రమణాశ్రమ లేఖలు 55 గురియే గదా గురువు? 8-8-1946
రమణాశ్రమ లేఖలు 55 గురియే గదా గురువు? 8-8-1946
https://bhagavanraman.blogspot.com/2018/10/55-8-8-1946.html
నిన్న ఉదయం రామయోగిగారు భగవానుల నిట్లా ప్రశ్నించారు: "స్వామీ! సాయిబాబా శిష్యులు కొందరు బాబా పటం పెట్టుకొని పూజిస్తూ ఆ పటమే గురువంటారే ఎట్లా పొసగుతుంది? దైవమని పూజింపవచ్చు గాని గురువని సేవిస్తే వీరు పొందే లాభమేమిటి?" "చిత్తైకాగ్రత కలుగుతుంది" అన్నారు భగవాన్. కాని ఆ ఏకాగ్రత స్థిరపరచుకోటానికి గురువు కావద్దా?" అన్నారు యోగిగారు.
https://www.facebook.com/359807631501891/posts/485366642279322/?app=fbl
"అవునండీ గురియే గదా గురువు" అన్నారు భగవాన్. "ఆ గురి కుదరటానికి ఆచరణ రూపంగా చూపించే సజీవ గురువు కావాలిగాని, నిర్జీవ ప్రతిమ ఏమి జేస్తుంది? అట్లా సజీవ గురువు లేకుండానే సిద్ధి పొందటం భగవాన్ కంటే సరిపోయింది గాని మా బోటి వాళ్లకి సాధ్యమా?" అన్నారు వారు.
"వాస్తవమే, అయినా నిర్జీవ ప్రతిమను ఆరాధించినందువల్ల కొంతవరకు చిత్తైకాగ్రత కలుగుతుంది. ఆ ఏకాగ్రత స్థిరపడుటకు తానెవరో విచారించి తెలుసుకుంటే గాని కుదరదు. ఆ విచారణకు గురుసహాయమవసరమే. అందుకే ఉపాసనతో ఆగకూడదంటారు పెద్దలు. అయితే, ఈ ఉపాసన వృధా కాదు. ఎప్పటికైనా ఫలిస్తుంది. కాని ఈ ఉపాసనలో డాంబికం ఉండరాదు. మనస్సు స్వచ్ఛంగా వుంటే అంతా ఫలిస్తుంది. లేకుంటే చవిటినేలన నాటిన విత్తనమువలె వృధా అవుతుంది" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
"ఏమో స్వామీ! మీరు నూరు చెప్పండి. వెయ్యి చెప్పండి. తన నడత సరిచూచుకోటానికి మీ వంటి సజీవ గురువు కావాలిగాని, నిర్జీవ ప్రతిమలకు గురుస్థానం ఎట్లా ఇవ్వటం?" అన్నారు వారు. భగవాన్ మందహాసంతో "ఊ - ఊ" అంటూ తలవూపి మౌనం వహించారు. మౌనసహితమైన ఆ మందహాసంలో మాణిక్యాలు ఒలికినయ్యన్నా! ఏం వ్రాయమంటావు? ==> సూరి నాగమ్మ
T.me/BhagavanRaman
Comments
Post a Comment