రమణాశ్రమ లేఖలు 258 ( 12-11-49)
రమణాశ్రమ లేఖలు 258 ( 12-11-49)
https://bhagavanraman.blogspot.com/2018/11/12-11-49.html
తిరుచ్చుళి యాత్ర
గత నెలలో రెండు వారాలు మద్రాసులో మీ యింట్లోనే ఉండి మొన్ననే
ఇక్కడికి వచ్చానా? ఈ వ్యవధిలో భగవాన్ శరీరస్థితి ఎంతో మారింది. అందువల్ల,
విశ్రాంతి ఇవ్వాలని, వేదపారాయణ సమయంలో వినా భగవాన్ సన్నిధిలో సేవకులను తప్ప ఎవరినీ ఉండనీయడం లేదు. అందువల్ల భక్తుల ప్రశ్నలూ
భగవానుని ప్రత్యుత్తరాలూ అపురూపంగా ఉన్నవి. ఏమీ తోచక కాగితాలు
తిరగవేస్తే అందులో లేఖారచన ఆరంభించక పూర్వం రాసి ఉంచిన మా
తిరుచ్ఛుళి యాత్ర, ఆ సందర్భంలో భగవాన్ సెలవిచ్చిన ఛలోక్తులూ కంటబడ్డవి.
ఈ విరామకాలంలో అవి కాపీ చేసి పంపుతున్నాను.
భగవాన్ అవతరించిన తీరుచ్చుళి సుందర మందిరం 1944 జూన్_ జూలై ఒక
ప్రాంతంలో భక్తుల సహాయసంపదలతో ఆశ్రమం వారి స్వాధీనమై
సెప్టెంబరులో శ్రీవారివీ, వారి తల్లిదండ్రులవీ చిత్రపటములను ప్రతిష్టించిన
విషయం వినే ఉన్నావు. ఈ యిల్లు మరమ్మతు చేయించే నిమిత్తం సర్వాధికారి
నిరంజనానంద స్వామి సహచరులతో 17-1-45వ తేదీన బయలుదేరబోతూ
ప్రయాణాని కిప్పుడు సౌకర్యంగా ఉంటుంది. వస్తే రం” డని పిలవడంవల్ల
భగవాన్ సోదరి అలిమేలమ్మ అత్తా, మరి కొందరు స్త్రీలూ, పురుషులూ
బయలుదేరారు. ప్రత్యక్ష దైవమైన భగవానుల సన్నిధి విడిచి క్షేత్రదర్శనార్థం
వెళ్ళడానికి మనస్సు ఒప్పకున్నా కారణాంతరాలవల్ల నేనూ బయలుదేరవలసి
వచ్చింది. దాదాపు ఇరువది మంది భక్తులతో బయలుదేరడంవల్ల అదీ ఒక
వినోదంగానే ఉంది.
మధురలో దిగి అరుప్పుకోట మీదుగా ముప్పదిమైళ్ళు బస్సుమీద పోవాలి
తిరుచ్చుళికి. సర్వాధికారికి పనులుండడం వల్ల రెండు రోజులు మధురలో
ఆగవలసి వచ్చింది. కృష్ణమూర్తి అయ్యర్ ఇంట్లో మా మకాం. ఆ రాత్రి
సర్వాధికారితో సహా వచ్చిన వారందరమూ కలిసి మీనాక్షీ సుందరరేశులను
సేవించి, బొలభగవానుడు భక్తిపరవశుడై బాష్పపూరిత నేత్రాలతో చూస్తూ నిలిచెడి
అరువదిముగురు నాయనార్ల (భక్తుల)నూ చూచి వచ్చాం. మరుదినం ఉదయాన
కొందరు భక్తులు మాత్రమే కలిసి పెరుమాళ్ళు కోవెలకు వెళ్ళి మూడంతస్తులలో
మువ్విధముల విరాజిల్లే వరదరాజులను సేవించి, “భగవానుకు జ్ఞానోదయమైన
పావనగృహం ఎక్కడ?" అని అందరినీ విచారింపసాగాము.
సాంబశివయ్యరనే భగవానుని బాల్యమిత్రులొకరు జతపడి మమ్మందరిని
ఆనాటి సాయంత్రం, చొక్కనాథ వీధిలో పశ్చిమ శ్రేణిలో వున్న 11వ నెంబరుగల ఇంటికి తీసుకొని వెళ్ళారు. అతి ప్రాచీనమైన ఆ యింట్లో ప్రవేశించి మెట్ల నానుకొని ఉన్న మేడగదికి వెళ్ళాం. “శ్రీవారికి జ్ఞానోదయమైన గది యిదే.
స
ప్రయాణదినం మధ్యాహ్నం 11 గంటలకు ఉపాధ్యాయుడు విధించిన శిక్షకై
బెయిన్ వ్యాకరణం నుండి చూచివ్రాత రాయడానికి కూర్చుని ధ్యాననిమగ్నుడైన
స్థలం అదిగో అదే” అని అక్కడి వారన్నారు. నా హృదయంలో భక్తి భావం
పొంగి కంఠం రుద్దమై కళ్ళు నీళ్ళతో నిండినవి. ఆనందమో దుఃఖమో తెలియరాని
ఒకానొక అవస్థకు లోనైనాను.
16). తాను పుట్టు చోటెదియని యెంచి తన మూల బ్రహ్మమందు బుట్టు వాడే బుట్టి నాడు. దినము పుట్టువాడు ఎల్లపుడును
నవీనుడా మునీంద్రుడు.
అని ఉన్నది నలువది అనుబంధములో భగవాన్ రాసి వున్నారు కదా, లోక
కల్యాణార్ధమై శ్రీరమణులకు అట్టి పుట్టుక కలిగినందువల్ల ఆ స్థలం ఎంత
పునీతమైనదని చెప్పవచ్చును!
జ్ఞానోదయానంతరం ఆరువారాలకంటే అధికంగా అక్కడ నిలువనీయక,
"తాపత్రయాగ్నితప్త మానవులను రక్షించాలి రమ్మని” అరుణాచలుడు
ఆహ్వానించాడా? అన్నట్లు రాతపని మాని ధ్యాననిమగ్నుడైన తన్ను చూచి “ఇలా
చేయువానికి ఇవన్నీ ఎందుకు?” అన్న అన్నగారి మాట ఒక నెపంగా క్రిందికి
వచ్చి, కడుపునిండా తిని, పడకకుర్చీ మీద కూర్చుని పత్రం రాసి ప్రక్కనేవున్న
అలమరలో భద్రపరిచి పరివ్రాజకునిపలె బయలుదేరినది ఈ యిరుకు ఇంటి
సుండే కదా, బుద్ధ భగవానుడు ఆరేళ్ళు అడవిలో సంచరించి అహోరాత్రములు తపస్సు చేస్తే జ్ఞానోదయం అయ్యిందట. ఆ స్థలమే బుధ్ధగయగా సేవింపబడుతూ ఉంది. శ్రీరమణ భగవానునకో, పట్టణం మధ్యన ఒక ఇరుకు
సందులో ఉన్న సాధారణ గృహంలో, బంధుజన సంకులమై ఉన్న ఒక చిన్నగదిలో
ఏ ప్రయాసా లేకనే మరణభీతి కలిగిన మరుక్షణంలోనే జ్ఞానోదయ మయిందట.
ఎంత చిత్రం !
అక్షరజ్ఞుడు అని అనిపించుకోకముందే బాలచేష్టలను వీడని పసితనమందు
తనకు తానే గురువుగ వేంకటరమణుడు, ఆత్మానంద రమణుడుగ మారిన కల్యాణగృహం, అనుభవశూన్యులై తర్కవాదములతో కలహించే పండితుల ప్రాభవం అణచడానికి నేనెవడ" ననే బ్రహ్మాస్త్రమును ధరించి అరుణగిరిని
ఆరోహించడానికి బయలుదేరిన పుణ్యస్థలం ఆ విధంగా అజ్ఞాతమై ఉన్నందుకు
విచారం కలిగింది. కాని, భగవాన్ అనుగ్రహం వల్ల అచిరకాలంలో అదిన్నీ
తిరుచ్చుళీ సుందర మందిరం వలెనే యాత్రాస్థలం కాగలదన్న విశ్వాసం కలిగి
భక్తితో ప్రణమిల్లి పక్కనున్న డాబామీదుగా మెట్లు దిగేసరికి ఆ యింట్లో అవ్వ ఉంది. ఆమె పేరు సుబ్బమ్మ, వయస్సు 75. భగవానుని ప్రయాణమపుడు
ఆ వీధిలోనే ఉన్నానని శ్రీవారి చిన్ననాటి కథలుకొన్ని చెప్పింది. ఆమెవద సెలవు
పుచ్చుకొని బసకు చేరాం,
మరుదినం ఉదయమే బస్సులో బయలుదేరి అరుప్పుకోట దాటి ఈ తిరుచ్ఛుళి సమీపించేసరికి ముందుగా భూమినాథేశ్వరాలయ గోపురం గోచరించింది.
తరువాత ప్రాకారసహిత దేవాలయం, అది దాటగానే సుందరమందిరం వచ్చి
బస్సు నిలిచింది. అంతాదిగి భగవదవతార గృహంలో ప్రవేశించి, మాతాపితరుల
మధ్య పద్మాసనస్థులై ఉన్న శ్రీరమణుల చిత్రపటం చూచి హర్షపులకితగాత్రులమై
నమస్కరించాం. వచ్చిన మేమూ, మమ్ము చూడవచ్చినవారూ అంతా సలభైకి
పైగా జనం ఆ యింట్లోనే భోజనాదులు చేసి సుఖంగా విశ్రమించడం చూచి
ఊరివారంతా సుందరమయ్యరు కాలంలో ఈ యిల్లు ఇలాగే ఉండేదని చెప్పి
సంతసించారు.
మూడునాళ్ళక్కడుండి, కౌండిన్య నదిలో స్నానం చేసి, కాళేశ్వరుని దర్శించి
సహాయవల్లీ సమేత భూమినాథుని సేవించి, ప్రళయరుద్రుని ప్రదక్షిణించి,
భైరవికి ప్రణమిల్లి, భగవానుని బాల్యక్రీడలకు ఉనికిపట్లగు స్థలాలన్నీ చూచాం,
తిరువణ్ణామల నుండి వచ్చిన వారిలో కొందరు యాత్రార్ధులై రామేశ్వరం వెళ్లారు.
సర్వాధికారి సహచరులతో కార్యార్థులై అక్కడే ఉండిపోయారు. నేను మాత్రం
అక్కడా ఉండక, ఎక్కడికీ వెళ్ళక 22వ తేదీ రాత్రికి మధుర వచ్చి మరుదినం
బయలుదేరి భగవాన్ పాదసన్నిధిలో వాలాను. నా రాకకు ముందే కృష్ణమూర్తి అయ్యరు రాసిన ఉత్తరం వల్ల చొక్కనాధ వీధిలోని ఇంటి విషయం ఇక్కడ తెలిసింది. భక్తులంతా నన్ను ప్రశ్నించి విని సంతసించారు. ఆ తరువాతనే ఆ ఇల్లు వనపర్తి రాజు ధనసహాయంవల్ల ఆశ్రమంవారు కొన్నారు. నాకు ఆ పుణ్యస్థలాలు చూచునప్పటికంటే
భగవాన్ సన్నిధిలో నివేదించినప్పుడు కలిగిన ఆనందం వర్ణనాతీతం. అంతకంటే అధికం ఏమంటే "అది చూసారా? ఇది చూశారా?"
భగవాన్ అక్కడి సమాచారాలడుగుతూ, తన చిన్ననాటి చర్యలు ఎన్నో చెప్పారు. చరిత్రలో లేనివి కొన్ని నోటు చేసుకున్నాను. అవి మరొక లేఖలో రాస్తాను.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment