రమణాశ్రమం లేఖలు 264 (16-12-49)

రమణాశ్రమం లేఖలు 264 (16-12-49)
https://bhagavanraman.blogspot.com/2018/11/264-16-12-49.html
వ్యామోహం

1942-43 ప్రాంతంలో జగదీశ్వరశాస్త్రిగారు ఇక్కడ ఉన్నప్పుడు వారి
కుమారుడు మధుర వేదపాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ ఒకసారి సెలవు
రోజుల్లో ఇక్కడికి వచ్చాడు. చిన్నవాడాయె. ఉబలాటం కొద్దీ గిరజాల జుట్టు
పెంచుకున్నాడు. హాల్లోకి వచ్చి నమస్కరించి లేవగానే భగవాన్ తేరిపార చూచి
చిరునవ్వుతో “అరే, నీవా? ఈ జుట్టూ గిట్టూ వాలకం చూచి ఎవరో
అనుకున్నాను. అరే అప్పా, ఎల్లాగున్నావో! శాస్త్రిగారి కుమారుడంటే ఎవరు
నమ్ముతారు?" అన్నారు. పాపం అ కుర్రవాడు సిగ్గుపడి మరుదినమే పిలక జుట్టుతో
హాజరైనాడు. భగవాన్ అది చూచి "ఆ"ఇది సరి. జగదీశ్వరశాస్త్రి కుమారుడు, గురుకులవాసం చేసే బ్రహ్మచారి, గిరిజాల జుట్టుతో ఉంటే
ఆక్షేపించరటోయ్"? అని సెలవిచ్చారు.

1943లోనే గుఱ్ఱం సుబ్బరామయ్యగారు అయిదారేళ్ళ తల్లిలేన తన పిల్లను
వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఆ బిడ్డ రెండుపక్కలా రెండు జడలు
ఉండడం చూచి "ఏమమ్మా ఈ రెండేనా జడలు. ముందు వైపున
నడినెత్తిన రెండూ వేసుకోరాదూ?" అంటూ నవ్వారు భగవాన్ లోగడ
కొందరు పిల్లలను ఈ విధంగానే చూచి ఇల్లాగే సెలవిచ్చారు భగవాన్,
బిడ్డకు సిగ్గుతోచి నా వద్దకు వచ్చి ఒకే జడగా అల్లించుకొని భగవాన్ సన్నిధికి
వెళ్ళింది. భగవాన్ నవ్వుతూ "ఆ-ఇది బాగున్నదమ్మా" అంటూ తండ్రితో "ఇదుగో
చూడండి. ఆ ఐరోపియన్ స్త్రీలంతా ఇక్కడికి వచ్చి చీరెలు కట్టుకొని
జడవేసుకొని, పూలు పెట్టుకొని మనవాళ్ళలాగా ఉండాలని యత్నిస్తూ ఉంటే
మనవాళ్ళు వాళ్ళని అనుకరించాలనుకుంటారు. ఏం చేస్తాం" అని సెలవిచ్చారు.
1943-44 ఆ ప్రాంతంలోనే మెక్ ఐవర్ అనే దొర ఇక్కడే నివాసంగా
ఉండేవాడు. అతడొక దీపావళికి సరిగతో ఉన్న సేలం పట్టంచు ధోవతి బిళ్ళగోచి
పెట్టి కట్టుకొని పైన అలాంటిదే ఉత్తరీయం కప్పుకొని, భగవాన్ సన్నిధికి వచ్చిన
నమస్కరించి, విభూతికుంకుమ నొసట పెట్టుకొని హాలుకు వెలుపల పద్మాసనం
వేసుకొని, కళ్లుమూసుకొని కూర్చున్నాడు. భగవాన్ ముసిముసినవ్వులు
నవ్వుకుంటూ కిటికీలోంచి చూస్తూ ఉన్నారు. అంతలో రాజగోపాలయ్యారు
హాల్లోకి వచ్చాడు. భగవాన్ పైకే నవ్వుతూ "ఏమోయ్. మెక్ ఐవర్ శాస్త్రిగారు
వచ్చారు చూచావా? అదుగో అక్కడ కూర్చున్నారు. నిజంగా వారిని ఇప్పుడు
చూస్తే శాస్త్రులవారు కాదని ఎవరంటారు? మీరంతా గూడకట్లు కట్టి, సూట్లు
బూట్లూవేసి తిరుగుతుంటే వారు శాస్రుల్లవారల్లే తయారైనారు. మేళ్ళో జందెము ఒక్కటే తక్కువ, ఇప్పుడు మనవాళ్ళు అదీ తీసివేస్తున్నారు కనుక బాధలేదు. చూడవోయ్ " అన్నారు.

భగవాన్ సాధారణంగా ఎప్పుడెవరికి బోధించినా  తమిళ్, తెలుగు,మళయాళం ఈ భాషల్లోనే తప్ప ఇంగ్లీషులో బోధించరు. ఆ విషయం తెలిసి కూడా తమిళ్ తెలుగు మలయాళం యువకులలో కొందరు శ్రీవారిని ఇంగ్లీషులో ప్రశ్నలడుగుతూ ఉంటారు. తర్జుమా చేసేవారు
భావం రాకా అప్పుడప్పుడు అవస్థగా ఉండడం చూచి నాలాంటి వారెవరైనా
ప్రశ్నలడుగుతూ ఉంటారు. తర్జుమా చేసేవారు అదనుకు లేకా, ఉన్నా సరిగా భావం రాక అప్పుడప్పుడూ అవస్థగా ఉండటం చూచి నాలాంటి వారెవరైనా వీళ్ళంతా స్వభాషలో అడగరాదా? ఇంగ్లీషులో అడుగుతారెందుకో? అని భగవాన్ తో మనవి చేస్తే వారలా ఎందుకడుగుతారు? స్వమిని పరిక్షించ వద్దా ఏమి? వారు ఇంగ్లీషులో పాండిత్యం సంపాదించారు. ఈ విషయం అందరికీ తెలియవద్ధూ? అదే గాక స్వభాషలో సారం లేదనే వారి భావం. ఆ భాషా వ్యామోహం అలా చేయిస్తుంది. వారేం చేస్తారు పాపం. ఉన్నదంతా బయటికి రావద్దూ"? అని సెలవిస్తూ ఉంటారు భగవాన్.

Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ