రమణాశ్రమ లేఖలు 240 (10-5-49)
రమణాశ్రమ లేఖలు 240 (10-5-49)
Https://bhagavanraman.blogspot.com/2018/12/240-10-5-49-17-4-8.html
పాతాళ లింగం
భగవాన్ ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో అరుణాచలేశ్వర ఆలయంలో
ఉన్న వేయికాళ్ళ మండపంలోని పాతాళలింగం వద్ద కొన్నాళ్ళు రక్తం కారేట్లు కీటకాలు కరచినా లక్ష్యపెట్టక తదేకనిష్టతో నివసించి ఉన్నారని చరిత్రలో రాసి ఉన్నారు కదా. శిధిలావస్థలోవున్న ఆ గుహా, అందున్న లింగం మనం
చూచే ఉన్నాం. ఆమధ్య ఆ గుహను బాగుచేసి చక్కని దేవాలయంగా మార్చాలని
మిసెస్ తలియార్ ఖాన్ ప్రయత్నపడి. డబ్బు వసూలు చేసి, తారాపూర్ కంపెనీ
వారిని కుట్రాక్టర్లుగా నియమించింది. మాతృభూతేశ్వరాలయ కుంభాభిషేకానికి ముందే అది తయారయింది. అయినప్పటికి కుంభాభిషేకానంతరమే తెరిచే
ఏర్పాటుతో ఆ కార్యక్రమం నిలిపివుంచారు.
మార్చి 17వ తేదీన కుంభాభిషేకమయింది కదా. అందువల్ల ఈ నెల 4 వ తేదీ ఉదయం 8.30 కు ఆ పాతాళలింగ దేవాలయం గవర్నర్ జనరల్
సి.రాజగోపాలాచారి వచ్చి తెరిచేటట్లు ఏర్పాట్లన్నీ చేసి ఆహ్వనపత్రిక
అందరకూ పంపించింది మిసెస్ తెలియార్ఖాన్. రాజదర్బారుతో వచ్చే ఆ
రాజప్రతినిధి రాకకు ముందే ఎక్కడెక్కడి నుంచో రిజర్వు పోలీసు దళాలు వచ్చినవి. రోడ్లన్నీ మరమ్మతు చేసి జాతీయపతాకలతో అలంకరించారు.
వేయికాళ్ళ మండపమంతా శుభ్రపరచి సున్నం కొట్టించారు. ప్రేక్షకులు
చాలామంది వచ్చారు. ఊరంతా కిటకిట లాడింది. ఆ గవర్నర్ జనరల్‌తో
పాటు మద్రాసు గవర్నర్, భావనగరం మహారాజా దంపతులూ వస్తారనీ, వారు
మునిసిపాలిటీ వారూ, పోలీసువారూ తగిన ఏర్పాట్లన్నీ చేసారు.
భగవాన్ దర్శనార్థం పదిన్నర గంటలకు ఆశ్రమానికి రాగలరనీ తెలిసి మునిసిపాలిటీ వారు, పోలీసు వారూ తగిన ఏర్పాట్లన్నీ చేసారు.
ఆ రాజ ప్రతినిధ అనుకున్న వేళకు సరిగ్గా రైలు దిగి తెఱచి అక్కడే శ్రీభగవానుని గురించి ప్రశంసనీయంగా ప్రసంగించి" అత్యవసరమైన పనులు ఉన్నందువల్ల ఆశ్రమానికి రాలేకపోతి " నని గవర్నరు ద్వారా భగవానుకు విన్నపం పంపి వెళ్ళిపోయినారు. వారటు పోగానే అక్కడి
ఇక్కడికి వచ్చిచేరారు. పదిన్నరకల్లా భావనగరం రాజదంపతులు భగవాన్ సన్నిధికి వచ్చి, భక్తిపూరితహృదయులై ప్రణమిల్లి అనేకవిధాల ప్రస్తుతిస్తూ అరగంట ఉండి, అనుగ్రహ ప్రసాదం స్వీకరించి సెలవుపొంది వెళ్ళారు.
ఆ దేవాలయం తెరచినప్పుడు జరిగిన వైభవమంతా చూచివచ్చిన భక్తులొకరు భగవాను నుద్దేశించి “ఎక్కడా వేయికాళ్ళ మండపంలో గుహలు ఉండవే.
ఈ గుహ ఏర్పడ్డ కారణం ఏమిటో?” అన్నారు. భగవాన్ ప్రసన్నవదనంతో
అవును. ఎక్కడా ఉండవు. ఇక్కడ అది ఉన్న కారణం ఏమంటే, ఎవరో పెద్దలు
గతించినప్పుడు వారి శరీరం ఇక్కడ సమాధిచేసి లింగం ప్రతిష్టించారట.
పేయికాళ్ళ మండపం కట్టకముందే ఉన్నందువల్ల దాన్ని కదల్చక అలాగే అడుగున
వుంచి అ, తదితరస్థలం మెరక చేసి ఆ మండపం కట్టారట. అందువల్ల అది
అడుగున పడి, గుహవలె ఉండిపోయింది. తరువాత ఆ గుహామార్గానికి మెట్లు
కట్టారు. నేను అక్కడున్న రోజుల్లో అంతా మట్టి కొట్టుకొని ఉండేది. మండపంలో
ఏనుగు, గుహలో నేనూ తప్ప మరెవ్వరూ ఉండేవారు కారు” అని సెలవిచ్చారు.
ఆ గుహ ఏర్పడ్డ కారణం విని అంతా ఆశ్చర్యం చెందారు.
ఆ వేయికాళ్ళ మండపం ఆంధ్రసామ్రాట్టెన కృష్ణదేవరాయలే నిర్మించినట్లు
కోవెల గోడలమీద శాసనాలున్నవనీ, ఆ శాసనాలలో రాయలవారు ఇంకా
అనేక ధర్మాలు చేసినట్లు చెప్పి ఉందనీ లోగడ భగవాన్ అనేకసార్లు సెలవిచ్చారు.
అది విని డాక్టరు అనంతనారాయణరావు కొందరు భక్తులను వెంట పెట్టుకొని
వెళ్ళి ప్రాకృతభాషలో వున్న ఆ శాసనాలు కాపీ చేయించుకొని వచ్చి ఇంగ్లీషుకు
తర్జుమా చేయించి తమ పుస్తకంలో ప్రకటించారు సుమా. 1944 జూన్‌లో
నేను తిరుచ్చుళి వెళ్ళి వచ్చినప్పుడు భగవాన్ సెలవచ్చిన గాథలూ ఎన్నో వున్నవి.
అవన్నీ మరొక సారి సావకాశంగా రాస్తాను.
Telegram
T.me/bhagavanRaman
శివ
ReplyDeleteAruna chala siva
ReplyDelete