రమణాశ్రమ లేఖలు 59 యథేచ్చ 13-8-1946

రమణాశ్రమ లేఖలు 59 యథేచ్చ 13-8-1946
https://bhagavanraman.blogspot.com/2018/11/5713-8-1946.html
     బెంగుళూరునుంచి వచ్చిన కోమటి కుర్రవాడొకడు తల జడలు కట్టుకొని, మధుకర వృత్తితో జీవిస్తూ, అరుణాచలేశుని దేవాలయంలో పడుకుంటూ, నేను వచ్చిన కొత్తరోజుల్లోనే రెండు మూడేళ్ళు ఉన్నాడిక్కడ. అప్పుడు వాని తల్లి ఆశ్రమానికి వచ్చి వానిని ఇంటికి రమ్మని వొత్తిడి చేయడం ప్రారంభిస్తే పండరీపురానికి పారిపోయినాడు. ఆమెకి ఇతడొకడే మగబిడ్డ. కావలసినంత ఆస్తి. వీడో ఏదీ వద్దనే అదొక విధమైన విరాగి. ఆ తల్లి మొర పెట్టుకుంటే ఒకటి రెండుసార్లు తల్లిమాట వినమని చెప్పి చూచారు భగవాన్. వినలేదు. పారిపోయినాడు.
https://www.facebook.com/359807631501891/posts/483028159179837/?app=fbl
     గత ఆషాడ మాసంలో మళ్ళీ వచ్చాడు. వాడెప్పుడూ పలక్కుండా హాలులో ఒక మూల కూర్చుని సాధనో, ఏదో, వాడి తిప్పలు వాడు పడుతూ ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండేవాడు. ఇప్పుడు జడలు తీసివేశాడేగాని కార్యక్రమం మార్చుకోలేదు. భగవాన్ చూస్తూనే వున్నారు. వాడూ పలకలేదు. వారూ పలకలేదు. పదిహేనురోజులు గడిచిన వెనుక, ఒక మధ్యాహ్నం ఉద్యోగం చాలించుకొని వచ్చిన మన రాజగోపాలయ్యగారు యథాప్రకారం లైబ్రరీ పనిలో హాల్లో హాజరై ఈ కోమటి బిడ్డను చూచి "పండరీపురం నుంచి వచ్చాడే ఎప్పుడో. వాళ్ళ అమ్మ వీడు వస్తే జాబు వ్రాయమని అడ్రెస్ ఇచ్చింది కదా" అన్నారు భగవాన్ తో.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
      "అవును, వచ్చారు. పదిహేనురోజులైనట్లుంది. చూస్తూనే వున్నాను. మాట్లాడరాయెను. పండరీపురం ఎట్లా ఉందనీ, ప్రసాదం ఏదనీ, నేనెక్కడ పోయి అడిగేదీ? వారో మాట్లాడరు! వారి వారి చిత్తవ్రుత్తిననుసరించి గదా మనం పోవలసివుంది. ఎవరెవరి చిత్తవృత్తి ఎట్లా వుంటే వారి వారి చిత్తానుసారం పోవలసిన విధి మనకున్నది" అన్నారు భగవాన్. విజ్ఞులంతా తమ తమ చిత్తాలను తరిచి చూచుకున్నారు. తక్కినవారి సంగతి దైవానికెరుక. ఎవరెవరి చిత్తవృత్తి ఎట్లా వుంటే వారి వారి చిత్తానుసారం పోవలసిన విధి వారికున్నదట- చూచావా ఎంత మాటో? ==> సూరి నాగమ్మ   
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ