రమణాశ్రమ లేఖలు 233 (25-3-49)

రమణాశ్రమ లేఖలు 233 (25-3-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/233-25-3-49-13-14-7-10-5-10-6-7-5-12.html
ఉత్సవ వైభవం

ఆశ్రమంవారిచే ఆహూతులై వచ్చిన వైదికబృందం 13వ తేదీ చతుర్ధశీ
ఆదివారం వేకువనే భగవదనుజ్ఞను పొంది, చండీహోమ మారంభించి నవకన్యకా
పూజాదులు నడిపారు. పూర్ణిమా సోమవారం 14వ తేదీన కుంభాభిషేకానికి
అంకురారోపణమనీ, రాత్రి భోజనానంతరం విఘ్నేశ్వరపూజ జరుగుతుందనీ
ప్రకటించడం వల్ల ఆ వేళకు ఆశ్రమంలో వేలకొద్దీ జనం చేరారు. అన్ని చోట్లా
తళతళలాడే విద్యుద్దీపకాంతితో ఆశ్రమం కైలాసతుల్యంగా ఉంది. వైదికశాలకూ
ఆగమశాలకూ శక్తిశివతాండవ లీలాచిత్రాలు చుట్టూ కట్టబడ్డవి. రోడ్డంతా
అంగళ్ళలో నిండింది. పందిళ్ళకు పచ్చాకు తోరణాలు కట్టారు. ఆశ్రమమంతటా
బాజాలు మ్రోగుతున్నవి.

  ఎనిమిది దాటింది. మేళం ఆపారు. గోశాల వైపున వేద ఘోష వినబడ
సాగింది. 'అదేమా' అని అటు చూస్తే భోజనానంతరం
తిరిగి వచ్చే భగవానుని వెన్నంటి వైదికులు పూర్ణకలశసహితులై నివృత్తి పరమైన
శ్రుతిహోషతో లోగడ పూజాదులనందుతూ ఉన్న
దేవాలయం వద్దకు తోడి
తెస్తూ ఉన్నారు. సాక్షిస్వరూపులైన భగవాన్ సాక్షాత్ సదాశివునీవలె ఒక
ఉన్నతాసనం మీద ఉపవిష్టులైన తరువాత, వేరొక జట్టు బ్రాహ్మణ బృందం
రెండు రోజుల కిందటనే వచ్చివున్న పూరీ శంకరాచార్యుల వారిని
దండసహితంగా శ్రుతి స్వరంతో తోడి తెచ్చి,భగవానుని  పక్కన ఆసనమునందు ఆసీనుల చేసారు.
 
  తదుపరి శ్రీ భగవాన్  ఉన్న స్థలానికి కొంత దూరంవరకూ వరుసగా పంక్తులు
తీర్చి, వందలాది బ్రాహ్మణులు శ్రీవారిని పరివేష్టించి కూర్చుని వేద నాదముచే
రోదసీకుహరమును ప్రతిధ్వనింప చేసారు. ఆ సభ బ్రహ్మ సభకన్నా మిన్నగా ఉన్నదనడం అతిశయోక్తి కాదు. ఆ సభామధ్యమందున్న భగవానుని వదన
మండలం “చుక్కలగమి నడుమ పూర్ణసోముని భంగిన్" అన్నటు క్షణ క్షణం
అపూర్వమైన చల్లని తేజోవిశేషంతో విరాజిల్ల జొచ్ఛింది.ఆ దృశ్యం చూసి
అంతా ముగ్గులై నిలిచారు. తేజోలింగమైన అరుణాచలుడే ఈ విధంగా ఆకారం
పొందాడు కాబోలునని అనిపించింది.

  ఇంతలో ఫలపుష్పాదులుంచిన పళ్ళెములు పట్టుకొని బ్రాహ్మణబృందం
ముందుకు రాగా సర్వాధికారి కుమారుడు టి.ఎన్. వెంకటరామన్ పత్నీసహితుడై
వచ్చి ఫలపుష్పాదులు భగవాన్ పాదసన్నిధిలో సమర్పించి ప్రణమిల్లి దీక్షాకరణ
కొఱకు అనుజ్ఞనడిగి పీటలమీద కూర్చున్నాడు. ఆ తరువాత అదే మర్యాదతో
వైద్యనాథ స్థపతి తన పరివారంతో వచ్చి భగవానుకు ప్రణమిల్లి ధర్మకర్తల పూజానంతరం స్థపతి పూజ నడువవలసిన ఆచారం ఉండటం చేత ఆ కార్యారంభార్థమై శ్రీవారి అనుజ్ఞను అడిగి పొందాడు. తదుపరి వైదికులూ, గురు కులులూ
వరుసగా వచ్చి అనుజ్ఞ నడిగి కార్యక్రమం ఆరంభించి గణపతిపూజ జరిపించారు.
అది పూర్తి కాగానే వాస్తు శాంతి, ఆచార్య భోజనం, వరుణం అయిన తరువాత
పునః వెంకటరామన్ దంపతులు భగవాన్ కు నమస్కరించారు.

 

  తదుపరి  భక్త సమూహ సహితులైన భగవాన్ లేచి పూర్ణకలశ సహితులైన బ్రాహ్మణ బృందంతో
వేదనాదంతో వెన్నంటి  రాగా నూత్న దేవాలయం ముందు ముఖమండపంగా
కట్టబడ్డ  కొత్తహలు వద్దకు వచ్చి తాళపు చెవితో తలుపులు తెరిచి ప్రవేశ మహోత్సవ
సూచకంగా లోపల ప్రవేశించారు. సరాసరి సమాధి వద్దకు వెళ్ళి
లింగస్థాపనకు పేరు ప్రస్తార శ్రీచక్రానికి కట్టిన స్థలాలను తాకి, పరిశీలన
చేసి ఆపై మూలస్థానాన్ని చుట్టి వస్తూ వివిధ మూర్తుల స్థాపనార్థం కట్టిన స్థలాలన్నీ
అదేవిధంగా పరిశీలించి కోవెలనుండి ముఖమండపానికి వచ్చారు.

  అక్కడ శ్రీవారిని ఆసీనులజేసే నిమిత్తం కొండశిలతో కొత్తగా నిర్మించిన
యోగాసనం ఉంది. దాని మధ్యభాగంలో పద్యమూ, వెనుక ప్రక్కన ప్రణవమూ చెక్కారు.
రెండు ప్రక్కలా రాతిలోనే మలచి చెక్కిన సింహాలున్నవి. నాలుగు కోడులకూ
యుగపురుష లక్షణాలున్న విగ్రహాలున్నవి. అన్నిటికీ బంగారు నీరు పోసారు.
కుంభాభిషేకం నాడు శ్రీవారిని అందాసీనుల చేయాలని మనవారి తలుపు. ఇందువల్ల పరుపులు పరచలేదు. భగవాస్ బయటికి వస్తారని అంతా
అనుకుంటే తటాలున వారందులో ఆసీనులైనారు. అంతా విస్మయంతో
నమస్కరించారు. అక్కడి నుండి కదలిన భగవాన్ శ్రీచక్ర యాగశాలవైపు తిరిగి, శాలా
ప్రవేశం చేసి కలశాలన్నీ తాకిచూచి, దాదాపు పదిగంటలకు యథాస్థానమైన
స్వర్ణోత్సవ పర్ణశాలకు విచ్చేసారు.

  రాత్రి రెండు గంటలకు పైన కళాకర్షణం, ఘటస్థాపనం జరిగింది.
చండీయాగం ఆరంభించి వైదికశాలయందు శాస్తోక్తంగా నిర్వర్తించబడింది.
ఆగమశాలలోనూ అలాగే జరిగింది. అన్నిచోట్ల, అన్ని పరివార దేవతాహ్వానాలు
కలశస్థాపనలు జరిగి హోమాగ్నులు విరాజిల్లినవి. ఈ హోమాగ్నులే కాక
'సుఖదమైన ప్రాచీన సంప్రదాయాన్ని వ్యక్తపరుస్తూ ఆహ్లాదకరంగా ఉంది. అదే కాక దేవీ భాగవత పారాయణమూ జరిగింది.
 
  రెండవనాడూ అదే విధంగా హోమాదులు జరిగినవి. ఉదయం 7 గంII
మొదలు 10 గం||ల లోపలనూ, సా|| 5 గం|| మొదలు 10 గం||ల లోపలనూ
యాధగపూజ జరిగింది. ఆ ఉదయమే 6-7 గం||ల ప్రాంతంలో గోశాలనుండి
వృషభాలను బాజాభజంత్రీలతో లోగడ పూజ జరుగుతున్న దేవాలయం వద్దకు
తెచ్చి పసుపు, కుంకుమ, పూలమాలతో వాటి
కొమ్ములకు తాడొకటి కట్టి 'లింగం కదలించండి' అనెడి విధానం నడిపి ఆ వృషభాలను సాగనంపి,తదుపరి లింగాన్ని ఎత్తించి, ముందు మేళం, తరువాత లింగం  వేదధ్వనితో బ్రాహ్మణ బృందం నడువగా నూతన దేవాలయాన్ని
ప్రదక్షిణిస్తూ లోపల ప్రవేశపెట్టారు. ఆ తరువాత అదే విధంగా యోగాంబా,
విఘ్నేశ్వర, కార్తికేయాది మూర్తులకునూ  నూతన దేవాలయ ప్రవేశం జరిపారు.

  ఆ రెండవనాటి రాత్రి పదిన్నరనుండీ పన్నెండింటి లోపు వేదనాదయుక్తంగా
ప్రస్తుతం లింగానికి వెనుకభాగంలో ఉన్న మేరుప్రస్తార శ్రీ చక్ర స్థాపనార్థం
స్వర్గనిర్మిత మేరుప్రస్తార శ్రీచక్రాన్ని, శ్రీభగవాన్ సపరత్న సహితంగా ప్రప్రధమంలో
యథాస్థాన మందుంచగా భక్తులు మేరుప్రస్తారాన్ని మంత్రయుక్తంగా స్థాపించారు
తదుపరి స్వర్ణనిర్మితమగు వేరొక భూప్రస్తార శ్రీచక్రాన్ని లింగానికి అడుగు
భాగంలో నవరత్న సహితంగా పొందుపరచి బంగారం పొదపడానికి ఆలస్యం
ఉండడం వల్ల కాలాతీత మౌతుందన్న భక్తుల విన్నపం ఆలకించి లింగాన్ని
తాకి చూచి స్థపతి మొదలైనవారికది అందించి యథాస్థానానికి విచ్చేసారు.
తక్కిన మూర్తి స్థాపనలు తదితరులచే జరిపింపబడినవి.

  మూడవ దినం ఉషఃకాలమందే కళాకర్షణం జరిగింది. నవరత్న నిధుల పైన
మూర్తులను బిగించారు. భగవాన్ నిమిత్తం చెక్కించిన యోగాసనమూ  నవరత్న
నిధులతో బిగించారు.
 
  నాల్గవదినం అన్నిటిలో ప్రధానమైనది. తెల్లవారుజామున రెండింటికే
బాజాశబ్దం విని చూద్దాముని ఆశ్రమానికి వెడితే కాలుపెట్టే సందు లేకుండా
జనం పడుకొని వున్నారు. అన్ని చోట్లా మేళం చేయడంవల్ల క్రమంగా అంతా
లేచారు. తెల్లవారేసరికి యాగములు త్రిరాత్రదీక్షతో ముగియడంవల్ల సకాలంలోనే
సువాసినీ పూజ జరిపి స్పర్శాహుతి, పూర్ణాహుతులు జరుపబడినవి. ఉదయాన్నే
కళాకర్షణచేసి కలశాలు ఆలయంలో ప్రవేశపెట్టి శక్తిన్యాసం మూర్తులందు
కావింపబడింది. తరువాత స్థపతులు పూర్ణకలశములు శిరస్సున ధరించి
మంత్రనాదంతో భగవానుని ప్రదక్షిణించి అనుజ్ఞనంది విమానశిఖరం ఆరోహించారు. ఆ తరువాత శ్రీ వారిని సూతcనాలయ  మండపానికి తోడి తెచ్చి యోగాసనాసీనుల చేసి భక్తులంతా ప్రణతులై వినుతించారు.ఆపై భగవానుని యోగశాలా సమీపంలో కుర్చీ మీద కూర్చుండబెట్టి విమాన శిఖరం మీద ప్రతిష్టించిన
కలశానికి అభిషేకం చేసారు. తిరిగి భగవానుని ఆలయ అంతర్భాగానికి తోడ్తెచ్ఛి నందికి ముందుగా మేజాబల్లమీద కూర్చుండజేసి ముందు మేరుప్రస్తారానికి తరువాత
|మాతృభూతేశ్వలింగానికి కుంభాభిషేకం చేసారు.

  ఆ మహాకుంభాభిషేకం ముగిసిన వెంటనే భగవానుని యోగాసీనులను చేసి
వారి సన్నిధిలో కొందరు భక్తులు ఈ కార్యనిర్వహణదక్షులైన నిరంజనానంద
స్వాములను పుష్పమాలాలంకృతులను చేసి సత్కరించారు. సాయంత్రం నాలుగు
గంటలకు కుంభాభిషేక ప్రయోజనమును గుణించి ఆయుర్వేద వైద్యుడు
బెంగుళూరు రామచంద్రరావు భగవాన్ సన్నిధిలో ఉపన్యసిస్తూ, హోమార్గం
ఉపయోగించే సమిధలలో అనేక ఓషధులు ఉంటవనీ, మంత్రపూరితమైన
ఆ ధూపంవల్ల శ్వాసకోశములకు సంబంధించిన వ్యాధులు ఉపశమింపగలవనీ,
అందుకే యజ్ఞయాగాదులు చేయడం పెద్దలు ఆదేశించారనీ, ఇంకా ఎన్నెన్నో
ప్రయోజనాలు ఉన్నవనీ హేతుగర్భితంగా వివరించారు.

  సాయంత్రం 5 1/2 గం.కు సి.కె. విజయరాఘవన్ గారి తనూజల చేత
పాటకచ్చేరీ చేయించారు. రాత్రి ఎనిమిది గంటలకు పైన మహాభిషేకం జరిగింది.
తిరుప్పుగళ్ జట్టువారొకరు ఈ నాల్గు రోజులూ భగవాన్ సన్నిధిలోనూ,
యాగశాలల వద్దనూ మృదుమధుర ఫణితితో భజన చేసారు. ఈ రోజుల్లో
జరిగిన అన్నదానానికి అంతే లేదు. అందులో బీదల పంక్తికి పోలీసు సిబ్బందీ,
వాలంటీయర్లూ చక్కని ఏర్పాట్లు చేసారు. శ్రీభగవాన్ పరిజన సమేతంగా
పంక్తి పంక్తికీ తిరిగి పరిశీలనగా చూచి వచ్చేవారు. ఆ దృశ్యమంతా సినిమావారు
ఫిలిం తీసారు. కడపట స్వస్తివచనములతో ఉత్సవం పరిసమాప్తి చెందింది.
స్వర్ణోత్సవ పర్ణశాలకు వచ్చివేసారు భగవాన్.
ముఖమండపంలో ఇంకా పని పూర్తికానందువల్ల ఆ రాత్రికే యథాస్థానమైన స్వర్ణోత్సవ పర్ణశాలకు వచ్చి వేసారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ