268
ఉండేదెక్కడ? పోయేదెక్కడికి?
1943-44 ఆ ప్రాంతంలో
ప్రాంతంలో చొరవగల ఒక భక్తుడు రమణపురంలో ఇల్లు కట్టుకొని
గుహప్రవేశం కాబోతూ శ్రీవారిని సమీపించి "భగవాస్ అక్కడికి డయచేస్తే
బాగుండునని " చల్లగా సణిగాడు. భగవాన్ చిరునవ్వుతో సరి పోయింది. భగవాన్ వచ్ఛేదెక్కడికీ?
వచ్ఛేేవారంతా భగవానే అనుకో. అంతా వస్తే భగవాన్ వచ్చినట్లు
కాదా ఏమి? వెళ్ళు వెళ్ళు. గృహప్రవేశం కానీ” అని చెప్పి పంపి సమీపస్థులతో
చూచారా,భగవాన్ రావాలట. ఒక్కొక్కరూ ఇంతే. ఎక్కడికి పోయేది?" అన్నారు.
వేరొక భక్తుడందుకొని “ఆ మధ్య ఎవరో భారతమాత కోవెల కడతామనీ,
శంకుస్థాపనకు భగవాన్ రాగలరనీ ప్రకటించారు కదూ?" అన్నాడు.
“అవునవును. అయిదారేళ్ళు అయిందనుకుంటాను. రావాలన్న పిలుపు
లేదు, ఏమీ లేదు. కానీ, రైలులో ఫస్టుక్లాసు ఏర్పాటు చేసామనీ, భగవాన్
రాగలరనీ పత్రికల్లో మాత్రం ప్రకటన చేస్తారు. నా వద్దకు వచ్చి 'భగవాన్
వెడతారా?' అని ఎందరో అడిగారు. 'ఉండేదెక్కడ? పోయేదెక్కడికీ? నా కెక్కడికీ
పోయేందుకు స్థలం లేదే?' అనేవాణ్ణి” అని సెలవిచ్చారు భగవాన్.
“ఒకసారి తీరుపతికీ ప్రయాణ సన్నాహం జరిగిందట కదూ?” అన్నాడా
భక్తుడు. “నిజమే. అది విరూపాక్షగుహలో ఉండగానే. నేనప్పటికి పైన ఏమీ కప్పుకునేవాణ్ణి కాను. ఎందుకో ఆ సంవత్సరం దోమలబాధ విపరీతమైంది. జయరామన్ శాలువ ఒకటి కొనితెచ్చి 'కప్పుకోండి' అని నన్ను తొందరించాడు.నేనది తాకనైనా లేదు.కొన్నాళ్ళు చూచారు.మడత మడతగానే ఉన్నది.
దోమలా విపరీతం. ఆ బాధ పడలేక దగ్గరుండే వారంతా
కూడబలుక్కొని బయటివారికి తెలియకుండా తిరుపతి యాత్రకు సన్నాహం చేస్తూ
"అలా పోవాలి, ఇలా రావాలి,” అంటూ నాతో ఏవేవో చెప్పారు. అన్నిటికీ సరిసరి' అంటూ వచ్చాను. ప్రయాణానికి మంచిరోజు చూచి అంతా మూటాముల్లె కట్టి బయలుదేరి స్వామీ! పోదామా?' అన్నారు. "ఆహా! పోయిరండి"
అన్నాను. 'భగవానో?' అన్నారు. 'భగవాన్ పోయేదెక్కడికి?
వుండేదెక్కడ?” అన్నాను. 'ఈ దోమలబాధ పడలేకుండా ఉన్నాం కదా?' అన్నారు
వాళ్ళు. "పడలేకుంటే మీరు పోయిరండి' అన్నాను. “మా కొరకా బయలుదేరింది?
అన్నారు. 'నేనా ఈ బాధపడలేనన్నది?' అన్నాను. ఇంకేం చెపుతారు
లాభంలేదని ప్రయాణం విరమించి 'శాలువ అయినా కప్పుకోవలసిందని
తొందరించారు. జయరామన్ కొడుకు పిచ్చాండి అప్పటికి చాలా చిన్నవాడు.
వాడు రోజూ ఒక పాతగొంగడి కప్పుకొని వచ్చేవాడు. వీరిక వదలరని ఈ
కొత్త శాలువ ఆ చిన్నవాడికిచ్చి ఆ గొంగడి నాకిస్తే కప్పుకుంటాను' అన్నాను.
ఏం చేస్తారు? తప్పదని అలాగే యిస్తే కప్పుకున్నాను. కప్పుకోవడానికి అదే
ఆరంభం. ముళ్లుముళ్ళల్లే ఉండే ఆ గొంగడి కప్పుకుంటే దోమలు దగ్గరకైనా
వచ్చేవి కావు. వెచ్చగానూ ఉండేది” అన్నారు భగవాన్.
“హిందూదేశమంతా ప్రచారం చేసి బోధించే నిమిత్తం భగవానుని తీసుకొని
వెళ్తామని కూడా ఎవరో ప్రయాణం చేసారట కదూ?” అన్నారింకొకరు. “ఆ--
అవును. రాజేశ్వరానంద స్వామియే. పూర్వం కొన్నాళ్ళు వారిక్కడ ఉన్నారు
కదూ. అప్పుడు భారతదేశంలో ముఖ్యమైన ప్రదేశాలన్నిటికీ భగవాన్ దయచేసి,
ఉపన్యాసాలిచ్చి బోధచేయాలనీ, అందుకుగాను ట్రెయిన్లో స్పెషల్ క్లాసు
ఏర్పాటు చేస్తారనీ, ఆ వూళ్ళో అన్ని రోజులూ, ఈ వూళ్ళో ఇన్ని రోజులూ
ఆగాలనీ చెపుతూ ఏవో ప్రణాళికలు వేస్తూ ఉండేవారు.పలక్కుండా విని వూరుకునేవాణ్ణి.
సమ్మతమే ననుకున్నారు. కడకు ఒకనాడు ప్రత్యేక క్లాసూ అదీ, యిదీ ఏర్పాటు
చేసి వారి సామానంతా మూటకట్టి 'స్వామీ! బయలుదేరుదామా?' అన్నారు.
“ఆహా! దానికేమి! పోయిరండి' అన్నాను. “భగవానో?' అన్నారు. 'నేనా, ఎందుకు?
అన్నాను. 'ఆధ్యాత్మతత్వం భారతదేశంలో బోధించాలి స్వామీ!' అన్నారు. 'సరిసరి.
చేసేదేమి? ఉండేదెక్కడ? పోయేదెక్కడికి? నాకెక్కడికి పోయేందుకు స్థలం లేదే అన్నాను.వారు నిర్ఘాంతపోయారు. చాలామంది మోటార్లు వచ్చిన కొత్తలో ఉబలాటంకొద్దీ కొని ఇక్కడికి తెచ్చి 'భగవాన్ ఒక్కసారి ఎక్కితే కొండ చుట్టూ తిప్పుకొని వస్తాం.దయచేయండి' అని తొందర చేయండని తొందర చేసేవాళ్ళు. అవన్నీ ఎక్కి
ఎక్కడికి పోయేదీ?” అన్నారు భగవాన్.
మహావాక్యరత్నమాలలో చూడు.
"కిం కరోమి క్వ గచ్ఛామి కిం గృహ్ణామి త్యజామి కిం ||
యన్నయా పూరితం విశ్వం మహాకల్పాంబునా యధా||
Comments
Post a Comment