రమణాశ్రమ లేఖలు 197 కీరపాటి 25-7-48
రమణాశ్రమ లేఖలు. 197 కీరపాటి 25-7-48
https://bhagavanraman.blogspot.com/2019/02/197-25-7-48.html
ఈ మధ్యాహ్నం మ మూడింటికి మూడిం భగవాన్ సన్నిధిలో లక్ష్మిని గురించిన ప్రసంగమే వచ్చింది. " అరుణాచలం పిళ్ళై లక్ష్మిని కన్నమంగళంలో కొనలేదట. ' గుడియాత్తం' అనే గ్రామంలో కొన్నాడట". అన్నారొక భక్తులు. భగవాన్ అది విని కీరపాటి .( ఆకు కూరలు అవ్వ) ఊరు కూడా అదే ” నన్నారు . “ కీరపాటి ఈ ఊరు ఎప్పుడు వచ్ఛిందో ? ' అన్నారా భక్తులు . భగవాన్ చిరునవ్వుతో “ ఏమో . నేను అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్నప్పటికే ఆమె కొండపై ఉంటూ అప్పుడప్పుడు నన్ను చూచిపోయేది . నేను విరూపాక్ష గుహకు వచ్చిన తరువాతనే బాగా స్వతంత్రం ఏర్పడ్డది . అప్పుడామె గుహ నమశ్శివాయ మండపంలో ఉండేది . అప్పుడా మండపం ఇంత బందోబస్తుగా లేదు . కర్ర తలుపూ , కర్ర గడియా ఉండేవి. ఆమెకేమీ సామానుండేది కాదు . ఒకే కుండ ఉండేది . దానితోనే స్నానానికి నీళ్ళు కాచుకొని తరువాత దానితోనే కూరా , అన్నం అన్నీ వండేది . ఎన్ని చేసినా ఆ ఒక్కకుండే . ఉదయాత్ పూర్వమే లేచి , కొండంతా తిరిగి , ఏవో ఆకుకూరలు ఏరి తెచ్చేది . మంచి రుచిగా వండి , పట్టెడుకు పైగానే తెచ్చి వచ్చి గోశాల్లో ఈ కొంచెం తిను సామీ ! ' అనేది . ఒక్కనాడైనా నాగా లేదు .
నేను అప్పుడప్పుడు వెళ్ళీ కూర తరిగి వంటకు సహాయం చేసవాణ్ణి.నా, మీద మంచి నమ్మకం ” అని సెలవిస్తూ భగవాన్ ఉత్సాహంతో , " ఆమె రోజూ టవునుకు పోయి , ఇంటింటా బిచ్చమడిగి నూకలు , బియ్యము , మొదలైనవి తెచ్చి ఒక బానలో పెట్టి , ఒక్కొక్కనాడు ఆ నూకా , పప్పు కలిపి గంజి కాచి ఆకుకూరతో తెచ్చి , ' సామీ ! సామీ ! నిన్ననొక పుణ్యవతి రవంత నూక యిచ్చింది . ఆ కాస్తా గంజి కాచి తెచ్చాను సామీ ! ' అనేది . నాకేమీ తెలియదని ఆమె ఊహ . నేను ఆమె లేనప్పుడు ఆ మండపం తలుపులు తెరచి బానలో చూస్తే మూటలు మూటలుగ సరుకుండేది . అయితే నా మీద మన నమ్మకం . ఆ మండపంలోకి మరెవ్వరినీ రానిచ్చేది కాదు . నాకే ఆ స్వాతంత్రం ఒక్కొక్కనాడు ఏ ఆకూ దొరక్కపోతే విచారంతో కూర్చుండేది . నేనప్పుడు అక్కడున్న చింతచెట్టెక్కి చిగురుకోసి యిచ్చేవాణ్ణి . ఎల్లాగైతేనేమి , నాకు కూరపెట్టంది , తానేదీ తినేది కాదు . ' స్వామికి ఆ కూర ప్రియం , ఈ కూర ప్రియం ' అంటూ ఏవేవో కూరలు తెచ్చేది . మహాభక్తి , శ్రద్దాను . ఎనుబదేండ్ల వయస్సయి కూడా కొండంతా తిరిగేది . నేనక్కడికి పోక పూర్వం కూడా ఆమె ఒంటరిగా వుండేది ” అని సెలవిచ్చారు .
“ ఆమెకేమీ భయం తోచేదికాదు కాబోలు ? ” అన్నాను . " ఊ - భయమెక్క ఒకనాడు ఏమయిందనుకున్నారు . నేనెందుకో స్కందాశ్రమం వెళ్ళీ ఇక్క వుండిపోయాను . పలనిస్వామి విరూపాక్ష గుహలోనే ఉన్నాడు . అర్ధరాత్రి ఆమె ఉన్నచోట దొంగ చొరబడి ఏవో సర్దుతుంటే , ఆమె ' ఎవడు వాడు ' అనేసరికి గొంతుమీద చెయ్యి పెట్టాడట . ' ఆహా ! అణ్ణామల ! దొంగ దొంగ " పెద్దకేక పెట్టింది . ఆ కేక స్కందాశ్రమంలో ఉన్న నా చెవిని పడి " ఓయ్ వస్తున్నాను . ఎవడురా వాడు ' అంటూ ఒక్క ఉదుటున పరుగెత్తాను . విరూపాక్ష గుహ వద్దకు వచ్చి పలనిస్వామిని పిలిచి ' ఏమది ? ' అంటే కీరపాటి గుహ దగ్గరనుండి ఏదో కేక వినబడ్డదిగాని స్మరణ చేసుకుంటున్నది కాబోలనుకున్నా నన్నాడు . చూత గుహలోనూ , జటాస్వామి గుహలోనూ ఎవరెవరో ఉన్నారుకాని వారి చెవిని పడ్డదో లేదో వారెవ్వరూ రానేలేదు " అని సెలవిచ్చారు భగవాన్ .
ఎవరి చెవిని పడాలో వారి చేవినే పడ్డది . అరుణచలుడే పలికాడన్నమాట " అన్నాను. భగవాన్ అవునన్నట్టు తల ఆడిస్తూ వస్తూ ఉన్నానన్న నా కేక విని దొంగ పారిపోయాడు. మేమిద్దరం అమె వద్దకు వెళ్ళి ' ఏడమ్మా దొంగా ? అంతా తదే ' నని నవ్వాం . ' కాదు సామి ! వాడు వచ్చి సరుతుంటే ఎవరురా' అన్నాను. అరవకని గొంతు పట్టుకుంటే అలా కేక పెట్టాను . వస్తున్నానన్నది మీరే కాబోలును . వాడది విని పారిపోయాడు స్వామీ ! ' అన్నదామె. అక్కడ దీపమేది ? ఒక కొరివి ముట్టించి చుట్టుప్రక్కల చూస్తే బాన, అటూ యిటూ చిమ్మిన చిన్ని చిన్ని మూటలూ ఉన్నవి. అప్పుడు నిజమేనని అనుకున్నాం " అని సెలవిచ్చారు భగవాన్ " ఆమె ఈశ్వరుని ఎంత గట్టిగా నమ్మిందో ! అవి కారణవజస్మలు కాని సాధారణ జన్మలా ? " అన్నాను . భగవాన్ " ఊ …ఊ " అంటూ మౌనం వహించారు .
" రావే ఈశ్వర , కావవే వరద " అన్న గజేంద్రుని మొర" అల వైకుంఠ పురంబులో నగరిలో నున్న ఆ విష్ణువు చెవినే సోకిందట . ఆ విష్ణువు "సిరికిం చెప్పక శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపక " పరుగెత్తడట . అలాగే , " ఆహా ! ఆణ్ణామల " అంటే “ ఓయ్ , పసున్నా " నని పరుగెత్తారట భగవాన్ . చూచారా ? భక్తత్రాణ పరాయణత .
Telegram
T.me/bhagavanRaman
https://www.facebook.com/2502038086477054/posts/2605750909439104/?app=fbl
Comments
Post a Comment