రమణాశ్రమ లేఖలు 219 (19-1-49)
రమణాశ్రమ లేఖలు 219 (19-1-49)
Https://bhagavanraman.blogspot.com/2019/01/219-19-1-49.html
అహమాత్మా
ఈ ఉదయం ఆశ్రమానికి వెళ్ళేసరికి ఒక భక్తుడు ఏవో ప్రశ్నలడుగుతూ
ఉంటే “నీవెవరవో విచారించి తెలుసుకో ముందు” అని జవాబిస్తున్నారు భగవాన్
“నేనెవరని విచారించేందుకు ముందు కర్మసన్యాసం చేయాలా?" అన్నాడా
భక్తుడు. భగవాన్ చిఱునవ్వుతో “సన్న్యాసమంటే ఏమని మీ అభిప్రాయం!
కూర్చోవడం, లేవడం,తినడం అన్నీ కర్మలే కదా, ఇందులో దేన్ని విడుస్తారు? "అందుకే నేను కర్తననే అహంభావం విడువనున్నారు పెద్దలు" అని సెలవిచ్చారు.
"శంకరాచార్యులవారు కర్మసన్యాసమే ప్రముఖంగా చెప్పారే?"అన్నాడా భక్తుడు.
"చెప్పారు. అయితే వారు మాత్రం కర్మ చేయలేదా ఏమీ? దేశ దేశం ఊరూరా తిరిగి అద్వైతమత స్థాపన చేసారు.అప్పుడు ఈ రైళ్పుకూడా లేవు. నడిచే వెళ్ళారు.అదంతా కర్మ కాదా? తాత్పర్యం ఏమంటే, జ్ఞాని అయిన తరువాత ఏ కర్మలు చేసినా వారిని అంటవు. లోక సంగ్రహార్థం వారు అన్నీ చేస్తారు. నేను చేస్తున్నానన్న అహంభావమే ముఖ్యంగా వారు విడిచేది. భగవద్గీతలో
'ఉత్సీదేయు రిమే లోకా నకుర్యాం కర్మచేదహం,
సజ్కరస్యచ కర్తాస్యా ముపహన్యా మీమాఃప్రజాః11" (అ-3-శ్లో-24)
సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వన్తి భారత,
కుర్యా ద్విద్వాం స్తథాసక్తిశ్చికీర్షు ర్లోక సంగ్రహం!!' (అ-8-ల్లో-25)
అన్నారు కృష్ణ భగవాన్. అంటే 'నేను కర్మచేయకుంటే లోకులెవరూ చేయరు,
సంకరం ఏర్పడుతుంది, అందుకు కారకుడను కానేల? అందువల్ల అన్నీ
చేస్తున్నాను. అయితే అజ్ఞానులు ఇచ్చతో చేస్తే జ్ఞానులు అనిచ్చతో లోక సంగ్రహార్ధం చేస్తారు. ఇదే తారతమ్యం' అని కదా భావం. అందువల్ల ఇంద్రియ గుణ విభాగగతత్త్వము, కర్మ విభాగతత్వము తెలిసికొని ఇంద్రియరూప గుణాదులందు
విషెస్ రూపగుణదులందు ప్రవర్తిస్తున్నవే కాని తాను (ఆత్మ) వర్తించుట లేదని యెంచి సక్తుడు కాక, కర్తృత్వభావరహితుడై సాక్షిగా సంచరించుటయే కర్మ సన్యాసం కానీ కేవల బాహ్యసన్యాసంవల్ల ప్రయోజనం అంతగా ఉండదు అని సెలవిచ్చారు భగవాన్.
" మరి నేనే కర్తను, నేనే భోక్తను' అని అన్నారు కదా కృష్ణ భగవానులు?" అని మళ్ళీ ప్రశ్న. “అవును, అన్నారు. మహాత్ములు చెప్పే అహంకర్తృత్వ మహంభోక్తృత్వాదులు వేరు. వారికి అహమంటే స్వరూపమే. శరీరమే నే నను ఈ నేను కాదు.
'అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః
అహ మాదిశ్చ మధ్యంచ భూతానా మంత ఏవచ' (అ-10-శ్లో-20)
అన్నారు. 'నేను' అనేదే అంతటా నిండిన ఆత్మ. మహాత్ములు చెప్పే అహం
కర్తృత్వాదులన్నీ స్వరూపానికేగాని శరీరాన్ని బట్టి కాదు. అజ్ఞానులు చెప్పే
అహంభావన ఆసురవాసన అవుతుంది. నేను ఈశ్వరుడను. నన్నే సేవించాలి
అంటారు. ఆ విధంగా అంటే కష్టపడవలసి వస్తుంది. ఈ ఆసురవాసనను గూర్చి
గీతలో 16వ అధ్యాయంలో మూడు శ్లోకాలు క్లుప్తంగా రాసారు. వాసుదేవ
మననంలో చాలా చమత్కారంగా ఒక అధ్యాయమంతా ఈ విషయమే రాసారు.
గీతలోనే కాదు. పెద్దలంతా నేనే ఈశ్వరుడనని అనటం శరీరాన్ని బట్టి కాదు.
నేననేదే ఈశ్వరుడు. అదే బ్రహ్మము, ఆత్మ, అన్నీను. సదా ఉండునది ఏదో అదే అహం. ఉండుటే బ్రహ్మమని బ్రహ్మగీతలో చెప్పారు. లేనిది మాయ. లేనిదాన్ని లేనట్లు చూస్తే, ఉన్నది ఉన్నట్లు ఉంటుంది, ఉన్నది నీవేనని తెలుసుకుంటే ఇన్ని ప్రశ్నలు రావు" అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment