రమణాశ్రమ లేఖలు 241 (12-5-49)
రమణాశ్రమ లేఖలు 241 (12-5-49)
Https://bhagavanraman.blogspot.com/2018/12/241-12-5-49.html
మందే వచ్చింది
వారం క్రిందట పోస్టులో మాధవిఅమ్మ నుండి ఉత్తర వచ్చింది."భగవాన్
చాలా చిక్కిపోతున్నారని విన్నాను, టొమాటోరసం భగవాన్ ఆ విషయం పుచ్చుకోవలసిందని ప్రార్థిస్తున్నాను" అని రాసిందట. ఆ
మాకందరకూ చదివి చెపుతుంటే, "పుచ్చుకుంటే మంచిదే కదా" అన్నారొక
భక్తులు. భగవాన్ నవ్వుతూ “సరిపోయింది. ఆమె ధనవంతులు
తినవచ్చును. నాకెందుకు? అయినా అవన్నీ తిని ఆమె మాత్రం
బలంగా ఉందబ్బా? అస్సో ఉసో అనుకుంటూ నేలకు జానెడెత్తున ఉంది , తానే తాగరాదూ?” అన్నారు.
ఆ సాయంత్రమే బెంగుళూరునుండి ఆయుర్వేద వైద్యులు రామచంద్రారావు
గారు వచ్చారు. వారు హాల్లోకి రావడం దూరంనుంచే భగవాన్ " అదుగో
రామచంద్రరావు వస్తున్నాడు. మందులు ఏమైనా తెచ్చాడేమో, వారిని చూస్తే
మనిషిని చూచినట్లుండదు. మందులు చూచినట్లే ఉంటుంది." అని
సమీపస్తులతో చెప్పారు. ఇంతలో ఆ రామచంద్రరావుగారు పెద్దది ఒక నిండు సీసా ఒకటి తెచ్చి భగవాన్ సన్నిధిలో సమర్పించి లేచారో లేదో
మావైపు చూచి, “అదుగో, చెప్పానా! మందే వచ్చింది," అన్నారు నవ్వుతూ భగవాన్.
రామచంద్రరావుగారు చేతులు నలుపుకుంటూ “మందు కాదు భగవాస్. ఆరీష్టం.
భగవాన్ శరీరం చాలా శుష్కించి ఉంది. ఇది తాగితే పుష్టి కలిగిస్తుంది.
ఉపయోగించాలి' అని ప్రార్థనా పూర్వకంగా మనివి చేసారు.
భగవాన్ చిరునవ్వుతో “సరేనండీ. ఇది తాగినంత మాత్రాన బలిసేట్టుంటే,
ముందు మీరే ఉపయోగించుకోరాదూ. బక్కచిక్కి ఎలాగున్నారో. ముందు మీరు తాగి పుష్టిగా ఉండండి.తరువాత నా సంగతి యోచిద్దాం" అని సెలవిచ్చి మా అందరినీ చూసి "ఇదుగో చూడండి ఎలా ఉన్నాడో తన ఒళ్ళు తాను
బాగుచేసుకోవటం చేతకాలేదు. నా ఒళ్లు బాగుచేస్తాడట. తన్ను తాను బాగు చేసుకుంటే అంతే చాలును." అన్నారు ఛలోక్తిగా.వారంతటితో మాట్లాడకుండా ఆఫీసు
లోకి వెళ్ళారు. మరుదినం ఆ అరిష్టమంతా సమీపంలో ఉన్న వారందరికీ ఒక్కొక్క
అవున్సు చొప్పున ఇప్పించి, తామూ ఒక అవున్స్ తీసుకుంటూ " ఇదుగో! ఆ రామచంద్రరావు మన అందరికన్న సన్నం కనుక మరొక అవున్సు ఎక్కువ ఇవ్వండి. మరి కొంచెం బలుస్తాడేమో చూద్దాం' అని సెలవిచ్చారు
ఆ తరువాత నాలుగైదురోజులకే బెంగుళూరునుండి కంట్రాక్టర్
శఠగోపం నాయుడు వస్తూ షర్బత్ సీసాలు కొన్ని తెచ్చి “ఈ వేసంగిలో నిత్యం
భగవాన్ ఇది పుచ్చుకుంటే బలంగా ఉంటుంది. ఇవ్వం”డని చెప్పి సమీపవర్తుల
ద్వారా సన్నిధికి పంపాడు. అతడు ఇక్కడికి వచ్చి నెలల తరబడి ఉండి, వేలల్లో
ధనం వెచ్చించి, ఆశ్రమ కైంకర్యంలో భాగస్తుడుగా ఉంటాడేగాని భగవాన్
దగ్గరకు మాత్రం రాడు. అదేం అంటావేమో, ఏం చెప్పేందుకు లేదు. అదొక విధమైన భక్తి.
ఆ షర్బత్ సీసాలు చూడగానే భగవాన్ నవ్వుతూ “రామచంద్రరావూ, వీరూ
ఆడ బలుక్కొని వచ్చారు కాబోలు. మనకెందుకు ఇవన్నీను. తాను ధనవంతుడు
కనుక ఎన్ని సీసాలెనా తాగవచ్చును. వారి గదిలోనే ఉంచుకొని నిత్యం కొంచెం
కొంచెం పుచ్చుకోమనండి" అన్నారు. “ఇవి భగవాన్ కొరకే తెచ్చాడట” అన్నారు
వారు, “సరే. అయితే ఒకపని చేద్దాం ఉండనీయండి" అని చెప్పి ఆ మధ్యాహ్నం
కళాయి పూసిన ఒక గంగాళం నిండా మంచినీళ్లు పోయించి, ఈ షర్బత్ అంతా
దానిలో కుమ్మరించి, “అందరికి ఒక్కొక్క గ్లాసు చొప్పున యిచ్ఛి నాకూ
ఓ గ్లాసెడు ఇవ్వండి. ఆ శఠగోపానికి మాత్రం మరొక గాసెడు ఎక్కువివ్వండి. ఎక్కడ దాగి ఏ మూలనక్కాడో, కాస్త తేరుకుంటాడు పాపం" అని సెలవిచ్చారు భగవాన్. ఆ తరువాత ఆ షర్బత్ కూలీనాలీలతో సహా ఆబాల గోపాలానికీ వినియోగమయింది.
1948లో కాన్పూరు నుండి వచ్చిన ఖన్నా అనే భక్తుడు భగవాన్ శరీరానికి
బలకరమని స్వయంగా తానే తయారు చేసిన ప్రశస్తమైన చ్యవనప్రాశం డబ్బాలలో
పార్సెల్ చేసి పంపాడు. “నాకు బలం కలిగించేదైతే అందరికీ బలం కలిగించిదా
కలిగించదా ఏమి?” అని సెలవిచ్చి ఉదయం ఇడ్లీ ఆహార సమయంలో అందరి ఆకుల్లోనూ
వడ్డింపచేసి అందరితో సమంగా తామూ స్వీకరించారే గాని రవంతైనా అధికంగా
పుచ్చుకోలేదు భగవాన్,
ఎవరికీ పనికిరాని పదార్థమైతే, అంటే సంకటీ మొదలైన వన్నమాట, ఇది
తమకు అధికభాగమూ, అందరికీ పనికివచ్చే మధురపదార్ధమైతే తమకు
స్వల్పభాగమూ స్వీకరిస్తారు భగవాన్. ఇలాంటి సమరసభావ సంపన్నునకు
ఎవరీడు? వారికి వారే సరి.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment