రమణాశ్రమ లేఖలు 263 (14-12-49)

రమణాశ్రమ లేఖలు 263 (14-12-49)
https://bhagavanraman.blogspot.com/2018/11/263-14-12-49.html
ముగ్గులు

1944లో ఒక పండుగనాడు కొందరు స్త్రీలు బియ్యం రుబ్బి ఆ తడి పిండితో
ఆశ్రమంలో అన్నిచోట్ల ముగ్గులు పెడుతూ ఉన్నారు, భగవాన్ గోశాలవైపు
నుండి వస్తూ ప్రక్కనున్న వారితో "చూడు వాళ్ళు. ఎందుకొచ్చారో ఏం చేస్తున్నారో.
మనస్సంతా దానిపైన పెడతారు. ఏం చేస్తాం. ఊ ఊ కానీ, తొక్కకుండా
రండి. వాళ్ళు అంత శ్రమపడి పెడితే మనమెందుకు తొక్కటం." అంటూ
కాళ్లు ఆ ముగుమీద పడకుండా దాటి వచ్చి కూర్చున్నారు.

    ఆ వెంటనే ఆశ్రమంలో కైంకర్యం చేసే ఒక ముసలమ్మ హాలుకు ఎదురుగా
ఉన్న గడపల కింద ఉన్న నేలమీద పొడి ముగ్గులతో రంగవల్లులు తీర్చడం
శ్రీవారి కంటపడ్డది. "పాటీ" అని పిలిచారు భగవాన్, "-వస్తున్నా" అంటూ
ఎంతో సంతోషంతో వచ్చిందా అప్పు, "ఇదుగో పాటీ (అవ్వా) ఎంతో శ్రమపడి
ముగ్గులు పెడుతున్నావుకాని, అది బియ్యపు పిండేనా?" అన్నారు భగవాన్.
“లేదు, రాతియుగే" అన్నదా యవ్వ. "అయ్యో! చీమలకైనా ఉపయోగం
ఉండదే. అదుగో వాళ్ళూ పెడుతున్నారు. వృథా కాలయాపనమే తప్ప ప్రయోజనం ఏముంది. చీమలు తినకుండా సూరి పెడుతున్నారు. ముగ్గులు పెట్టడం అంటే చీమలకు  ఆహారం వేయడం అన్నమాట. ఆ ధర్మం విడిచిపెట్టి అచ్చంగా రాతిముగ్గే పెడితే చీమలు ఆ పక్కకే రావు సరికదా, ఒకవేళ వచ్చినా ఆ ఘాటుకు చచ్చిపోతవి కూడాను. ఎందుకది. కొంచెమైనా బియ్యపుపిండి చేర్చుకోండి"అని సెలవిచ్చారు భగవాన్.

ఆంధ్రులొకరు  అందుకొని "ధనుర్మాసంలో ముగ్గులు అధికంగా పెట్టడం చీమలకు
ఆహారం వేయడానికేనా? అన్నారు “అ-కాక మరేమిటి? కొత్త ధాన్యం వచ్చిందన్న సంతోషంతో రంగవల్లులు తీర్చి చీమలకు ఆహారం వేస్తారన్నమాట.
జ నిర్ణయించిన ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కూడినవే. ఇప్పుడవి
పాటించేదేవరు? అలంకారానికి ఏవో చేస్తారంతే" అన్నారు భగవాన్.

Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ