232
కుంభాభిషేక ప్రయత్నం
24-3-49
మన ఆంధ్రదేశంలో విశాలమైన దేవాలయ నిర్మణాలు విమర్శగా జరిపే
కుంభాభిషేకాలూ చాలా తక్కువ. అందువల్ల ఆశ్రమంలో జరిగే ఈ కలాపం కానీ అతి కోలాహలంగా జరిగిన ఈకలాపం
సరిగా చూచి విమర్శగా రాయమని చాలామంది కోరారు. కానీ అతి
కోలాహలంగా జరిగిన ఈ మహోత్సవ వైభవం ఆద్యంతమూ గమనించడం
సాధ్యమా. ఏదో విన్నంత కన్నంత రాస్తాను.
భగవాన్ కొండమీద వుండగా 1917 లో తల్లి అళగమ్మ, వారి సన్నిధిలో
నివాసం ఏర్పరచుకొని తపోనిరతయై కాలక్రమేపి పరిపక్వచిత్త అయినదనీ
1922 మే 19 వ తేదీన ఆమెకు చరమకాలం సమీపించిందని తెలిసి
యథాసమయంలో భగవాన్ ఆమె హృదయం మీద, శిరస్సు మీద చేతులుంచి
ప్రాణవాయువులను బహిర్గతం కానీయక తమ శక్తిచేత అంతరాత్మయందే
అణగునట్లు చేసారనీ, అందువల్ల ఆ జీవి కర్మవాసనలు నిశ్శేషఙమై ఆత్మలో
లీనమై బ్రాహ్మీభూతమయిందనీ, ఆత్మస్థితలైన స్త్రీల శరీరాలు కూడా
యతిశరీర తుల్యములేనని రమణగీతలో భగవద్వాణీయే పలికి ఉన్నందువల్ల
ఆ తల్లి శరీరము పవిత్రమైనదని అరుణగిరి దక్షిణభాగమందున్న పాలితీర్థానికి పక్కనే సమాధిగతం చేసారనీ భక్తులంతా ఆ సమాధి మీద శ్రీ మాతృభూతేశ్వర లింగాన్ని యథాప్రకారం శ్రీభగవానులచేత తాకించి ప్రతిష్టింప చేసారని దాని పక్కనే సమాధిగతం చేసారనీ,దాని పక్కనే అఘశమన (రమణ) తీర్ఘం త్రవ్వించారని
ఆ తరువాతే శ్రీరమణులు కొండవిడిచి రావడమూ, ఆశ్రమ నిర్మాణము
జరిగినవనీ రమణలీలలో రాసే ఉంది కదా.
కావ్యకంఠ గణపతిముని భగవాన్ సన్నిధిలో తయారు చేసిన భూప్రస్తార శ్రీచక్రాన్ని అది నుండి లింగం వద్దనే ఉంచి పూజిస్తూ వచ్చారు.
మామూలు. పదేళ్ల క్రితం ఆ స్థలంలౌ ఒక చక్కని దేవాలయం నిర్మించాలని సర్వాధికారి నిరంజనానందస్వాములు తలపెట్టారు. ఈ దేవాలయ నిర్మాణ కాలంలో లింగాన్ని ఆఫీసు వద్ద ఉన్న గదిలో చేర్చి నిత్య పూజలు నడుపుతూ అయిదేండ్ల క్రిందట దేవి యోగాంబ విగ్రహం స్థాపించారు. భగవాన్ పచ్ఛయ్యమ్మన్ కోవెలలో తీసిన చిత్ర పటమునూపూజిస్తున్నారు.
భగవత్ కృపచే నూత్న దేవాలయం పూర్తి కావడం వల్ల ఈ సర్వధారి సంవత్సర
ఫాల్గుణ బహుళ తదియ గురువారానికి సరియైన 17-3-49 తేదీన చిత్తా నక్షత్ర సిద్ధయోగంతో కూడిన మిధున లగ్నం లో 12 ఘ. 45 విఘడియలకు
కుంభాభిషేకం చేయడానికని సర్వజిత్ సంవత్సరం లోనే (1948, జూలై భగవాన్ సన్నిధి యందు సుముహూర్తం నిశ్చయించారు. ఒక మంచి రోజున విఘ్నేశ్వర పూజ చేసి ఆ పనులను ఆరంభించారు. సర్వాధికారి కార్య దీక్ష పట్టుదల చెప్పేందుకు వీలు లేదు. భక్తులు ఎందరో ఎన్నో విధాల సహాయం చేయసాగారు. 1949 జనవరి ఒకటవ తేదీన వేకువన నాలుగు గంటలకు బాజాభజంత్రీలతో తత్కాలమందు ఏర్పడే ధనుర్లగ్నమందు శ్రీ మాతృభూతేశ్వర సన్నిధి కెదురుగా శ్రీచక్రశాలకు శంఖు స్థాపన చేసారు. ఆ వెంటనే గోపాలుడు వెళ్ళే మార్గంలో ఆగమ శాలకు కూడా శంఖు స్థాపన చేయబోతూ ఉంటే భగవాన్ ఇటు దయచేసారు. శ్రీ వారినొక ఉన్నతాసనం మీద ఉపవిష్టులను చేసి యధాక్రమంగా శంఖు స్థాపన చేసారు. ఆ వెనుక తొప్పయ్య మొదలియార్ అనే భక్తుణ్ణి శారా నిర్మాణానికి నియోగించి సర్వాధికారి సంభార సేకరణార్థం మద్రాసు వెళ్ళి దాదాపు ఇరువది నాళ్ళుండి సమగ్రమైన సామాగ్రి తో తిరిగి వచ్చారు.
మార్చి 12వ తేదీకి పనులన్నీ ముగిసినవి. జనులు గుంపులు గుంపులుగా వస్తున్నారు.బయటి ఊళ్ళవాళ్ళకు గాను ఆశ్రమం గేటు నానుకొని లోవరుసన రెండు పెద్ద పెద్ద అతిధి శాలలు నిర్మించారు. మొదటి శాలకు ముందుగా
ఆహ్వానసంఘానికి ఒక ఆఫీసు పెట్టారు. గౌండరు కాంపౌండులో స్త్రీలకుగాను
ప్రత్యేకంగా పెద్దపాకలు వేసారు. ఆశ్రమానికెదురుగా ఉన్న మైదానంలో
వాలంటియర్లకూ, పోలీసు సిబ్బందికీ తగురీతిగా వసతులు కల్పించారు.
ఆశ్రమం లో వరుసన డాబాలపైన కూడా పాకలూ పందిళ్ళూ వేసారు.
ఆశ్రమం ఆసుపత్రి నానుకొని పశ్చిమ భాగంలో ఆహూతులైన అనేక గ్రామాలనుండి వచ్చిన వైదికులకు,గురుకులులకూ ( శైవయాజ్ఞినులకు) వసతిశాలలూ,
వంటశాలల విడివిడిగా కల్పించారు. మిగతా వచ్చేవారికి ఇక్కడున్న వారికి
జయంతి, మహాపూజా ఇత్యాదులందు వలెనే భోజనవసతులు చేసారు.
బోసు కాంపోండులో బీదలకు అన్నదానం నిమిత్తం పోలీసు అధికారుల ద్వారా భగవాన్
చిత్రపటముతో సున్న కాగితపు సంచులు పదివేలకు పైగా తయారు చేయించి
అన్నం చిందరవందర కాకుండా అందులో ఉంచి ఇచ్చే ఏర్పాటు చేసారు.
అగ్నిభయాలవల్ల ఆదుర్దా లేకుండా ఫైరు ఇంజన్లు రెండు తెప్పించి ఉంచారు కానీ అట్టి ప్రమాదం ఏమీ రాకుండా భగవాన్ కృపయే వజ్రాయుధంగా పని చేసింది.
ఒకనాడు మాత్రం ఆ యింజెన్ల ద్వారా కోనేటినీరు పైకి పూరించి
గోపుర విమానాదులమీద జల్లు కురిపించి శుభ్రపరిచారు.
అన్నిచోట్లా విద్యుద్దీపాలు పెట్టారు. దర్భలూ, సమిధలూ గుట్టలు గుట్టలుగా
వచ్చిపడ్డవి. బియ్యపు బస్తాలూ, అరిటాకులూ, కూరగాయలూ లారీలనిండా
ఎక్కడెక్కడి నుండో వచ్చినవి. ఉన్నతోద్యోగులంతా కార్లలో వస్తే ఆ కార్లు
నిలిపే నిమిత్తం మౌర్వీ కట్టడానికి తూర్పున ఉన్న మైదానంలో పందిరి వేసారు.
పురపాలక సంఘంవారూ, రైల్వేవారూ ప్రయాణికులకు ప్రత్యేక వసతులు చేస్తా
మన్నారు. రమణభక్తులలో ఒకరైనా మిగలకుండ అందరూ అన్ని పనులకు
నియమితులైనారు. రెండు నెలల క్రితం తాముగా వచ్చి భగవాన్ దర్శనం
చేసుకొని వెళ్ళిన పూరీ శంకరాచార్యుల వారూ ఆశ్రమంవారి ఆహ్వానం పత్రిక
నందుకొని శిష్య సమూహంతో దయచేయగలమని కబురు పంపారు.
అభిషేకార్గం ఏనుగు దంతాలూ, సకల నదీ తీర్థాలూ వచ్చినవి. కన్యాకుమారీ
క్షేత్రం నుంచీ, ఇంక ఎన్నెన్ని క్షేత్రాలనుంచో ఇసుకతో నింపిన బస్తాలు వచ్చినవి.
ప్రతి ఉదయం అరుణాచలేశ్వరాలయం నుండి గురుకులులలో కొందరు చందన
కర్పూరాదులతో ఇక్కడకు వచ్చి అభిషేకాదులలో పాల్గొంటామని ఒప్పుకున్నారు.
లాయర్లు, డాక్టర్లు, బ్యాంకర్లు, ఇంజనీయర్లు ఇంకా ఎందరెందరో
ఉన్నతోద్యోగులు కూడా ఈ కార్యకలాపంలో పాల్గొంటామని అన్నారు. విన్నె
రాజ్యాలనుంచో నవరత్నాలు వచ్చినవి.
కుంభాభిషేకమంటే లోగడ చిన్నమందిరంలో పూజా నివేదనాదుల నందుతున్న విగ్రహాలను కొత్త దేవాలయంలో చేర్చడం, లింగం యథాపూర్వం సమాధి మీద స్థాపించడం, లింగానికి అడుగున స్వర్ణ నిర్మిత భూప్రస్తార శ్రీచక్రాన్ని స్థాపించడం ,లింగానికి వెనుక భాగంలో ఇంకొక శ్రీచక్రం, మేరు ప్రస్తారమున
ప్రతష్టితం చేయడం, యోగాంబా, విఘ్నేశ, కార్తికేయ, చండికేశ్వర, భైరవ,
చంద్రసూర్యాది మూర్తులను, నవగ్రహాదులను స్థాపించడం ఇదీ కార్యకలాపం.
కలాపానికి పూర్వాంగం మహాగణపతిపూజ, చండీయాగం, ఆగమ యాగం
మొదలైనవి. ఈ కార్యకలాపంలో అగ్నిముఖంగా సర్వహోమాలూ జరిగి, వైదిక
మార్గానుసారం, ఆగమ మార్గానుసారం దేవీకళాకర్షణ జరిగింది. ఆ వివరం
మరొక లేఖలో రాస్తాను.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment