రమణాశ్రమ లేఖలు 231 (9-3-49)

రమణాశ్రమ లేఖలు 231 (9-3-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/231-9-3-49-18-telegram-t.html
అవతారములు

  భగవాన్ నిన్న నమో హిరణ్యబాహవే అన్నది చూసి ' తంగక్కై'అనే పేరు
మనకు కొత్తగా వచ్చింది కాదోయ్ అని అన్న తరువాత అవతారములను ఈ
గుణించి ఈ మధ్య ఒకటి రెండు సంభవాలలో భక్తులకూ భగవానుకూ జరిగిన
సంభాషణలు స్ఫురించి ఈ లేఖ రాస్తున్నాను.

  గత డిసెంబరు 18వ తేదీన శ్రీ భగవానుని జన్మదినోత్సవం జరిగినపుడు
కృషభిక్షువు శ్రీవారిని నుతిస్తూ కొన్ని పద్యాలు రాసాడు. జయంతినాడవి చదువలేదు. ఉత్సవానంతరం నన్ను వాటిని భగవాన్ సన్నిధిలో చదవడమంటే సరేనని
చదివాను. అవి “ఓ రమణా! నీ కీర్తికి జయము” అనే భావంతో ప్రారంభమయి
“నీ జన్మములకు జయమగు గాక” అనే భావంతో ముగిసినవి. నేనా చివరి పదం
చదివేసరికి భగవాన్ నవ్వుతూ కృష్ణభిక్షువు నుద్దేశించి “సరిపోయి
జన్మలు ఎత్తుకుంటూనే ఉండాలా ఏమి?” అన్నారు. “మా కొరకు, అన్నాడా భిక్షువు.
దేవరాజ మొదలియారు “అదేమండీ. అలా రాసారు. ఈ శరీరంతౌ
ఇలాగే వుండమని ప్రార్థించక జన్మలెత్తుతూ ఉండమంటారా? భగవానుకు
మళ్ళీ జన్మమెక్కడండీ” అన్నారు. నేను భగవాన్ వైపు చూచి "అందులో తప్పేమున్నదీ? 'పరిత్రాణాయ సాధూనాం' అని అన్నారు కదా అని అంటూ
ఉండగానే భగవానందుకొని “ఆ, నిజమే.
మున్నదీ? 'పరిత్రాణాయ సాధూనాం' అని అన్నారు కదా” అని అంటూ ఉండగానే భగవాన్ అందుకొని " ఆ, నిజమే.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం!
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||

అని చెప్పారులే. అయితే ఇలా జన్మలు ఎత్తుకుంటూనే ఉండాలన్న మాట. బాగుంది" అన్నారు
"మరి తప్పుతుందా" అన్నాను. భగవాన్ "ఊ..ఊ' అంటూ తలఊపి మౌనం వహించారు.

  సయ్యద్ అనే  ఒక భక్తుడు చాలాకాలంగా సాధన చేసుకుంటూ ఇక్కడే ఉండి సాధనను
గుణించే భగవానుని అనేకసార్లు అనేక సలహాలు అడిగి తెలుసుకున్నాడు.
అయినప్పటికీ అనుభూతీ నందలేక విచారగ్రస్తుడై ఈ మధ్యనే ఒక రోజున
శ్రీవారిని సమీపించి “భగవానే! తాము ఎన్నివిధాల బోధించినా నాకు అనుభూతినందే శక్తి కలుగలేదు. తామే ఆ అనుభూతిని కలిగించాలి. కానీ నాకు
ఏ విధంగా కలుగుతుంది భగవాన్!” అన్నాడు. “సాధనవల్ల
సంపాదించుకోవాలి కాని ఎవరేం చేస్తారు?” అన్నారు భగవాన్. “అది కాదు
భగవాన్ మార్జాలశిశు న్యాయంగా తామే పట్టుకొని తరింపయాలి భగవాన్.ఈ
జన్మలో ఆ విధంగా చేయకపోతే మళ్ళీ నా నిమిత్తం మీరు పుట్టవలసి
వస్తుంది భగవాన్” అన్నాడా భక్తుడు.

  భగవాన్ చిరునవ్వుతో “ఓహో! సరిసరి. ఇక పుట్టుకుంటూనే ఉండాలా
ఏం?" అన్నారు. “మరి ఎల్లా భగవాన్. ఎన్ని జన్మలకైనా భగవానే పుట్టి గురువుగా
ఉండి నన్ను తరింపజేయాలిగాని వేరొక గురువు వద్దు భగవాన్. ఎప్పటికైనా
సరే. ఏ యుగానికైనా సరే. 'ఉద్ధరిస్తా'నని అభయమిస్తే చాలు భగవాన్” అంటూ
ప్రార్ధించాడా భక్తుడు. భగవాన్ గుండె జాలితో కరిగిపోయింది. అనుగ్రహదృష్టితో
ఆ భక్తుణ్ణి చూస్తూ చిరునవ్వుతో చెక్కిట చెయ్యి పెట్టుకొని బాలీసు నానుకొని
పలక్కుండా పడుకున్నారు.
“ఏం భగవాన్” అన్నాడా భక్తుడు మళ్ళీ. “ఊ…ఊ” అంటూ తలవూపి
వూరుకున్నారు భగవాన్. ఆ భక్తుడదే అభయంగా తృప్తి చెందాడు.
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ