రమణాశ్రమం లేఖలు 266 (26-12-40)
రమణాశ్రమం లేఖలు 266 (26-12-40)
https://bhagavanraman.blogspot.com/2018/11/266-26-12-40.html
తైలాలూ వెన్న
1944 సెప్టెంబరు-అక్టోబరు ఆ ప్రాంతంలో ఆచంట లక్ష్మీపతిగారిది చిన్న
యుర్వేద పుస్తకం వస్తే భగవాన్ చదివి, దాల్లో రాసి ఉన్న కర్పూరాది తైలం
తయారు చేయించి కాళ్ళ నొప్పులకు వాడుతూ వచ్చారు. అది చూచి కొందరు
రకులు నారాయణతైలం మంచి” దనీ “మహానారాయణ తైలమైతే మరీ మంచి"
దనీ, ఇంకా అదనీ, ఇదనీ భగవాన్‌తో మనవి చేయసాగారు. వినీ వినీ విసుగుతో
కుషస్వామి “ఆ-సరి. ఎన్ని తైలాలని వాడుతాము. ఎన్ని రుద్దినా నొప్పి పోలేదు”
అన్నాడు. “ఓహో! వారేదో వాటి మంచిని గుణించి మాట్లాడుతూ ఉంటే
మీకేందుకయ్యా విసుగు” అన్నారు భగవాన్.
“ఏదో ఒక వైద్యం చేస్తున్నాం కదా. ఊరికే ఉండకుండా, అంతా తలా,
ఒకటీ చెబితే ఎలా? అవన్నీ ఎన్నిసార్లు రాయలేదూ. నొప్పిపోయిందా?” అన్నాడు
కృష్ణస్వామి. “సరేనయ్యా. అసలు పోవాలని మీరు రుద్దలేదు కనుక అది
పోలేదు. పోవాలని రుద్దితే అదెందుకు పోదు? పోలేదు కనుక వారు అవన్నీ చెపుతున్నారు. పోతే ఎందుకు వస్తారు?
కర్పూరాదితైలంవల్ల కొంచెం గుణంగా ఉంది కదా. అవన్నీ ఎందుకు చెప్పడం?” అన్నాడాతడు. “అయితే, దీంతో మాత్రం సాంతం పోతుందంటావా?” అన్నారు
భగవాన్. “ఏమో, చూద్దాం” అన్నాడు కృష్ణస్వామి. “ఆ-అదీ సమాచారం.
సాంతం పోవాలన్న సంకల్పంతో మీరు రాస్తే అది పోతుంది. కానీ, నొప్పి పోతే
స్వామి కాళ్ళు పట్టనీయరని మీకు సందేహం. అందువల్ల పోకుండా ఉండాలనే
రుద్దుతారు. అదెందుకు పోతుంది” అని సెలవిచ్చారు భగవాన్
ఆ రోజుల్లోనే ఒకనాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఒక భక్తుడు
మందుడబ్బీ ఒకటి భగవాన్ చేతికిచ్చి “ఈ మందు రాస్తే కాళ్ళనొప్పులు తగ్గుత'
'వనీ, “భగవాన్ వాడేట్టుంటే నేను మద్రాసు వెడుతున్నాను కనుక వచ్చేప్పుడు
ఒక డజను డబ్బీలు తెస్తా” ననీ మనవి చేసాడు. “సరి సరి. బాగుంది. ఇప్పుడున్న ఈ కర్పూరాది తైలాలు చాలును. అంత ఖరీదుగల మందులు మనకెందుకు?
ఆహారనియమం ఉంటే ఏ మందూ వద్దు. ఈ మందుల వల్ల కొన్నాళ్ళు పోయినట్టే
ఉంటుంది. మళ్ళీ మొదలుపెడుతుంది. ఆహారంలో ఏవో హెచ్చుతగ్గులు వస్తవి.
దాంతో సరి” అన్నారు భగవాన్. పోనీ ఆహారంలోనే నియమంగా ఉంటే
సరిపోతుంది భగవాన్. ఆ పనైనా చేస్తే మంచిది కాదా?” అన్నాడా భకుడు.
“అవునండీ. మంచిదే. కానీ, నాకెలా నియమం సాగుతుంది. మిరియాల
చారుతో అన్నం తిందామంటే ఆ దినమే ఎవరిదో భిక్షంటారు. వడా పాయసం
తప్పదు. స్వామి దగ్గరకు వచ్చేసరికి వడ్డించేవారి చెయ్యి పెద్దదవుతుంది. భక్తి
కదా, మనకు ఎక్కువ వడ్డిస్తారు. సరే. తినవలసిందిగా ఉందని ఇష్టం వచ్చినట్లు
అన్నీ తింటూ ఉంటే ఏదో వస్తూనే ఉంటుంది. మందులతో ఎలా పోతుంది?
దానంతటది పోవాలి. కొండమీద ఉండగా దగ్గు అపారంగా ఉండేది. ఎన్నో
టానిక్కులు ఇచ్చారు. ఏం తిన్నా పోలేదు. క్రిందకు వచ్చాను. ఇక్కడి మూలికల
గాలివల్లనో ఏమో చిత్రంగా అదేపోయింది. ఈ అడవియే చ్యవనప్రాశ అయింది.gg
అదే విధంగా ఇదీ పోతుంది. ఈ డబ్బీ చాలును. ఇక తేకండి” అని సెలవిచ్చారు భగవాన్.
భగవాన్, ఒక భక్తుడందుకొని “స్వామీ! కొందరు సమాధి నుండి లేవగానే వెన్న మాత్రమే తిని ఉంటారట.ఆ విధంగా ఉన్నవారిని కొందరిని చూసాము. ఎలా ఉంటారో? అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. భగవాన్ నవ్వుతూ "ఆహా దానికేమి. ఆకులో పట్టెడు వెన్నముద్ద పెట్టుకొని తింటే ఇక ఆకలెలాగ అవుతుందీ? అందుకు సమాధినుండి లేవనక్కరలేదు. అంతా తినవచ్చును.
కొన్నికొన్ని మూలికలుంటవి. అవి తింటే ఆకలే ఉండదు. కొందరవి జేబుల్లోనో,సంచీలోనో వేసుకొని ఒక్కొక్కటే తింటూంటారు. ఇక ఆకలి ఎందుకుంటుంది?
'ఆహారం లేకుండానే ఉన్నాడు ఈ స్వామి, బలే దొడ్డవాడం'టారు. ఇంకేం.స్వామిత్వం వచ్చేస్తుంది” అని ఛలోక్తిగా సెలవిచ్చారు.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment