రమణాశ్రమ లేఖలు 239 (14-4-49)

రమణాశ్రమ లేఖలు 239 (14-4-49) https://bhagavanraman.blogspot.com/2018/12/239-14-4-49-1945.html
తుల్య నిందాస్తుతి ర్మౌనిః

1945 జూన్, జూలై ప్రాంతంలో ఒక యూరోపియన్ యువకుడు నీలగిరి
నుండి ఇక్కడకు వచ్చాడు. అతడు వచ్చేసరికి ఏడున్నర అయింది. భగవాన్
స్వల్పాహారార్థం లోపలకు వెళ్ళారట. పళ్ళబుట్టా, తదితర సామాన్లూ హాల్లో
ఒప్పచెప్పి అతడు దడబిడలుగా భోజనశాలలోనికి వెళ్ళడంలో మనీపర్సు దారిలో
పడ్డదట. అతడది గమనించలేదు. అనంతపురం నుండి వచ్చిన ఒక రెడ్డి తాత
అది చూస్తూ ఉన్నాడు. ఆ యువకుడు రానీ చెపుదామని అనుకుంటూ ఉంటే
ఒక పంగనామాల పెద్దమనుష్యుడు పెద్ద తలపాగాతో వచ్చి పర్సుతీస్తుంటే
తాత చూచి “దొరదయ్యా” అన్నాడట. “వారి తాలూకు వాణ్ణేనయ్యా నేను వారే తెమ్మన్నారు వారికే ఇస్తాను" అని ఆ తాతకు వైష్ణవ మాయ కప్పి భోజనశాలలో ప్రవేశించి రెండో కంటికి తెలియకుండా అదృశ్యమై నాబోటి.

   యూరోపియన్ యువకుడు తిరిగి వచ్చి పర్సు పోయిందని పదిమందితో
చెపితే నామాలవారి నటన తాత చెప్పాడు. పదిమంది పదిదోవల వెతికినా
ప్రయోజనం లేకపోయింది. పర్సులో ఉన్నది  పది రూపాయలట.ఏడుముప్పావుకు
నేను వచ్చేసరికి ఈ కథంతా జరిగింది. రెడ్డితాత వల్ల పై కధంతా విని హాల్లోకీ
వెడితే భగవాన్ చిరునవ్వుతో “ఇదుగో! ఆ పరమవైష్ణవునకు పది రూపాయలు
దక్షిణ యిచ్చుకున్నది వీరే” అని నాకు చూపారు ఆ యువకుని. హాల్లో ఉన్న
పెద్దమనిషి అందుకొని “ఆ పర్సు దొరికినవారు
సంతోషిస్తారు లెండి” అన్నారు. “సరిసరి. పోగొట్టుకున్న వారు భగవానే
ఎత్తుకుపోయారని అనుకుంటారు" అని సెలవిచ్చారు భగవాన్.

  ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒకనాడు ఎక్కడినుంచో కొందరు భక్తులు
ఆశ్రమానికి వచ్చారు. వారంతా స్నానపానాదులు ముగించుకుని ఒక పెద్ద
పళ్ళెంలో ఫలాహారాలూ పళ్ళూ మొదలైనవి పెట్టుకొని, భగవాన్ సన్నిధికి వచ్చి
నమస్కరించి కూర్చున్నారు. కొంచెం ఆగి అందరూ 'అరుణాచలేశ్వరాలయానికి
వెళ్ళివస్తా "మని లేచారు. అందులో ఒకరు చేతులు జోడించి " స్వామీ! నేనొక
పని ప్రారంభిస్తూ భగవానుని ప్రార్ధన చేసుకున్నాను. తమ అనుగ్రహం
అది ఫలించింది. నా అభివృద్ధికి శ్రీవారి అనుగ్రహమే కారణం. ..... అదీ ఇదీ అంటూ చాలాసేపు స్తోత్రం చేసి అందరితోనూ కలిసి ఆలయానికి వెళ్ళారు.
వారటు వెళ్ళగానే భగవాన్ చిరునవ్వుతో అందరినీ చూచి వారేదో
అనుకున్నారట. వారి కర్మానుసారం అది ఫలించింది. భగవాన్ అనుగ్రహంవలనే
అది అయిందని స్తోత్రం చేసారు. ఇంకొకరికి వారి కర్మను అనుసరించి
అనుకున్నది కాదు. వారు ‘భగవాన్ ఏమీ సహాయం చేయలేదు. ఏం లాభం?
అని నిందిస్తారు. ఇది వచ్చినట్లే అదీ వస్తుంది. మనం రెండూ తీసుకోవలసిందే"
నని సెలవిచ్చారు.

  అందుకు నిదర్శనంగా నిన్న నొక విషయం జరిగింది. ఏమంటే, దుష్టులెవరో
భగవాన్ పై నిందారోపణ చేస్తూ ఇంగ్లీషులో రాసిన ఉత్తరం నిన్న ఉదయం
పోస్ట్ లో వచ్చింది. ఆశ్రమం వారిది మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో
భగవానుకు చూపారట. సాయంత్రం మూడింటికి మురుగనార్ , విశ్వనాధ బ్రహ్మచారి
మొదలైన భక్తులంతా రాగానే ఆ లేఖా వృత్తాంతం చెప్పి నవ్వుతూ
"ఏమోయ్ వెంకటరత్నం, ఆఫీసుకి వెళ్ళి ఆ ఉత్తరం తీసుకునిరా.వీరెవరైనా చదివి
అందరికీ వినిపిస్తారు అన్నారు. “ఆ-అదెందుకు?” అని అతను వెళ్లలేదు.
"ఎందుకంటా వేమయ్యా, మీరంతా 'స్వామీ స్వామీ' అంటూ ఏదో గొప్పగా
చెప్పుకుంటారు. ఆ ఉత్తరం చదివితే తెలుస్తుంది మన స్వామిత్వ మంతాను,
పోయి తీసుకొనిరా. అంతా చూస్తారు” అన్నారు భగవాన్. కదలలేదాతడు.
భగవాన్ అతణ్ణి చూస్తూ “ఏం. ఎవరైనా భగవాస్ అంతవారు, ఇంతవారు అని
స్తోత్రం రాస్తే తెచ్చి, అందరూ వినేట్లుగా పదిమందిచేత చదివిస్తావే. ఇదెందుకు
తేవు?” అని మావైపు తిరిగి “ఇదుగో! చూచారా వీడి చేష్టలు. భగవాన్ అంత
గొప్పవారు, ఇంత గొప్పవారు అని ఎవరైనా స్తోత్రం రాసి పంపితే తెచ్చి
చదివిస్తాడుగాని ఇది కూడదట. ఏమో" అన్నారు భగవాన్.

  “సరి సరి. అదెందుకు చదవడం" అన్నారు మురగనార్. “ఓహో! అదా
సంగతి. అంతా ముందే కూడబలుక్కున్నారు కాబోలును. పోనీ నాకేమి?"
అంటూ మందహాస ముఖారవిందులై మౌనం వహించారు భగవాన్. శ్రీవారి
పెంపుకు ఓర్వక అపకారం చేయాలని తలపెట్టిన మల్లస్వామి, జటాస్వామి
మొదలైనవారి యందున్నూ సౌహార్దభావాన్ని వ్యక్తీకరించిన భగవానుకు ఇది
ఒక లక్ష్యమా ఏమని మేమంతా అనుకున్నాం. భగవద్గీతా ద్వాదశాధ్యాయంలోని

సమశృత్రౌచ మిత్రేచ తథా మానావమానయో:
శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః (18)
తుల్యనిందాస్తుతిర్మొనీ సంతుష్ణో యేన కేనచిత్|
అనికేతః స్థిరమతి   భక్తమాన్ మే ప్రియో నరః (19)
శ్లోకాల కిదీ దృష్టాంతమే కదా.

Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ