రమణాశ్రమ లేఖలు 225 (15-2-49)
రమణాశ్రమ లేఖలు 225 (15-2-49)
Https://bhagavanraman.blogspot.com/2019/01/225-15-2-49.html
భగవాన్ కు ఏది ప్రియం?
భగవాన్ సన్షిధికి వచ్చినవారు చాలా వరుకు జిజ్ఞాసాపరులై సాధన చేసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం రవంతసేపు సన్నిధిలో కూర్చుని లేచి వెళతారు. వెళ్ళి కట్టడాలూ, పంపులూ, లైట్లూ మొదలైనవి పరిశీలించి చూస్తూనే
ఆఫీసు వద్ద కూర్చుని కబుర్లాడుతూనో, పేపర్లు చదువుతూనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. భగవాన్ ఆ వచ్చినవారు ఏం చేస్తున్నారని సమీపస్థులుగా ఉండే భక్తులనూ సేవకులనూ అడిగి తెలుసుకొని “పోనీ ఏదో ఒక కాలక్షేపం దొరికితే మన జోలికిరారు. అదీ మంచిదే. ఆ కాలక్షేపం నచ్చకుంటే మనలను పట్టుకుంటారు. ఆ ధోరణిలో పడ్డారా, మనజోలికి అంతగా రారు,ఒకందుకిది మేలే" అని ఛలోక్తిగా సెలవిస్తూ ఉంటారు.
మరికొందరు ఆ చూడడంతో సరిపుచ్చక అది మరమ్మతు చేస్తామనీ, ఇది అభివృద్ధి చేస్తామనీ అనడం ఆరంభిస్తారు. ఆఫీసువారికీ, వీరికీ పొందిక కుదిరి శ్రీవారికి నివేదిస్తే "ఊ ఊ" అంటూ తల వూపుతారే కాని, పొందిక కుదరక వస్తే " ఏమో మీ ఇష్టం" అంటారు భగవాన్. " భగవానుకు ఏది ప్రియం?" అని మళ్ళీ
అడిగారా " నాకేం తెలుస్తుంది. వారి యిష్టం. మీ యిష్టం" అని చెప్పి పంపి
వారలటు పోగానే సమీపంలో వున్న భక్తులను చూచి "ఇదుగో! "వస్తారో ఆపని చూచుకోకుండా ఆశ్రమాన్నేదో మరమ్మతు చేయాలని చూస్తారు. తమను తాము మరమ్మతు చేసుకుంటే చాలును. అది చేయక స్వామీ! అది చేస్తాం, ఇది చేస్తాం' అంటారు. ఏం చేసేదీ? వారు వీరూ సమ్మతపడి చేసుకుంటే బాధలేదు. 'రలేదు. వారు చెప్పింది వీరికి నచ్చదు, వీరు చెప్పింది వారికి నచ్చదు. మధ్యన మనమేం చేస్తాం. స్వామికి ఏది ప్రియమని అడుగుతారు పైగా.స్వామికి ఇదంతా కావాలా ఏమి?" అనీ సెలవిస్తూ వుంటారు భగవాన్.
ఇందుకు తార్కాణంగా ఈ మధ్య ఒక సంభవం జరిగింది. ఏమంటే, రాబోయే కుంభాభిషేకం నాటికి మేరుప్రస్తార శ్రీచక్రమునకు రాగికవచం చేయించి, దానికి వెండి నీరు పోయించి తెస్తామని ఒక భక్తుడు వచ్చి అడిగితే ఇక్కడి కార్యనిర్వాహకులలో కొందరు నీరు కాదు, అంతా వెండి తోనే చేయిస్తే
బాగుంటుందని అన్నారట. రాగిదే చేయిస్తామని వారు, వెండిదైతే
వుంటుందని వీరూ కొంచెం వాదించుకొని అంతా భగవాన్ సన్నిధికి వెళ్ళి
అడుగుదామని హాలుకు వచ్చారు. ఇక్కడివారి పక్షాన ఒకరు శ్రీవారిని సమీపించి
“శ్రీచక్రానికి రాగితో కవచం చేయించి వెండినీరు పోయిస్తామని వారంటున్నారు.
అంతా వెండిదైతే మంచిదని మేమంటున్నాము. భగవాన్ ఏది సెలవిస్తారో?"
అన్నారు చల్లగా. “నాదేమున్నదీ? ఎల్లా చేసినా సరే. ఉభయులూ కలిసి ఏదో
ఒకటి తీర్మానించుకొని చేయండి” అన్నారు భగవాన్. “భగవానుకు ఏం ఇష్టమోనని
అడుగుతున్నాము స్వామీ!” అన్నారు మద్రాసువారిలో ఒకరు. " అదేనండి,
చెపుతున్నాను కదూ. అంతాకలిసి ఏది చేసినా నా కిష్టమేనని, వారొకటీ
మీరొకటీ చెపితే నేనేం చేసేది?” అన్నారు భగవాన్. “రెండభిప్రాయాలు ఏర్పడడం
వల్లనే భగవానుకు ఏది ప్రియమోనని అడుగుతున్నాము” అన్నారు ఉభయులూ.
“ఓహో! సరిసరి. భగవానుకు ఏది ప్రియమనా మీరంతా అడిగేది? ఏదీ
చేయకుండా మౌనంగా ఉండడం భగవానుకు ప్రియం. ప్రియస్వరూపమైన
మౌనాన్ని విడిచి “అదిచేస్తాం, ఇది చేస్తాం' అంటూ వారూ వీరూ వచ్చి 'ఇందులో
ఏది ప్రియ'మని నన్నడిగితే నేనేం చెప్పేదీ? మీరంతా ఏకాభిప్రాయానికి వచ్చి
ఇది చేస్తాం' అని అంటే సరే నంటాను. అంతేగాని రెండభిప్రాయాలతో వచ్చి
ఇందులో ఏది ప్రియమని అడుగుతారెందుకు? తన్ను తాను తెలుసుకొని జరిగేది
జరుగుతుంది, జరగనిది జరగదని ఉన్నట్లు ఉండడం నాకు ప్రియం, సరేనా?
వహించారు భగవాన్. భగవానుకు ఏది ప్రియమో ఇప్పుడు బాగా తెలిసిందా?” అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment