రమణాశ్రమ లేఖలు230 (8-3-49)

రమణాశ్రమ లేఖలు230 (8-3-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/230-8-3-49-telegram-t.html

బంగారు చెయ్యి

ఈ ఉదయం నేను భగవాన్ సన్నిధికి వెళ్ళేసరికి సుందరేశయ్యర్ ఏదో
పుస్తకం తెచ్చి భగవాన్ కిస్తే శ్రీవారది చూస్తూ “ఇదుగోనోయ్. ఇక్కడుంది
'నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో' అని చూడు"అంటూ
ఆ భక్తునకు చూపుతున్నారు. వారది చూచి “నిత్యం మేము పారాయణ చేస్తూనే
ఉన్నాంకాని, భగవాన్ సెలవిచ్చేవరకూ ఈ సూక్ష్మం గోచరించనేలేదు.
విషయం ఏమో తెలియక “ఏమది?” అన్నాను నేను. భగవాన్ చిరునవ్వుతో
“ఏమా, నాకు చిన్నతనంలో తంగక్కై (బంగారుచెయ్యి) అనే పేరు వచ్చింది
కదా, రుద్రనమకంలో శివునకు 'హిరణ్యబాహవే' అన్న పేరు ఉండనే ఉంది.
రోజూ ఇక్కడ పారాయణ జరుగుతూ ఉన్నప్పటికీ ఈ విషయం గమనించలేక
నిన్న సాయంత్రం ఎందుకో మనస్సులో ఆ శబ్దం పడి “ఈ పేరు మసకినకిప్పుడు
కొత్తగా వచ్చింది కాదోయ్' అని వీరితో అన్నాను. ఇప్పుడా పుస్తకం తెచ్చారు
వారు” అని సెలవిచ్చారు.

  వేరొకరందుకొని “భగవానుకు ‘తంగక్కై' అనే పేరెందుకొచ్చింది?" అన్నాడు.
“ఎప్పుడుగానీ, ఏ ఆటల్లోనైనా సరే గెలుపు నాది. కుస్తీపట్లు కానీ, ఈత కానీ,
ఏదైనా సరే. కడకు గృహకృత్యాల్లోనైనా నా చెయ్యి పడ్డదంటే ఛట్టున అయ్యేది.
అందువల్ల 'తంగక్కై అన్న పేరు వచ్చింది. మా పిన్ని అప్పడాలు మొదలైనవి
ఏమైనా చేస్తే, చేయబోయే ముందు 'నాయనా! ముందు నీ చెయ్యి పెట్టరా"
అనేది. ఆమెకు నేనంటే మంచి నమ్మకం. చెప్పినట్లు వింటాననీ, ఎప్పుడూ
అబద్ధం చెప్పననీను. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఒక్క అబద్ధం చెప్పవల
వచ్చింది' అన్నారు భగవాన్. “ఏమది?” అన్నారా భక్తులు. “అదే. ఎక్కడికి
బయలుదేరా' వని మా అన్న అడిగినప్పుడు స్కూలులో స్పెషల్ క్లాసున్నదని
చెప్పాను కదూ. అన్నం తిని తాళంచెవులు అడిగినప్పుడు పిన్నికీ అలాగే చెప్పాను.
పాపం ఆమెకేం తెలుస్తుంది. నిజమేనని అనుకుంది” అన్నారు భగవాన్.

" సంకరులు  కూడా సన్న్యసించ దలచినప్పుడు తల్లి ఆజ్ఞనిమిత్తం తంత్రం పన్నవలసి వచ్చిందట కదూ?” అన్నాను నేను. “అవును. తప్పనిసరి అయింది. ఏం చేస్తారు?"

"ఒక్కొక్క సమయంలో
సత్కార్యాచరణకు కూడా అబద్దం చెప్పవలసి వస్తుందన్నమాట
" అన్నా నేను. “ఆహా! లోకోపయోగకరమైన కార్యం నిమిత్తంగా తప్పనిసరి
అయితే ఏం చేస్తాం. మనం చెప్పేదేమిటి. ఏదో ఒక శక్తి ఆ విధంగా
తానే చేస్తుంది. కార్యం ఉన్నంతవరకూ కారణం ఉండనే ఉంటుంది. కార్యం లేనప్పుడు
ఏ కారణమూ ఉండదు. అప్పుడు వాసిష్ఠంలో చెప్పిన మునివ్యాధ ఉపాఖ్యాననంలో
'చూచీ చూడని వారమే'నని ఆ ముని చెప్పినట్లు చెప్పి
తప్పించుకోవచ్చును" అన్నారు భగవాన్,

  ఆ కథ ఏమి" అన్నారొకరు. “ఏమా. ఒకానొక అరణ్యంలో ఒక మునీ కొన్నాళ్ళు
తెఱచి మౌనంతో నిశ్చేష్టుడై కూర్చుని ఉన్నాడు. ఒక కిరాతుడు
వేలాడుతూ ఒక లేడిని కొట్టి అది పరుగెత్తగా దాని వెంటనే వచ్చి ఈ మునిని
చి ఆశ్చర్యంతో ఆగిపోయాడు. లేడి ఆ మునికి ముందుగానే పరుగెత్తి
ఒకడున్న పొదలో దూరింది. ఆ కిరాతుడది గమనించక ఆ ముని నుద్దేశించి
ఓ స్వామీ! నా లేడి ఈ వైపుకు పరుగెత్తి వచ్చింది. అది ఎటుపోయిందో
సెలవీయండి బాబూ' అన్నాడు. 'నాకు తెలియదు నాయనా' అన్నారా ముని.
"మీ ఎదుటనే కదా పరుగెత్తింది. మీరు కళ్లు తెఱచి చూస్తూనే ఉన్నారాయె.
ఎరుగనంటారేమి?” అన్నాడా బోయ. అందుకా మహాముని 'ఓ మనుజుడా!
మేము సర్వసములమై అరణ్యమునందున్నాము. మాకు అహంకారము లేదు.
అహంకారము ఉంటేనే కానీ ఏ వ్యవహారములూ చేయడానికి వీలుండదు.
అహంకారమే మనస్సు. ఆ మనస్సే అన్ని కార్యములను ఆచరిస్తుంది.సర్వేంద్రియ కర్మలు చేస్తున్నది.
మాకు నిశ్చయంగా ఆ మనస్సులేదు. అది పోయి ఇప్పటికి చాలా కాలమయింది. మాకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు
తెలియవు. సదా తురీయావస్థనే ఆశ్రయించి ఉంటాము. ఆ తురీయావస్థలో
ఏదీ కనుపించదు. నీ లేడిని గుఱించి ఇక మేమేమి చెప్పగలము' అన్నారు.
ఆ బోయకా మాటల తాత్పర్యం తెలియక “ఇవేమి వెర్రి మాటలో' నని తన దారిని తాను వెళ్ళిపోయాడు.ఈ కధ వాసిష్టంలో ఉంది" అని సెలవిచ్చారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ