238
ఆసురి వాసన
13-4-49
వారం రోజుల క్రిందట రామ యోగి గారు ఇక్కడకు వచ్చారు. ఈ ఉదయం భగవాన్ సన్నిధిలో కుర్చుని " భగవాన్! కొందరిప్పుడు మేము జ్ఞానులమైనాం,జీవన్ముక్త స్థితిలో ఉన్నాం' అంటూ ఒక్క క్షణం కూడా స్తిమితంగా కూర్చోకుండా తిరుగుతూనే ఉంటారే.వారెలా జీవన్ముక్తులౌతారబ్బా"? అన్నారు.
"దానికేమి,నారదాదులు జీవన్ముక్తులైనవారే కదా.లోకసంచారంవల్ల జీవన్ముక్తికి కొదవ ఏమయింది? వారి వారి ఉపాధి యొక్క ప్రారబ్ధానుసారం
జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు" ఆని సెలవిచ్చారు భగవాన్.
"అది కాదు భగవాన్, నారదాదులు జీవన్ముక్తులైన తరువాత లోకకల్యాణార్టం
సంకీర్తనసరులై సంచరించారు. వీరిలా కాదే. రాగద్వేషాదులతో కూడిన లౌకిక
వ్యవహారాల్లో సదా సంచరిస్తూనే మేము జ్ఞానులం, జీవన్ముక్తులం అంటే ఎలా
పొసగుతుంది?" అన్నారా భక్తులు. 'మీరడిగేది సరిసరి. దాన్నే ఆసురవాసన
అంటారు. ఆ అసురనాసనను గురించి వాసుదేవ మననంలో తమాషాగా రాసారు. విందురుగాని ఉండండి' అని "ఏమోయ్, వెంకటరత్నం, వాసుదేవ మననం తీసుకొనిరా" అన్నారు భగవాన్. అతనా పుస్తకం తెచ్చాడు. భగవాన్
ఆసురవాసనా ప్రకరణం తీసి చూసి చసనసుంటూ" " ఇదుగో చుడూ, సవ్వకుండా
చదవాలి తెలుసునా? ఆంటూ నీలో నీవు
గొణుక్కోకుండా పెద్దగా చదవాలి. అదుగో. అప్పుడే నవ్వుతున్నావు. నవ్వకుండా చదువు" అని
హెచ్చరించారు. అతను ఎలాగో నవ్వు ఆపుకుని చదవడం ఆరంభించాడు. విషయసారాంశం రాస్తానిక్కడ. " సాధకుడైనవానికి ఆసురవాసనా సంబంధమైన ప్రతిబంధకం, ముందు తనలో లేనట్లు తోచినప్పటికీ ఒకానొక సమయంలో, ఇతరుల ఆచారాలు చూసి గాని తనకు తాను ఆపేక్షించడంవల్ల గానీ ఆ ప్రతిబంధకం ప్రకటితమౌతుంది
ఏవిధంగా అంటే 'ఓరీ భ్రష్టుడా! ఇలాగా ఆచారాలు చేయడం
భ్రష్టుడవై పోయావు. సందేహం లేదు. నీకు ఈ ఆచారాలు చెప్పిన గురువెవరో
వాడూ భ్రష్టుడే. రేపటినుండి నీవు మా సన్నిధికి రావదు. పో.
“ఓరీ! మాకు నమస్కరించి బతికిపోరా. గురుపాద తీర్థం పుచ్చుకుని
బతికిపో. మాకు సేవచేయడం కన్న వేరే వేదాంత విచారం ఏముందీ? మమ్ము పూజిస్తే సకలాభీష్టములూ సిద్ధిస్తవి. మమ్ము వినా వేరేవరికీ సేవ చేయకు. ఓరీ! మా వారెవ్వరికైనా నీకున్నదంతా ఇవ్వకుంటే నీవు మా వద్దకు
రావద్దు. ఇదుగో! ఒకడు మమ్ము లక్ష్యపెట్టక లేవలేదు. వాడి ఆయుష్షు అంత మట్టుకు సరి అన్నాం. భస్మమైపోయాడు. ఇంకొకడిదే విదంగా ఐశ్వర్యం పోగొట్టుకున్నాడు. ఇంకొకడు మా వద్ద మంత్రోపదేశమై, తరువాత మమ్ము గణింపక భస్మమైనాడు. మా మహిమ మావంటి వారికే కానీ, ఇతరులకేం తెలుస్తుంది. మేము భూతభవిష్యద్వర్తమాన కాలాదులన్నీ తెలిసినవారం.
త్రికాలములందూ మేము లోకాన్ని రక్షిస్తున్నాము. చాలా ధనం సంపాదించి,
అదంతా దానం చేసి వేసాము. ఎవరెవరి మనస్సులలో ఏయే కోరికలున్నవో
అవన్నీ మాకు ఎదురుగా వచ్చి నిలుస్తవి. అదుగో, వాడికి ఆ ఆపద రాగలదు.
ఇదుగో వీడికి ఈ సంపద వచ్చి తీరుతుంది. ఇవన్నీ మాకు గోచరించగలవు. నేను సిధ్ధుణ్ణి,భోగిని, ఈశ్వరుణ్ణి. నాకంటే అధికులెవరున్నారు? అంతా నన్నే సేవించాలి. నా వల్లనే వారి వారి అభీష్టాలు నెరవేర్చుకోవాలి.అలా
చేయకుంటే పాపకూపంలో పడిపోతారు. గురుద్రోహం చేసినవారవు,
జాగ్రత్త” అంటూ ఇంకా ఇదే భావంతో ఎంతో రాసి, ఆ ప్రకరణం చివర " ఈ
ప్రతిబంధం అనర్ధహేతువు కనుక మోక్షాసక్తులైనవారు తగు రీతిగా విచారించి
తెలుసుకొని దాన్ని పరిత్యజించాలనీ, ఈ ప్రతిబంధం ఉండగా శ్రవణాదులు
ఎవరైనా చేసినప్పటికీ ఆ జన్మలో మోక్షం కలుగదనీ, అయితే, ఆ శ్రవణాదులు వ్యర్థమై పోక ఉత్తమ లోక ప్రాప్తి కలిగి, తద్వారా చిత్తశుద్ధి ఏర్పడి ఆ తరువాత బ్రహ్మనిష్ఠులై పుట్టి క్రమ క్రమంగా శ్రవణాదులు చేసి జ్ఞానం పొందగలరని ఉంది"
వెంకట రత్నం అదంతా చదివి ముగించిన తరువాత భగవాన్ నవ్వుతూ ప్రశ్నించిన ఆ భక్తులను చూసి" ఏమండీ అంతా విన్నారు కదా?" అన్నారు " విన్నాను. అయితే ఈ ప్రతిబంధం ఉండగా శ్రవణాదులు చేసినవారికి ఆ జన్మలో మోక్షం రాకున్నా ఈ శ్రవణాదులూ వృధాపోక ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుందని అన్నారు సరే.ఆ శ్రవణాదులూ చేయక ఈ ప్రతిబంధమే ప్రాధాన్యంగా ఉంచుకుంటేనో?" అన్నారా భక్తులు."అది తప్పక అధర్దహేతువే అవుతుంది నహంషుడు పదభ్రష్ఠుడై అజగరంగా (కొండచిలువగా) పదివేలేండ్లు పడిఉండలేదా? అని సెలవిచ్చారు భగవాన్.
Comments
Post a Comment