రమణాశ్రమ లేఖలు 57 కర్తు రాజ్ఞయా ప్రాప్యతే ఫలం 11-8-1946
రమణాశ్రమ లేఖలు 57 కర్తు రాజ్ఞయా ప్రాప్యతే ఫలం 11-8-1946
https://bhagavanraman.blogspot.com/2018/10/57-11-8-1946.html
దాదాపు పది నెలల క్రితం, కృష్ణ భిక్షువు "తన ఆస్తి అన్నదమ్ములకు వ్రాసి ఇచ్చి సన్యసించి, దేశాటన చేస్తే శాంతి కలుగునా అని యోచిస్తున్నాను. భగవదాజ్ఞ ఎట్లా వుందో" నని నాకొక జాబు వ్రాశారు. భగవాన్ తో మనవి చేశాను. భగవాన్ చకితులై, "ఆ, అట్లనా? అంతా తీర్మానం చేసేశారా?" అని రవంత నిదానించి "వారి వారి కర్మానుసారం నడుస్తుంది" అన్నారు మళ్ళీ.
https://www.facebook.com/359807631501891/posts/484226102393376/?app=fbl
ఇదయ్యా సమాచారమని వారికి వ్రాస్తే "కర్తు రాజ్ఞయా ప్రాప్యతే ఫలం" అన్నారు గదా? ఆ కర్త ఏమైనాడిప్పుడు? అని మళ్ళీ జాబు. ఈసారి భగవాన్ తో మనవి చేయటానికి సంకోచించి ఏం వ్రాద్దామా అని యోచిస్తుంటే, మర్నాడే ఒక భక్తుడు "కర్తు రాజ్ఞయా ప్రాప్యతే ఫలం అన్నారే ఆ కర్త ఎవరు?" అని భగవంతులను ప్రశ్నించాడు. "కర్త ఈశ్వరుడు. వారి వారి కర్మానుసారం ఫలములనిచ్చేవాడు. అనగా సగుణ బ్రహ్మమన్నమాట. అసలు బ్రహ్మము నిర్గుణము, అచలము. సగుణ బ్రహ్మమునకే ఈశ్వరుడని పేరు. యీతడు వారి వారి కర్మానుసారం ఫలాలిస్తాడు. ఒక యేజంటన్నమాట. పనిని బట్టి బత్తెము లిస్తాడు. అంతే, ఆ ఈశ్వర శక్తి లేనిదే ఈ కర్మ నడవదు. అందుకే 'కర్మతజ్జడం' అంటారు పెద్దలు. ఇదే తాత్పర్యం" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
వారి ప్రశ్న కింతకంటే జవాబేముంది? అదే కృష్ణ భిక్షువునకు వ్రాశాను. విక్రమార్కుడు పాదరక్షల ప్రభావం వల్ల బ్రహ్మలోకానికి వెడితే బ్రహ్మదేవుడు సంతసించి వరం కోరుకోమన్నాడట. "అయ్యా, మీరు సృష్టించేటప్పుడు వారి వారి కర్మానుసారం ఫలితాలన్నీ నుదుట వ్రాస్తారనీ, ఆ వ్రాత తప్పదనీ, శాస్త్రాలు ఘోషిస్తున్నవే. ఇప్పుడు నాకు వరాలిస్తానంటారు. నుదుట వ్రాత చెరిపి మళ్ళీ వ్రాస్తారా? లేక పైపైన దిద్దుతారా? ఏమిటి కథ" అన్నాడట విక్రమార్కుడు. బ్రహ్మ అతని వివేకానికి సంతసించి చిరునవ్వుతో "ఏమీ లేదోయ్. వాళ్ళ వాళ్ళ కర్మానుసారం ఏది ప్రాప్తమో అదే వాగ్రూపంగా వస్తుంది. ఆహా ఇచ్చామంటాము. అంతే, కొత్తగా ఇచ్చేదేమీ లేదు. ఇది గ్రహించలేక వరములకై తపస్సు చేస్తారు. నీవు వివేకివి గనుక మర్మం కనుక్కున్నావు. చాలా సంతసం కలిగింది" అని చెప్పి బ్రహ్మాస్త్రం బహుమతిగా నిచ్చి పంపాడట, చిన్నప్పుడెప్పుడో చదివానిది.
భాగవతం దశమ స్కంధంలో ఇంద్రపరమైన యాగం మానిపించే నిమిత్తం నందుడికి కృష్ణుడు బోధించిన పద్యాలున్నూ ఇందుకు సరిగా వున్నవి చూడు.
కం: కర్మమున బుట్టు జంతువు
కర్మమునన వృద్ధిబొందు, గర్మమునజెడున్
కర్మమే జనులకు దేవత
కర్మమే సుఖదుఃఖములకు గారణ మధిపా||
కం: కర్మములకు దగు ఫలములు
గర్ములకు నిడంగ రాజుగాని సదా
నిష్కర్ముడగు నీశ్వరుండును
గర్మవిహీనునకు రాజుగాడు మహాత్మా||
==> సూరి నాగమ్మ
T.me/BhagavanRaman
Comments
Post a Comment