రమణాశ్రమ లేఖలు 184 కర్త - కర్మ 29 - 4 - 48


రమణాశ్రమ లేఖలు 184 కర్త - కర్మ 29 - 4 - 48
https://bhagavanraman.blogspot.com/2019/02/184-29-4-48.html
  నిన్న రాయలసీమ నుండి వకీలొకరు వచ్చారు. ఉదయం తొమ్మిది గంటలప్పుడు. భగవాన్ సోఫా దగ్గరగా కూర్చొని , " స్వామీ ! గీతలో కృష్ణ భగవానులు  ముందు ' అంతా కర్మమయమే , నీదేమీ లే 'దని చెప్పి , తరువాత కర్త  కర్మ కార్యం అన్నీ నేనే . ' అని అన్నారే , కర్మయే ప్రాధాన్యమంటే అది  జడం కదా , అంతా కర్తదేనంటే ఆ కర్తయైన ఈశ్వరుడు మొదట ఈ కర్మసు సృఫ్టించునప్పుడు ఒకరికొక విధంగానూ , ఇంకొకరికి ఇంకొక విధంగానూ దుకు సృష్టించాడు . తరువాత కర్మానుసారం నడిపిస్తాడంటారే - సరే అసలు ఈ భేదం ముందు ఎలా వచ్చింది ? ఎందుకు వచ్చింది ? అదే కాక అంతా కర్మకూ , ఈశ్వరునకూ వదిలితే పురుషకారం ఏమున్నది ? పురుషకారం లేకుంటే జ్ఞానం సంపాదించు - అనడం ఎందుకు ? ఇదంతా ఏమిటి ? ' అని ప్రశ్నించారు .

   భగవాన్ సావధానులై , “ ఈ అడిగేదెవరు ? ఈ సందేహం ఎవరికి వచ్చింది ? ఎందుకొచ్చింది ? ముందది విచారించి తెలుసుకోండి ! ” అన్నారు . “ కృష్ణ భగవాన్ అర్జునునకు అలా చెప్పారేమని అడుగుతున్నాను స్వామీ ” అన్నారా భక్తులు . “ అదేనండీ , కృష్ణ భగవాన్ అర్జునునకు చెప్పారంటే , ఏం చెప్పారు ? ' కర్మానుసారం నడిచేది నడుస్తుంది . పైన కర్తను నేనున్నాను కదా చూచుకుంటాను . నీవెందుకు చింతిస్తావు , ఈ పితృ భ్రాతృ వధాదికం నీ శరీరం చేస్తుంది కాని నీవు చేయవే . నీవు శరీరమా ? కాదు . మరి నీకీ బంధమెందుకోయ్ . దాన్ని వదల ' మన్నారు . అంటే , నేను చేస్తున్నానన్న కర్తృత్వభావం వదలమన్నారన్న మాట . అదే పురుషకారం . శరీరం నేననే ఆ కర్తృత్వ భావబంధం తెచ్చుకొన్నదీ తానే . విడువవలసిందీ తానే , తాను తెచ్చుకొన్నది తానే పోగొట్టుకోవాలి కానీ వేరొకరు ఏ విధంగా పోగొట్టగలరు ? పురుషకారంవల్ల ఆ బంధం తెంపుకుంటే , కర్తయైన ఈశ్వరాజ్ఞవల్ల కర్మ  దానంతట అది నడుస్తుంది. ఏం ఉపాధి ఏ   పని చేయాలో ఆ పని చేస్తుంది .  తనకేమి? అని చెప్పారు . బంధువధచింతాకులునకు కర్తృత్వభావం , వదలమని బోధించారే గాని యుద్ధం అర్జునుడే చేసాడు . గీతా  శ్రవణం వల్ల కర్తను నేననే భావం వదలింది కనుక , మొదట బాధించినది అప్పుడు బాధింపలేదు. ఆ శరీరంతో ఆ పని జరుగవలసి ఉంది . జరిగింది . దుర్యోధనుడూ అంతే.ఆయనకు వివేకం లేక కాదు . తాను చేసేది అధర్మమని తెలుసు. కానీ ఏదో ఒక శక్తి ఆ పనికి లాగుకొని పోయేది.ఏం చేస్తాడు ఆ శరీరంతో ఆ పని అలా కావలసి ఉంది , అయింది . ఆ సంగతి మరణ సమయంలో వారే అన్నారట . అందువల్ల ఏదో శక్తి అందరినీ ఆడిస్తున్నదని తెలుసు నేను చేస్తున్నాననే కర్తృత్వ భావం పోగొట్టుకొనుటయే పురుషకారం. అన్ని సాధనలూ అందుకే ” అని సెలవిచ్చారు భగవాన్ .
  
“ అది సరే . ఈ కర్మకు అవధి సెలవిస్తున్నారేకాని , ఆది ఏమో . ఎవరూ చెప్పలేదే ?  అన్నారింకొకరు . “ ఆ , అదే . ' నీకు ఇది ఎలా వచ్చిందీ ?  అంటే ” అ కర్మవల్ల వచ్చింది . నీ వెల్లా పుట్టావు ? కర్మవల్ల పుట్టావు . ఇంతవరకే జవాబుగాని ఆ కర్మ ఎలా పుట్టింది ? అంటే అది ప్రశ్నించరాదన్నారు . దీనికే బీజాంకుర న్యాయం చెప్పారు . చెట్టునుండి విత్తు పుట్టింది . మళ్ళీ విత్తునుండి చెట్టు. పుట్టింది . అసలా విత్తుకు మొదలేదీ ? అది ప్రశ్నించరాదట . ఎందువల్ల ప్రశ్నించరాదు ? అంటే అది అంతే . దానికేం చెప్పగలం ? నేనందుకే నీవు ఎలా పుట్టిందీ , ఎక్కడ పుట్టిందో తెలుసుకో ముందు అంటాను ” అని చెప్పారు భగవాన్ .

' గీతలో : “ ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి |
భ్రామయన్ సర్వ భూతానియంత్రారూఢాని మాయయా || ( అ 18 శ్లో 61 ;

అన్నారు కదా . ఇక వీరి యత్నమేమున్నది ? అన్నా ' ' రా పృచ్చకులు . “ అది నిజమేకాని ' ఈశ్వరస్సర్వ భూతానాం ' అని చెప్పిన వెంటనే

“ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత |
తత్ ప్రసాదాత్ పరాం శాంతీం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ” II ( ఆ - 18- శ్లో-62 )

అని చెప్పారే, ' శరణు చెందుము' అంటే పురుషకారం చేయాలనే కదా  నేనున్నానన్న భావన ఉన్నంత వరకూ ప్రయత్నం చేయాల్సిందే. నేనున్నానన్న ఆ భావన నశిస్తే అంతా ఒకటే"అన్నారు భగవాన్.
Telegram. T.me/bhagavanRaman

https://www.facebook.com/359807631501891/posts/393972658085388/?app=fbl

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ