రమణాశ్రమ లేఖలు 58 సర్వ సమత్వం 12.8.46
రమణాశ్రమ లేఖలు 58 సర్వ సమత్వం 12.8.46
https://bhagavanraman.blogspot.com/2018/11/58-12846.html
గడచిన వేసంగిలో భగవాన్ సాయంకాలం "కూర్చోటానికి సౌకర్యంగా ఉంటుందని హాలుకు వెలుపల పందిరి వేసారు. ఆ పందిరికి పడమటి వైపున వట్టివేళ్ళ తడికలు కట్టి, తడికల నానుకొని భగవానులకు సోఫా వేసేవారు సాయంత్రం. ఆ సోఫాకు తూర్పు దిశగా పురుషులంతా కూర్చుంటే భగవాన్ దక్షిణాభిముఖులై దక్షిణామూర్తివలే కూర్చుండేవారు. వారి పాదాల కెదురుగా మేమంతా కూర్చుండే వాళ్ళం. మా దృష్టి సూటిగా ఉంటే భగవత్పాదారవింద దర్శనం, పక్కకు తిరిగితే చక్కని పూదోట, పైకి తిప్పితే అరుణాచల శిఖర. దర్శనం, మా భాగ్యం ఏమని చెప్పాలి! ఒకనాటి సాయంత్రం నాలుగు ముప్పావుకు బయటికి వెళ్ళిన భగవాన్ తిరిగి రాకముందే మబ్బుగా ఉండటం వల్ల వట్టివేళ్ళ తడికలు పైకెత్తి కట్టారు సేవకులు. భగవాన్ వచ్చి కూర్చున్న పది నిమిషాలకే ఎండ తెరదీసినట్లు వచ్చింది. సాయంకాలపు టెండ అయినప్పటికీ వేసవి కావటంవల్ల అందరిపైన వేడిసోకి రవంత కష్టం కలిగించింది. పై బట్ట అయినా లేని భగవాన్ మీద ఆ ఎండపడితే చూచి సహించలేక, సేవకులలో ఒకరైన వైకుంఠవాసి అనేవారు డనట్లే ఊరుకున్నారు."
https://www.facebook.com/359807631501891/posts/483649432451043/?app=fbl
చల్లగా భగవాన్ వెనుక వున్న తడికలు దింపారు. భగవాన్ చూడకేగ... తలపు. వేదపారాయణ జరుగుతుండటం వల్ల భగవాన్ చూడనట్లే ఊరుకు పారాయణ ముగియటంతోటే అందుకున్నారిక చిరాకుతో చూడండి చేష్టలు. నా ప్రక్కనున్న తడికలు మాత్రం దింపారు. మిగతా వారంతా మనుగడ కారు కాబోలు. స్వామికి మాత్రం ఎండ తగలకూడదు. మిగతా వారంగ తగిలినా ఫరవాలేదు. స్వామికి మాత్రం ప్రత్యేకం. ఎల్లాగైతేనేం స్వామితం నిలబెడుతున్నారు. పాపం, ఇలాగుంటే గాని స్వామీకాదు కాబోలు. ఎండ తాకగూడదు, గాలి సోకగూడదు, వెలుగు చూడగూడదు, కదలగూడడు. మెదలగూడదు. కాళ్ళు, చేతులు, ముడుచుకొని సోఫామీద కూర్చోవాలి: ఇది. స్వామిత్వం. దీనికేం లోపం వస్తుందోనని ఇందరిలో నన్ను ప్రత్యేకించి చూపిస్తూ స్వామిత్వం నిలబెడుతున్నా రెలాగో” నన్నారు భగవాన్. పాపం ఆ సేవకులు బెదరి, యథాప్రకారం తడికలు ఎత్తివేస్తారు. సంజ, కెంజాయలు భగవాన్ పైన సోకి కనులకెంపులో కలిసిపోయినవి. అగరువత్తుల ధూపం అన్ని దిశలను వ్యాపించి, చల్లని పిల్లగాడ్పుతో సఖ్యం చేసుకొని, భగవాన్ పాదపద్మములకు ప్రణమిల్లి భక్తులందరకు వింజామరలు విస్తరింది
T.me/BhagavanRaman
Comments
Post a Comment