రమణాశ్రమ లేఖలు 236 (10-4-49)
రమణాశ్రమ లేఖలు 236 (10-4-49)
https://bhagavanraman.blogspot.com/2018/12/blog-post_30.html
వటవృక్షం
రమణలీల మూడో ముద్రణలో కొన్ని విషయాలు తగ్గించి
అచ్చువేయడం వల్ల ఆ పుస్తకం రాగానే భగవాన్ చూస్తూ “విషయ నిర్ణయంలో
అక్కడక్కడ పొరపాట్లున్నవి” అని సెలవిచ్చారు. నేనా విషయం కృష్ణ భిక్షుతో
చెప్పి “భగవాన్ సన్నిధిలో చదివి సరిచేసుకోవయ్యా, పునర్ముద్రణ సవరించవచ్చును” అన్నాను. ఆయన కుంభాభిషేకానికి వచ్చి మొన్నటి వరుకూ ఇక్కడే
ఉండి వెళ్ళారు. ఈ అవకాశంలోనే రమణలీల శ్రీవారి సన్నిధిలో చది:
చేసుకుంటానని గత నెల 29 తేదీన ఆఫీసులో పర్మిషన్ తెచ్చుకొని 31 వ తేదీన మధ్యాహ్నం రెండున్నర నుండీ చదవడం ఆరంభించాడు.
కొన్ని సవరణలూ, మధ్య మధ్య చేర్చవలసినవి ఎన్నో కథలూ భగవాన్ చెపుతూ రావడంవల్ల 2వ
తేదీ సాయంత్రానికి సగమే ముగిసింది.3వ తేదీన భగవాన్ చేతికి వచ్చిన పుండుకు ఆపరేషన్ జరగడం వల్ల ఆనాడు చదవడం ఆపారు. ముగిసింది. మూడవ తేదీన భగవాన్
మరుదినం డాక్టర్లూ, ఆఫీసువారూ చదువువచ్ఛునన్నారని చదవడం ఆరంభించి రెండు రోజుల్లో చదివి ముగించి వెళ్ళిపోయాడు కృష్ణ భిక్షువు.
ఆయన వెళ్ళినా శ్రీవారి సన్నిధిలో ఇంకా ఆ ప్రసంగం వస్తూనే ఉంది. నిన్న మధ్యాహ్నం ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి" తెలుగు చరిత్రలో విషయాలు చాలా ఉన్నట్లున్నవే.అరవంలోనూ,
ఇంగ్లీషులోనూ అవన్నీ లేవు భగవాన్" అన్నాడు.
“అవును. వీరు (కృష్ణభిక్షు) అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండడం
చాలా విషయాలు సేకరించి చేర్చారు. ఇంగ్లీషు రాసిన నరసింహయ్య,అరవం
రాసిన శుద్ధానంద భారతి మళ్ళీ రానేలేదు" అన్నారు భగవాన్ "జుంటీగల
విషయమూ, మర్రిఆకు విషయమూ ఈ రమణలీలలో విడివిడిగా రాయబడినవి. ఆ మట్టిఆకు చూచే పైకి ఎక్కాననీ, అప్పుడే జుంటీగలు కుట్టినవనీ ఎప్పుడో
భగవాన్ సెలవిచ్చినట్లు గుర్తే?” అన్నాను.
“అవునవును. ఒక ఉదయం, నేను తలవని తలంపుగా విరూపాక్షగుహ
నుండి ఇటు ప్రక్కనే కొండదిగి ప్రదక్షిణమార్గంగా పోతూ పంచముఖదర్శనానికీ,
పచ్చెయమ్మ కోవెలకూ మధ్యనున్న మార్గాలలో కొండ ఎక్కి అడ్డదోవన
నడుద్దామని అలా అలా ఎక్కుతూ పోయాను. దారీలేదు డొంకాలేదు. ఒకటే
అడవి. ఎక్కగా ఎక్కగా ఎక్కడినుండో పెద్ద మర్రాకు ఒకటి కొట్టుకొని వచ్చింది.
ఆ ఆకు ఒక్కటీ పెద్ద విస్తరంత వున్నది. అది చూడగానే అరుణాచల పురాణంలో
అరుణగిరియోగి నివసించే వటవృక్షాన్ని గురించి చెప్పిన శ్లోకం జ్ఞప్తికి వచ్చింది”
'అస్త్యుత్తరేస్మిన్ శిఖరే దృశ్యతే వటభూరుహః
సిద్ధ వేష స్సదైవాస్తే యస్యమూలే మహేశ్వరః
యస్యచ్ఛాయాతి మహతీ సర్వదా మండలాకృతిః
లక్ష్యతే విస్మయోపేతైః సర్వదా దేవమానవైః
'దేని నీడ బహుతరవ్యాపితో సదా ముండలాకారంగా
మానవులచేత ఆశ్చర్యకరంగా చూడబడుతూ ఉన్లదో ఆ వటవృక్షం ఈ
గిరి ఉత్తర శిఖరమున కనుపిస్తూ ఉంది. ఆ వృక్షము క్రింద సిధ్ధవేషము ధరించిన
మహేశ్వరుడు (అరుణగిరి యోగి) సదా నివసిస్తూ ఉన్నాడు'అని తాత్పర్యం.
“సరి, ఈ శ్లోకం జప్తికి రాగానే ఈ ఆకు ఆ వటవృక్షానిదే కాబోలును. ఇది వచ్చిన జాడననుసరించి పోయి ఆ వృక్షం చూద్దామని తోచి ఎక్కుతూ ఉంటే ఒక ఎత్తు ప్రదేశంలో ఒక వృక్షం ఉన్నట్లు గోచరించింది. అక్కడికి
ఎక్కుదామని పోతూంటే ఒక పొదకు నా తొడ రాచుకున్నది.ఆ రాపిడికి
అందులో ఉన్న జుంటీగలు చెలరేగి కరపటం ఆరంభించినవి. సరే. ఈ తొడ తప్పు చేసింది కనుక దానికిదే శిక్ష అని కదలకుండా నిలిచాను.ఆ ఈగలు వేరెక్కడా కుట్టక ఏభాగం వాటికి తాకిందో ఆ భాగంపై మాత్రమే కుట్టినవి.
ఒక్కొక్కటీ వచ్చి, ముక్కుతో తొలిచి, ఆ ముక్కు అందులో విరిగేంతవరుకూ
పొడిచి పోయేది. ఈ విధంగా వాటి యిష్టం వచ్చినంతసేపు కసి దీర కరిచి పోయినవి. అవి వదలిపోయిన తరువాత నడక సాగించాను.
అయితే ఆ వటవృక్షం సంగతి మాత్రం గుర్తేలేదు. చిత్రంగా ఆ విషయమే
మరుపుకలిగి ఏడు దొనలకు చేరుకుందామని చూస్తే మధ్యన అగాధమైనవి మూడుదొనలు అడ్డుగా ఉన్నవి. కాలు చూద్దామా ఇంత లావై బాధిస్తూ ఉంది. సరే, ఎల్లాగో ఆ మూడు దొనలూ దాటి ఏడు దొనలకు చేరి అక్కడి
నుంచి సరాసరి దిగి సాయంకాలం అయ్యేసరికి జటాస్వామి గుహవరకు
చేరాను. అంతవరకూ ఆహారంలేదు, ఏమీలేదు. అక్కడ వారేదో పాలూ, పళ్ళూ
కలిపినది ఒక లోటాతో యిస్తే తాగి రవంత విశ్రమించి, రాత్రికి విరూపాక్ష
గుహకు వెళ్ళాను. కాలు ఇంత లావయింది. జటాస్వామి వాళ్ళు గమనించలేదు
కాని పలనిస్వామీ వెంటనే చూచి “ఇదేమి? అని విచారించి తెలుసుకొని
మరుదినం నువ్వులనూనె రాచి, శ్రావణంతో ఆ కుట్టిన చోట గుచ్చి చూస్తే
ఒక్కొక్క కుట్టులోనూ ఒక్కొక్క ముక్కూ ఇనపమేకులా ఉంది. వారు చాలా
శ్రమపడి అవన్నీ మెల్లిగా తీసి, తరువాత ఏవేవో చికిత్సలు చేసారు. రెండు
మూడు రోజులకు కాలు వాపు తగ్గింది” అని సెలవిచ్చారు భగవాన్,
“ఆ తరువాత ఆ వటవృక్షం వున్న స్థలం గుర్తించాలన్న యత్నం చేయనేలేదా
భగవాన్" అన్నాను. “ఊహూ. మళ్ళీ ఆ తలపే కలుగలేదు” అన్నారు భగవాన్.
ఆమధ్య వెంకట్రామయ్యగారూ, మురగనారూ, కుంజుస్వామి ఇత్యాదులంతా
ఆ స్థలం కనిపెట్టాలని వెళ్ళి భంగపడ్డారు కాబోలునే?” అన్నాను. “అవునవును.
అదొక తమాషా, అప్పుడు మీరు ఉన్నారు కదూ. విన్నారుగా?” అన్నారు
భగవాన్. “విన్నానుగాని వివరాలు తెలియవు” అన్నాను. “అయితే వాళ్ళల్లో
ఎవరినైనా అడగండి చెప్తారు. వాళ్ళు పడ్డ పాటు వాళ్ళే చెపితేనే బాగుంటుంది.”
అని సెలవిచ్చారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment