు. తాము తప్ప మరెవ్వరూ రారాదని  అంటారు. ఒకటా?" అంటూ నవ్వారు." మహాత్ములు అందరినీ సమానంగా చూస్తారని అంటారు కదా , కొందరిని లాలించి పిలుస్తారు , కొందరికి అడిగితే బదులుచెప్తారు , కొందరిని గదమాయిస్తారురు , కొందరిని ఉపేక్షిస్తారు ఎందువల్ల ? ” అన్నారా భక్తులు . " "అవునండీ , తండ్రికి బిడ్డలందరు సమానమే . అంతా బాగుపడాలనే ఉంటుంది . అందువల్ల , వారి వారి అర్హత ననుసరించి నిగ్రహానుగ్రహములు చూపి , శిక్షణ నిస్తారు . సాధువులుగా ఉండే బిడ్డలు అడగడానికి జంకి భయభక్తులతో ఒదిగి దూరంగా ఉంటారు . వాళ్లను లాలించి , పిలిచి బెల్లం పెట్టాలి . గడుసువారు అడిగితే యిస్తారు . దుడుకువారు పైకి ఎగబ్రాకితే గదమాయించి త్వరగా ఇవ్వకుండా కూర్చోబెట్టవలసి వస్తుంది . మూడులకు రుచి తెలియదు కనుక వారిని ఉపేక్షించి విడువవలసి వస్తుంది . అదే విధంగా , మహాత్ములు కూడా తమను ఆశ్రయించిన వారికి , వారి వారి అర్హతనుబట్టి నిగ్రహానుగ్రహములు చూపవలసి వస్తుంది ” అని సెలవిచ్చారు భగవాన్ .
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ