రమణాశ్రమ లేఖలు 253 (10_7_49)

రమణాశ్రమ లేఖలు 253 (10_7_49)
Https://bhagavanraman.blogspot.com/2018/12/253-10749.html
అద్వైత దృష్టి

ఈ మధ్య ఆంధ్రులొకరు వచ్చి గజేంద్ర మోక్షం కధను ప్రస్తావిస్తూ పోతన భాగవతంలోని
ముఖ్యమైన పద్యాలు కొన్ని చదివి, “ఆ గజేంద్రునికి
కలిగిన సాక్షాత్కారాన్ని గురించి భగవాన్ అభిప్రాయం ఏమి?" అని అడిగారు.
భగవాన్ చిరునవ్వుతో “ఇదుగో చూడండి. తన రక్షణ నిమిత్తం కదా గజేంద్రుడు
ప్రార్థించింది. ఇప్పుడు మీరు చదివిన పద్యాలలోనే భవము, దోషము
కర్మము, నాశము, గుణము మొదలైనవి లేనివాడనీ, 'కలడందురన్ని దిశలందు'
అనీ చెప్పివుందే. అంటే సర్వత్ర పరమాత్మయే గోచరిస్తుంది. ఇక బాధించే దెవరు? బాధింప బడేదెవరు? ఆ విషయం అంత పరిపూర్ణంగా వుంటే ఎక్కడో వైకుంఠంలో కోట వెలుపల తోటలోనుండి ఊడిపడ్డారట. అదంతా భావం
మాత్రం కాక మరేమిటి? సాక్షాత్కారమట. కారం. ఏదో ఒకటి" అని
సెలవిచ్చారు.

   “అయితే, సాక్షాత్కారాలన్నీ భావనామాత్రమేనా?” అన్నారా భక్తులు, "ద్వైత
దృష్టికి సాక్షాత్కారం కాని అద్వైత దృష్టికి అన్నీ భావనామాత్రాలే" అని సెలవిచ్చారు
భగవాన్.

  కొంతకాలం క్రిందట యాత్రార్థులైన కొందరాంధ్రులు వచ్చి కొన్నాళ్ళు
ఉన్నారిక్కడ. వారిలో ఒక స్త్రీ భద్రాద్రి రామదాసు కీర్తనలు అప్పుడప్పుడు
హాలులో పాడుతూ వచ్చింది. ఒకనాడు “ఇక్ష్వాకు కులతిలక” అన్న కీర్తన
పాడింది. ఆ కీర్తనలో "అవి చేయించాను, ఇవి చేయించాను, అంతయింది,
ఇంతయింది” అన్నవన్నీ అయిన వెనుక “కలికి తురాయి నీకు పొలుపుగ
చేయిస్తి రామచంద్ర, నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర"
అని పాడేసరికి భగవాన్ మా వైపుచూచి "అవన్నీ కావాలని వారన్నారు కాబోలును,
అంతా తమ సంకల్పమే కదా. వారినెందుకో తిట్టడం?” అని సెలవిచ్చి చిరునవ్వు
నవ్వారు. “తిట్టినా దేవుణే తిట్టాలన్నారు కదా? అన్నారొక భక్తులు. “అది సరేలెండి. అప్పరు కూడా ఒక చోట ఇదే విధంగా నిందాస్తుతి చేసారు. అంటే
మృదువుగా తిట్టారు. దానికేమి కాని అది చేయించాను, ఇది చేయించాను'
అంటారే. చేయించేందుకు తానెవరు? వారిని విడిచి తానొక డున్నాడు కాబోలు”
అన్నారు భగవాన్. “భగవంతుడు, భక్తుడు అని అనుకున్నంత వరకూ అది
ఉండేదేగా?” అన్నాడా భక్తుడు. 'అదే అదే, ద్వైతదృష్టిలో ఉన్నంత వరకూ
అంతే. అద్వైతదృష్టిలో ఇదంతా ఉండదు. నీవే నేను, నేనే నీవుగా అయినప్పుడు
ఇక చేసేదెవరు? చేయించేదేమి?” అని సెలవిచ్చారు భగవాన్. “దానినే పరాభక్తి
అంటారా?” అన్నారా భక్తులు. “ఊ…ఊ” అని తలవూపి ఊరుకున్నారు భగవాన్.

భావబలం బుచే భావనా తీత
భావస్థి తిమునులు పరభక్తి యనిరి
(ఉపదేశసారం-ద్విపద)

Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ