రమణాశ్రమ లేఖలు 222 (23-1-49)
రమణాశ్రమ లేఖలు 222 (23-1-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/222-23-1-49.html
యాతనా శరీరం
ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఒక chు
యువకుడు భగవానుని సమీపించి
"స్వామీ! కైలాసంలో శివుడు, వైకుంఠంలో విషవు, సత్యలోకంలో బ్రహ్మ
దేవలోకంలో దేవేంద్రుడు పుంటారనీ, ఇంకా ఆ దేవతలూ ఈ దేవతలూ ఉన్నారనీ అంటారే, వారంతా ఉన్నమాట నిజమేనా?" అన్నాడు.
"ఓహో సరిసరి. అసలు నీవున్నావన్నమాట నిజమేనా? నీవున్నప్పుడు వారెందుకు ఉండరు? నీవుంటే వారూ ఉంటారు. నీవు లేకుంటే వారూ లేరు"
అన్నారు. భగవాన్ "పితృదేవతలనే వారు కొందరు పితృలోకంలో పుంటారనీ,
శ్రాద్ధకర్మలు చేయకుంటే శిక్షిస్తారని అంటారు కదా. అసలువారు వేరే ఉంటారా?" అన్నాడా యువకుడు." అదేనయ్యా నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనే తలంపు ఉన్నంతకాలం అన్నీ ఉన్నవే. అది పోతే ఏమీ లేదు." అన్నారు భగవాన్. మరి దెయ్యాలో? " అన్నాడతడు." అవీ అంతే. దేవతలు ఉన్నప్పుడు దెయ్యాలు ఎందుకు ఉండవు? నీవుంటే అన్నీ ఉంటవి. నీవు లేకుంటే ఏమీ లేవు.
నిన్ను పరీక్షించుకుంటే అన్నీ నీలోనే ఉంటవి. అప్పుడు ఈ సందేహాలకు తావుండదు" అని సెలవిచ్చారు భగవాన్.
ఇదే విధంగా ఆ మధ్య ఒకరు యమలోకాన్ని గుణించి భగవానుని ఇలా అడిగారు. మానవుడు మరణించిన తరువాత యాతనాశరీరంతో యమలోకానికి
వెడతారని, అక్కడ భీభత్సకరమైన వైతరణీనదిని దాటాలనీ, యమదూతలు ఈ
-శరీరాన్ని ఎన్నెన్నో బాధలు పెడతారని అంటారే, యమలోకం ఉన్నది నిజమేనా?"
భగవాన్ నవ్వుతూ “ఆహా! స్వర్గలోకం ఉన్నది నిజమైతే యమలోకం
ఉన్నదీ నిజమే. ఏదైనా నీవుంటేనే కదా అన్నీ ఉండేది. నీవు లేకుంటే ఏదీ లేదు.
నీవున్నమాట నిజమేనా? ముందది చెప్పు, ఆ తరువాత యమలోకాన్ని గుణించి
తోచిద్దాం" అన్నారు. “అదుగో. భగవాన్ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. ఇంకేం
మాట్లాడేది” అన్నాడా భక్తుడు. “సరేనయ్యా, ప్రయోగించను. ఏమి అడగాలో
అడుగు" అన్నారు భగవాన్, "కాదు భగవాన్. అసలు యాతనాశరీర మంటే
యేమిటి? అన్నాడా భక్తుడు. “ఏమిటా, మనం నిద్రపోతున్నప్పుడు
ఈ శరీరం కదలక మెదలక పడివుంటుంది. ఎన్నో కలలు కంటాం. ఆ కలల్లో
ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు కష్టం అనుభవిస్తాం. శరీరం నిద్రపోతున్నప్పుడు
ఇదంతా అనుభవించేదేది? మనస్సనే చెప్పాలి. దానినే, ఆ మనస్సునే, సూక్ష్మ
శరీరమనీ, యాతనా శరీరమనీ అంటారు. మరణమంటే శరీరమే కదా
మరణించేది” అన్నారు భగవాన్
“అయితే, యాతనాశరీరమంటే మనస్సుకే చెప్పారన్న మాట" అన్నాడా
భక్తుడు. “మరి మనస్సుకన్న యాతన పెట్టే శరీరం వేరే ఎక్కడున్నది?" అంటూ మౌనం వహించారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment