రమణాశ్రమం లేఖలు 272 (6.2.50)

రమణాశ్రమం లేఖలు 272 (6.2.50)
Https://bhagavanraman.blogspot.com/2018/11/272-6250.html
మిరపకాయ మాహాత్మ్యం

1947 ఏప్రిల్ చివరవారంలో భారతి పత్రిక వచ్చింది. అందులో పల్నాడు
మిరపకాయ యొక్క శ్రేష్టత్వం వర్ణించి దానివల్ల కఫదోషం మొదలైన వ్యాధులు
పోతాయనీ, మిరపకాయ జీర్ణకారీ అనీ, అది వంటికి ఎంతో మంచిదనీ, వాటితో ఎన్నో మందులు చేయవచ్చుననీ, అది బలకరమనీ, బుద్ధి వికాస
కలుగజేస్తుందనీ ఇంకా ఎన్నో ప్రమాణాలతో ఒక వ్యాసం రాసి ఉంది.
భగవాన్ చూచి నవ్వుతూ అదంతా నాచేత అప్పుడే చదివించి ఆశ్రమం డాక్టర్లను
చూచి "ఇదుగోనండీ. మీరంతా నన్ను కారం తగ్గించి తినమంటారే
ఆ మిరపకాయ మాహాత్మ్యం భారతిలో ఎలా రాసారో వినండి. నాగమ్మ
చదువుతుంది. అది శ్లేష్మానికి మంచిదట. బలకరమట. ఎన్నో సుగుణాలు
చెప్పారందులో” అని చెప్పి ఆ పత్రిక జాగ్రత్తగా దాచి పెట్టమని వెంకటరత్నాన్ని
అజ్ఞాపించారు.
దీన్నింత జాగ్రత్తగా దాచమంటా రెందుకా అని మేమిద్దరం అనుకున్నాం.
పదిరోజులు దాటిన తరువాత రిటైర్డ్ సర్జన్ గణపతి అయ్యరు భార్య జానకీ
అమ్మాళ్ కొందఱు స్త్రీలతో సహా వచ్చి కొద్దిరోజులు ఉందిక్కడ. ఆమె ఒక
దినం మధ్యాహ్నం మూడింటికి భగవాన్నుద్దేశించి "భగవాన్ శరీరం చాలా
చిక్కిపోతున్నది. కారం పూర్తిగా మానివేసి బలకరమైన పదార్థాలన్నీ తినాలి,
కారం తింటేనే మనుష్యులు ఎండిపోతారు' అంటూ ఎన్నో ప్రమాణాలు నిరూపించి
చెప్పసాగింది. సమీపస్టులొకరు “భగవాన్ శరీరానికి కారం ఏమీ చేయదమ్మా"
అంటే ఆమే వినిపించుకోక అదే ధోరణిలో మాట్లాడింది.
సమీపస్తులు మళ్ళీ ఏదో చెప్పబోయినారు. భగవాన్ వారిని వారిస్తూ
“ఉండండయ్యా మీరు. ఆమె సర్జన్ గారి భార్య. ఆయన మందులిస్తే,
ఈమె పథ్యపానాదులు చెపుతుంది. మీకేం తెలుసును' అని సెలవిచ్చి
ఆమెవైపు తిరిగి “మీరు మంచిది కాదంటారు. మొన్న భారతిలో మిరపకాయ
యొక్క శ్రేష్ఠత్వాన్ని గుణించి పెద్ద వ్యాసమే రాసారు. నేను ఎవరిమాట
వినేదీ? ఉండండి చదువుతారు. వింటే మీకే తెలుస్తుంది. ఎండిపోతారని
మీరంటారు. పల్నాటి రెడ్లంతా మిరపకాయలు దిట్టంగా తినడంవల్లనే కండలు
పెరిగి బలిష్ణులై ఉన్నారట. కారం ఎక్కువ తినడం వల్లనే ఆంధ్రులకు
బుద్ధి వికాసము, ధైర్య సాహసాలు, పట్టుదల బాగా ఉన్నవట. ఉండండి విందురుగాని" అని చెప్పి వెంకటరత్నం చేత పుస్తకం తెప్పించి చదివించారు.భగవాన్.

ఆమె మరి మాట్లాడలేకపోయింది.

Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ