రమణాశ్రమ లేఖలు 271 (4-2-50)
రమణాశ్రమ లేఖలు 271 (4-2-50)
https://bhagavanraman.blogspot.com/2018/11/271-4-2-50.html
ఛలోక్తులు
సుప్రసిద్ధ కవిశేఖరుడైన సుబ్రహ్మణ్య భారతుల వారు దివంగతులైన
తరువాత వారి జ్ఞాపకార్థం తిరునల్వేలి జిల్లాలో ఎట్టెయ్యాపురం అనే మాట
ఒక భవనం నిర్మించి అందులో వారి చిత్రపట స్థాపనం చేయాలని 1
10-47 తేదీకి ముహూర్తం నిర్ణయించారు. రాజగోపాలాచారి భవనం
తెరిచేటట్లూ, రామస్వామి రెడ్డియారు భారతి చిత్రపటం తెరిచేటట్లు ఏర్పాటు
చేసారట. అందుకు ముందుగా అయిదారు రోజులనుండీ ఇకు
రాజగోపాలయ్యరూ, కృష్ణస్వామీ కలిసి న్యూస్ పేపర్లో వచ్చిన భారతి
చిత్రపటమూ, ఆ భవనం చిత్రపటమూ కత్తిరించి ఒక అట్టమీద భారతి
చిత్రం పైవరుసనా, భవనం చిత్రం కింది వరుసగా అతికిస్తూ ఉంటే భగవాన్
వారికి అన్నివిధాలా సలహాలిస్తూ వచ్చారు. 11-10-47 తేదీకి పూరీ
అయింది. వాళ్ళిద్దరూ అది తెచ్చి భగవానునకు చూపారు. శ్రీవారు
చిరునవ్వుతో “ఇంకేమోయ్. దీనికి కింద ఒకటీ, పైన ఒకటీగా బొందులుపోసిన
కుచ్చుగుడ్డలు రెండు కట్టి, వీటిమీద కప్పి ఉంచండి. అక్కడ రాజగోపాలాచారి
గవర్నరైతే ఇక్కడ రాజగోపాల అయ్యరు గవర్నరు. రామస్వామి రెడ్డియారక్కడ
మంత్రి అయితే కృష్ణస్వామి రెడ్డియారిక్కడ మంత్రి. రేపు ఏం చేస్తారంటే,
సరిగ్గా అక్కడ ఏ వేళకు భవనం, ఫోటో తెలుస్తారో అదేవేళకు ఒకరు ఈ
భవనం మీద బట్ట తొలిగిస్తే, ఒకరు భారతి ఫోటో మీది బట్ట తొలిగించండి.
సరిపోతుంది” అని సెలవిచ్చారు.
1947లోనే ఒకనాడు ఉత్తరదేశస్తులైన ఒక భక్తునకు భగవాన్ మధ్యాహ్నం
ఒకటిన్నరనుండీ సాయంత్రం నాలుగు దాటేవరకూ ఏదో బోధిస్తూనే ఉన్నారు.
నాలుగుంపావుకు పోస్టు వచ్చింది. పోస్టు వెళ్ళేసరికి నాలుగూ ముప్పావు దాటింది.
బయటికి వెళ్ళే వేళ మించుతున్నదని సేవకులు కట్టి కమండలం పట్టుకొని
నుంచున్నారు. భగవాన్ -కాళ్ళు సర్దుకుంటూ “ఉండండయ్యా ఉండండి.
మిరపకాయ మాహాతం -
అమభక్తుడైన ఆంజనేయులవారి అయ్యగారు వచ్చి కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు.
వారేం సామాన్యులా? త్వరగా విడువరు. చల్లగా సర్దుకోవాలి. కొంచెం
నిలవండి" అని సెలవిచ్చి మోకాళ్లకు తైలం రుద్దుకొన్న తరువాత లేచారు.
వాయువు నొప్పులవల్ల మోకాళ్ళు పట్టు పట్టినవనే శ్లేషార్థమిచ్చే శ్రీవారి
చమత్కారమైన మాటలకు సభ్యులలో కొందరు చకితులై నవ్వారు.
భగవాన్ బయటికి వెళ్ళి తిరిగి వచ్చి, సోఫామీద కూర్చోగానే ఒకరు పక్కనున్న
కుంపట్లో ధూపం వేసారు. అది కొంచెం ఎక్కువగా పడడంవల్ల పొగ గుప్పున
లేచి భగవాన్ ముఖమంతా ఆవరించి ఉక్కిరి బిక్కిరి గావించింది. “కిటికీలు
తెలుద్దామా?” అన్నారొక సేవకులు. “ఉండనీయండయ్యా ఉండనీయండి.
గుళ్ళో స్వామికి ధూపం వేసి బాగా పారాలని విసనకఱ్ఱతో స్వామివైపు పారేట్లుగా
విసరుతారు. మీరు పోగొట్టేందుకు యత్నిస్తారెందుకు? ఇది తనంతట తానే
భగవాన్ అంటూ ఉండగానే ఒకరు చేతితో విసిరారు. గప్పున మంట వచ్చింది.
వస్తోంది. స్వామికి బాగా ధూపం వేయాలని కదా వేసారు. రానీయండి." అని
భగవాన్ శరీరానికి సెగ తాకిందేమోనని మేమంతా గాబరా చెందుతూ ఉంటే
ఇప్పుడు సరిపోయిందయ్యా" అంటూ సెలవిచ్చి మౌనం వహించారు.
శ్రీవారు చిరునవ్వుతో “ఆ-ఇది సరి. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment