రమణాశ్రమ లేఖలు  186  అభ్యాస వైరాగ్యములు 1 - 5 - 48

రమణాశ్రమ లేఖలు  186  అభ్యాస వైరాగ్యములు 1 - 5 - 48
https://bhagavanraman.blogspot.com/2019/02/186-1-5-48.html
    ఈ ఉదయం పుస్తకాలు బైండు చేసుకుంటూ కొంచెం ఆలస్యంగా వెళ్ళాను . తొమ్మిది గంటలు కావస్తున్నది . నేను వెళ్ళే లోపలే నిన్న వచ్చిన మహారాష్ట్రులు కొందరు భగవానుని ఏదో ప్రశ్నించారు కాబోలును . భగవాన్ ఆనర్గళవచో విజృంభణతో సమాధానాలిస్తున్నారు . ఆ వాణి అమృతమయమై అఖండగంగా ప్రవాహంలా ప్రవహిస్తున్నది . ఒక భక్తుడు ఆ అమృతసార లవలేశం ఇంగ్లీషులో తర్జుమా చేస్తున్నాడు . నా ఆలస్యానికి లజ్జించి హాలులో ప్రవేశించి కూర్చున్నాను . అప్పటికి అభ్యాస వేరాగ్యములను గుఱించిన ప్రసంగం వచ్చింది . భగవాన్ దేనండీ ! అభ్యాస వైరాగ్యములను గుఱించి ప్రసంగం వచ్చింది. భగవాన్   ఉత్సాహంతో “ అదేనండి  అభ్యాస వైరాగ్యములను గురించి భగవద్గీతలో చక్కగా చెప్పారు చూడండి .
  
'శనైశ్శనై రుపరమే దుద్యాధృతిగృహీతయా !
ఆత్మసంస్థం  మనఃకృత్వా నకించిదపి చింతయేత్  | ' ( అ - 6 - శ్లో-- 25 )
  
    ఆత్మయందు చిత్తమును ఉండునట్లు చేసి , ఇతరములను చింతించక , ముగా స్వీకరింపబడిన బుద్ధిచేత నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా ఉపరతి గాంచుటయే అభ్యాసమనీ ,

యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరం !
తతస్తతో నియమైత్య దాత్యన్యేవ వంశం  నయేత్  | | ' ( అ - 6 - శ్లో - 26 )

    చంచలము , అస్థిరము అయిన ఈ చిత్తము ఏయే విషయాదులందు సంచరిస్తుందో ఆయా విషయాదుల నుండి మరలించి ఆత్మలో నిలపడమే అభ్యాసవైరాగ్యమనీ చెప్పారు . అభ్యాసవైరాగ్యములంటే అవే కాని ఆడంబరానికి చేసేవి కావు . ఆ అభ్యాస వైరాగ్యములవల్లనే మనస్సును జయించాలి . ఇంత దూరం చెప్పినా అర్జునుడు సందేహం తీరక ఇంకా ప్రశ్నించాడు .

చంచలంహి మనఃకృష్ణ ప్రమాధి బలవద్దృడమ్ |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరీవ సుదుష్కరమ్ ! ! ( అ - 6 - - 34 )

ఈ చిత్తము చంచలమైనదే కాక దేహాన్నీ ఇంద్రియాలను క్షోభపెడుతూ పరాధీనం చేసేదీ , బలవంతమైనదీ , దృఢమైనది కదా . వాయువును అడ్డుకోవడం ఎంత దుష్కరమో ఆ చిత్రాన్ని అరికట్టడం కూడా అంత దుష్కరం. అందువల్ల ఆ చిత్రనిగ్రహం నీవు చెప్పినంత సులభమని నేను చెప్పలేను . అందుకు సమాధానంగా

"అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్|
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే || '  (అ--6--35 )

అన్నారు కృష్ణభగవానులు . మనస్సనేది అడ్డుకోవడానికి వీలులేనిదీ , చంచలమైనదీ అనేందుకు సందేహమే లేదు . కాని అభ్యాస వైరాగ్యములవల్ల అరికట్టవ్ణచ్ఛును అని కదా భావం. అందువల్ల సాధకునికి అభ్యాస వైరాగ్యములు ముఖ్యంగా కావాలి ‌" అని సెలవిచ్చారు.

  ఆ పృచ్ఛకులలో ఒకరందుకుని "గీతా ద్వితీయాధ్యాయంలో విచార మార్గానుసారం ధ్యానమే ముఖ్య సాధనం అన్నారు. ద్వాదశాధ్యాయంలో భక్తి యోగమే శ్రేష్ఠమన్నారే  ఎందువల్ల?" అన్నారు." అదా ముందు జ్ఞానయోగ మార్గానుసారం ధ్యానం చేయమంటే మనస్సుకు పట్టలేదు. తరువాత యోగమని అది కాకుంటే కర్మమని , అదీ లేదంటే భక్తి అన్నీ, అలాగే ఒక్కొక్కటీ అంతరంతరాలుగా చెప్పారు. ఏ ప్రకృతికి ఏదో అనుగుణమో ఆ దారిని పోవచ్ఛునని, గమ్యస్థానం ఒక్కటే కదా, అధికారి ననుసరించి ఆయా మార్గం సులభంగా ఉంటుందని వారి అభిప్రాయం"అని సెలవిచ్చారు భగవాన్.
Telegram t.me/bhagavanRaman
https://www.facebook.com/359807631501891/posts/392895941526393/?app=fbl

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ