రమణాశ్రమ లేఖలు 247 ( 3-6-49)

రమణాశ్రమ లేఖలు 247 ( 3-6-49)
https://bhagavanraman.blogspot.com/2018/12/247-3-6-49.html
ముఖమండపావాసం

మహాపూజ నాటి పగలంతా భగవాన్ క్రొత్తహాలులో (ముఖమండపంలో)
గడిపి రాత్రికి తిరిగి స్వర్ణోత్సవ పర్ణశాలకు వచ్చారు. మరొక వారానికి క్రొత్త
హాలు పని పూర్తి అయింది. కొందరు భక్తులకు స్వర్ణోత్సవ పర్ణశాలయే భగవాన్ ఉండుటకు వసతిగా ఉంటుందని తోచి ఆఫీసు వారితో సూచించారు.
సర్వాధికారి మాత్రం భగవానుని ముఖమండపం లోనే  కూర్చోబెట్టాలని కోరిక .
అందువల్ల వారు ఒకనాటి  తమ అనుచరులతో సహా భగవానుని ఈ జ్యేష్ట శుద్ధ పంచమీ బుధవారానికి సరియైన  1_6_49 తేదీ
ఉదయం పది గంటలకు యోగాసనం మీద సిరంగా ఉండే నిమిత్తం ఏర్పాట్లన్నీ
చేయగలమనీ, భగవాన్ అక్కడికి దయచేయాలనీ అనుచరుల ద్వారా
అడిగించారు. భగవాన్ సాక్షీభావంతో "నాదేమున్నది. పది మందీ కలిసి ఎక్కడ
కూర్చోమంటే అక్కడే కూర్చుంటాను" అన్నారు. "అందుకే మేమంతా కొత్త
హాలుకు రావలసిందని ప్రార్ధిస్తున్నాము” అన్నారు వారు, “సరి సరి"
తల ఊపారు భగవాన్.

   మొన్న ఒకటవ తేదీ ఉదయాన ముఖమండపంలో ముగ్గులు పెట్టి చుట్టూ
పచ్చాకు తోరణాలు కట్టారు. యోగాసనం మీద శాటిస్ సిల్కు పరుపు వేసి వెనక ప్రక్కన బాలీసుపెట్టారు. పైన సిల్కు వేసి దుప్పట్లు కప్పి చక్కగా అలంకరించారు. కోవెలలో అభిషేక పూజాదులు నడిపి గణగణ మ్రోగే ఘంటారవంతో కర్పూర
హారతులెత్తుతూ వుండగా తొమ్మిది ముప్పావుకు గోశాలవద్దకు వెళ్ళి, తిరిగి వచ్చే భగవానుని వెన్నంటి పూర్ణకలశ సహితులైన బ్రాహ్మణులు వేదనారంలో
పాఠశాలవద్ద నుండి బయలుదేరి ముఖమండపానికి తీసుకొని వచ్చి
యోగాసనంలో ఆసీనులను గావించారు. “న కర్మణా' ఇత్యాది వేదవాక్కులతో
నీరాజనమిచ్చి భక్తులందరూ ప్రణతులైన వెనుక భగవాస్ యథాస్థానంలో
కూర్చున్నారు

   శ్రీచక్రాకార పట్టణం నిర్మింప నారంభించిన విద్యారణ్యులు విఫల
మనోరథులై “భవిష్యత్తులో ఒక చక్రవర్తి అలా చేయగల” డని రాసి ఉంచిన
విషయాన్ని స్మరించి అరుణాచలాష్టకంలో “శ్రీచక్రాకృతి శోణశైలవపుషం" అన్న
వాక్యానుసారం “ఈ గిరియే శ్రీ చక్రాకారం కావడంచేత ఇదే వారు నిర్దేశించిన
స్థలమనీ, భగవానే చక్రవర్తి అనీ, చుట్టూ ఇళ్ళు కట్టడమే తరువాయి అని అంటూ అంటూ రాజ్యాంగ నిర్మాణానికి ప్లానులు వేసి వేసి భగ్నమనోరథులైన గణపతి మునులదీ, అమ్మ సమాధి మీద ఆలయం కట్టి దాని ముఖమండపమే  ఆస్థాన మండపంగా
విక్రమార్క సింహాసనంపలె శీలాససం సర్మించి, భగవానుని అందు ఆఫీసులను చేసి ఆనందించాలన్న సర్వాధికార సరంజనానందుల యొక్కయు, అభీష్ఠ ఫలసిద్ధికై యోగిరాట్ చక్రవర్తియైన భగవాన్ సాక్షాత్ సదాశివునిపలె
అక్కడ ఆసీనులైనారు కాబోలునని అనుకుంటూ కూర్చున్నాను.

   ఇంతలో స్థపతి మొదలైనవారు ఒక పళ్లెంలో ఫలపుష్పాది మంగళద్రవ్యాలు
పెట్టుకొని వచ్చి భగవాన్ చేత తాకించి సోఫాకు ఎదురుగావున్న దక్షిణద్వారం
దాటి వెళ్ళారు. ఎందుకో నాకు అర్థంకాలేదు. భగవాన్ అటే దృష్టి నిలిపి
చూస్తూ ఉన్నారు. ఏమై ఉండునా అని అటువెళ్ళి చూతును కదా ద్వారానికీ
ఎదురుగా వున్న మైదానంలో ఒక కొండశిల పెట్టివున్నది. వీరంతా దానికి
పసుపు కుంకుమా రాచి పూలదండ వేసి, టెంకాయలు కొట్టి, కర్పూరం
వెలిగించి టక్కుటక్కున చెక్కటానికి ఆరంభించారు. “ఎందుకది?” అని ఎవరినో
అడిగితే, “భగవానుని ప్రతిమ చెక్కడానికి” అన్నారు. నా గుండె ఝల్లుమన్నది.
“ఎందుకల్లా కలత పడ్డావు?” అంటావేమో. ప్రస్తుతం భగవాన్ శరీరం అస్వస్థతగా
వున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్భంలో ఇదెందుకా అన్న సందేహం
కలిగింది. మనస్సుకు ఏమేమో సమాధానాలు చెప్పుకుంటూ భగవాన్ సన్నిధికి
వచ్చి కూర్చున్నాను. నా యీ అవస్థ భగవాన్ గమనిస్తూనే ఉన్నారు. ఇంతలో
ఆ తంతు ముగించి అంతా లోపలకు వచ్చారు. భోజనశాలలో గంట మ్రోగింది.
ఎవరి దోవన వారు వెళ్ళామే కాని ఏదో ఆందోళనగానే ఉంది మనస్సు.
మధ్యాహ్నం మూడింటికి వెళ్ళినప్పుడు భగవాన్ ఏవో కథలు చెప్పి ఆ విషయం
మరపుకు వచ్చేట్టు చేసారు సుమా. అదంతా మరొక లేఖలో రాస్తాను.

Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ