రమణాశ్రమం లేఖలు 270 (20.1.50)
రమణాశ్రమం లేఖలు 270 (20.1.50)
https://bhagavanraman.blogspot.com/2018/11/75.html
ముక్తికాంత
కొంతకాలం క్రిందట పుతుంబాక శ్రీకృష్ణయ్య అనే భక్తుడు శ్రీరంగనాథుని
భక్తులలో ధనుర్గాసుడనే భక్తుని చరిత్ర తెలుగులో పద్యకావ్యంగా రాసి తెచ్చి.
భగవానునకు కృతి సమర్పణ చేస్తూ కొన్ని పద్యాలూ, భగవాన్ ఆకృతి గ్రహించిన
తరువాత వీడ్కోలుగా కొన్ని పద్యాలూ విడివిడిగా రాసి యిచ్చి వెళ్ళిపోయాడట.
"స్వామీ! నా కృతీకన్యక భగవానునే తప్ప వేరొకరిని వరింపనన్నది. తమకు
ఈ కన్యాదానమిచ్చి తరింప దలచితిని. కరగ్రహణ మొనర్ప వేడుచున్నాను.
గ్రహింపుడు” అన్న భావం మొదటి పద్యాలలోనూ, 'నీవు అల్లుడవైతివి. నీతో
విందారగించితిని. ధన్యుడనైతిని. పోయివత్తును. ముందే ముక్తి కన్యకను చేపట్టావు
కనుక నా బిడ్డను చిన్నచూపు చూడవలదు” అని కడపటి పద్యాలలోనూ ఉంది.
ఇది జరిగినప్పుడు నేను వూళ్ళో లేను. తిరిగి రాగానే పై సంగతంతా చెప్పి
“ఇదుగో నేను ఇదివరకే ముక్తికాంతను పెండ్లాడానట. నా బిడ్డను చిన్నచూపు
చూడకుమని శాసించారు. చదువు” మని నాచేత చదివించారు భగవాన్.
అదీగాక ఈ విషయం అందరితోనూ తమాషాగా చెపుతూ ఉండేవారు. ఆ
తరువాత ఆ గ్రంథకర్త వస్తే మా మామగారు వచ్చారు చూచారా?" అంటూ
ఛలోక్తిగా సెలవిచ్చారు భగవాన్. ఆ తరువాత కొన్నాళ్ళకు మహాదేవశాస్త్రి వస్తే
ఈ పద్యాలు వారికి చూపించి చదివించారట భగవాన్. అది వినోదార్ధమే నన్న
విషయం గ్రహించలేని రమణమ్మ అనే ఒక భక్తురాలు "ఆ పద్యాలు
రాసుకుంటా”నని భగవాన్‌తో మనవి చేసి ఆ పుస్తకం తీసుకొన్నదట. ఆ
మర్నాటి ఉదయం నేను వెళ్ళేసరికి భగవాన్ చేతిలో ఆ పుస్తకం ఉంది. శ్రీవారు
చిరునవ్వుతో నన్ను చూచి "అదుగో ఆ కూర్చున్నదే. ఆమె కృతికన్యకా సమర్పణ
పద్యాలు రాసుకుంటానని నిన్న ఈ పుస్తకం తీసుకొని వెళ్ళింది. సాయంత్రం
రాసుకొన్న కాగితం చదువుతానని తెచ్చింది. 'చాలునమ్మా చదవవద్దులే. దగ్గు
ఉంచుకొని పారాయణ చేసుకో' అన్నాను. మొన్న మహాదేవుడు వస్తే తమాషాకు
చూపాను. వాడిక్కడ చదివాడు. ఇంకేమి. స్వామికి ఇది చాలా ప్రియమనుకున్నది
కాబోలును. మహా గొప్పగా రాసుకున్నది. తనకు కావాలని కాదు. హాల్లో చదవాలనే
అంటూ పక్కున నవ్వారు. “దొంగవు, వెట్టివి, మాయావివి అని ఎవరైనా రాస్తే
భగవాన్ వేడుకగా అందరికీ చెప్తారు. అది చూచి స్వామికి ఇదే ప్రియమని
కొందరనుకుంటారు” అన్నాను. “ఆ-అదే అదే. ఇది రాసినవారు దానిని పఠిస్తే
కన్యాదానఫలం కలుగుతుందని కూడా రాస్తే బాగుండేది” అన్నారు భగవాన్.
ఆ నాలుగయిదేళ్ళకు ముందు రంగనాథయ్యరు అనే భక్తుని భార్య తన
కుమారుడు రాసిన “రమణ కల్యాణం” అనే అచ్చయిన పుస్తకం ఒకటి తెచ్చింది.
ఆమె భర్త, భగవాన్ చిన్నతనంలో శ్రీవారితో కలిసి ఆడుకున్నారట. ఆ పుస్తకమంతా
పాటలే. భగవాన్ పెళ్ళి కుమారులు. ముక్తికాంత పెళ్లికూతురు. ఓనాడు హాల్లో
అవన్నీ పాడసాగింది. బంతులాటలూ, బూజంబంతులూ, ఊరేగింపులూ, ఒక్కటీ
తక్కువలేదు. భగవాన్ అప్పుడే మావైపు చూచి "ఇదుగో చూచారా? నాకు
పెళ్ళీ అవుతోంది. అదుగో బంతులాటలూ, బూజంబంతులూ, తలుపుదగ్గర
ఆ పాటలూ, కట్నాలూ అన్నీను. పాపం స్వామికి కల్యాణం కాలేదే అని వారికి
దిగులు. ఆ కొటత ఇల్లా తీర్చారు. వినండి వినండి' అంటూ ఒకటే నవ్వు
నవ్వారు.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment