రమణాశ్రమ లేఖలు 182 ప్రేమ మార్గం 28-4-48
రమణాశ్రమ లేఖలు 182 ప్రేమ మార్గం 28-4-48
https://bhagavanraman.blogspot.com/2019/02/182-28-4-48.html
ఈ ఉదయం ఎనిమిది గంటలకు తమిళ యువకులొకరు భగవానుని సమీపించి " స్వామీ ! దైవాన్ని ప్రేమించడం మంచిదేకదా . ప్రేమమార్గంలో ఎందుకు పోకూడదు ? ” అని ప్రశ్నించారు .
https://www.facebook.com/359807631501891/posts/395674811248506/?app=fbl
భగవాన్ చకితులై “ కూడదని ఎవరన్నారు ? పోవచ్చును . అయితే ఒకటి . ప్రేమించటం అనేసరికి తానొకడు , దైవమొకడు రెండు కాలేదా ? తాను వేరు , దైవం వేరు కాదే . అందువల్ల ప్రేమించటం అంటే , తనయందే తనకు ఎక్కువ పేమన్నమాట . దీనికే వాసుదేవ మననంలో ఆత్మ ప్రియత్వ దృష్టాంతం
అంతరాంతరాలుగ చెప్పబడి వున్నది . మనుష్యునికి ధనమే ప్రియం.ఆ ధనం కంటే పుత్రుడు , పుత్రునికన్న శరీరము , శరీరము కంటే ఇంద్రియాలలో కన్ను , కన్ను కన్నా ప్రాణము , ఆ ప్రాణం కంటే ఆత్మ ప్రియమైనవి. అదీ ఎలాగంటే పుత్రుడైనవాడు ఏదైనా అకృత్యం చేస్తే వాడిని రాచనగరివారు దండించేందుకు సిద్ధమైనప్పుడు వాని తల్లిదండ్రులది సహించలేక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ లంచమిచ్చి విడిపించుకుంటారు . అందువల్ల విత్తనము పుత్రుడు ప్రియం. ఆ అకృత్యం చేసిన పుత్రుడిని లంచాలతో వదలక వానికి బదులు నీవు లోబడితే వదులుతామని అంటారనుకో అప్పుడా తండ్రి దానికి ఒప్పక,' నాకూ ఈ చిన్నవాడికీ సంబంధం లేద'ని చెప్పి తప్పించుకుని వస్తాడు. అందుచేత పుత్రుని కన్నా శరీరం ప్రియం.
అకృత్యం చేసిన ఏ మానవుడైనా తన్ను రాజ భటులు కన్నులు పొడవడానికి యత్నిస్తే శరీరం దండనకి ఒడంబడి. కన్నులు కాపాడుకోవాలని చూస్తాడు. కాబట్టి శరీరం కన్నా ఇంద్రియాలు ప్రియం. ఆ రాచవారొకవేళ ఇంద్రియాలతో వదలక తలగొట్ట తలపెట్టినట్లైతే ఇంద్రియాలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అందుచేత ఇంద్రియాల కన్న ప్రాణం ప్రీయం . అదే విధంగా ఆత్మానందంలో అపేక్షగలవాడు ప్రాణాన్ని విడువటానికి కూడా ఒప్పుకుంటాడు . వానికి ప్రాణ కన్న ఆత్మ ప్రియం . అందువల్ల తనను ప్రియరూపమైన ఆత్మగా నెఱుగుటయే దైవాన్ని ప్రేమించటం . తాను సుఖంగా ఉండాలని కదా దైవాన్ని ప్రేమించ దలచటం . తాను సుఖమాయె , సుఖమే దైవమాయే . ఇక ప్రేమించేదెవరిని ? ప్రేమయే దైవం . " అని సెలవిచ్చారు .
“ అందుకే భగవంతుని ప్రేమమార్గంలో భజింపవచ్చునా ? అని అడుగు తున్నాను స్పామీ” అన్నారావృచ్చకులు . ' ఆహా ! అదేకదా చెపుతున్నాను . ప్రేమయే భగవత్స్వరూపం . “ నాకిడి ప్రియంకాదు. నాకది ప్రేమకరంగా లేదు . ” అంటూ మంచి , చెడ్డా అన్నీ తోసివేస్తే మిగిలేదేదో అదే తన స్వరూపం. అదే స్వఛ్ఛమైన ప్రేమ , ఆ యధార్థ ప్రేమనే భగవంతుడనుకో , ఆత్మ అనుకో , ఏమన్నా అనుకో, అదే భక్తి . అదే జ్ఞానం , అదే అన్నీను ” అన్నారు భగవాన్ .
" బాహ్యాభ్యంతరము లందు తోచే దుర్విషయాల మీదా , సద్విషయాల మీదా ప్రేమను తోసివేసి ఈశ్వరుడినే ప్రేమించాలని కదా తామిప్పుడు సెలవిచ్చిన దానికి అర్ధం . ఇది ప్రియం కాదు . అది ప్రియం కాదు అని తోసివేయటానికి చే బుది పుడుతుందా ? అన్నీ అనుభవిస్తే కదా తోసివేయటానికి ? ” అన్నారు కొకరు . అదినిజమే . అందుకే చెడ్డను తోసివేసేందుకు మంచిని ప్రేమించాలి . కడకు అదీ అడ్డుగానే తోస్తుంది కనుక , ఆ మంచినీ తోసివేయాలిసిందే . అయితే , ముందు మంచిని ప్రేమించాలి . ప్రేమించి నిరసించాలన్నమాట . అలా అన్నిటినీ తోసివేస్తే, ఉండేది తానే . అదే నిజమైన ప్రేమ . ఆ ప్రేమరహస్య మెరిగిన వారికి , లోకమంతా ప్రేమమయంగానే తోస్తుంది ” అని చెప్పి మౌనం వహించారు భగవాన్ .
Telegram. T.me/bhagavanRaman
Comments
Post a Comment